ICICI Aura Account: మహిళా ఉద్యోగుల కోసం ఐసీఐసీఐ ప్రత్యేక అకౌంట్... ఫీచర్లు ఇవే

ICICI Advantage Woman Aura Savings Account | ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌ ఓపెన్ చేసే మహిళలకు బ్యాంకు ఇచ్చే డెబిట్ కార్డుపై పలు ఆఫర్లున్నాయి. డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, నగల కొనుగోలు లాంటివాటిపై నెలకు రూ.750 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

news18-telugu
Updated: March 9, 2019, 2:14 PM IST
ICICI Aura Account: మహిళా ఉద్యోగుల కోసం ఐసీఐసీఐ ప్రత్యేక అకౌంట్... ఫీచర్లు ఇవే
మహిళా ఉద్యోగుల కోసం ఐసీఐసీఐ ప్రత్యేక అకౌంట్... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 9, 2019, 2:14 PM IST
ఉద్యోగాలు చేస్తున్న మహిళల కోసం ఇటీవల ప్రత్యేకంగా సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించింది ఐసీఐసీఐ బ్యాంక్. ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌లో అనేకమైన ఆఫర్లు, ఫీచర్లు ఉన్నాయి. క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, రుణాలపై ప్రత్యేకమైన వడ్డీ రేట్లు లాంటివి మహిళల కోసం ఆఫర్ చేస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్. మరి మీరు కూడా మహిళా ఉద్యోగులా? సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలని భావిస్తున్నారా? అయితే ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌ ఫీచర్లు ఏంటో తెలుసుకోండి.

Read this: Credit Card: క్రెడిట్ కార్డు వాడేప్పుడు ఈ 8 తప్పులు చేస్తున్నారా?

ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌ ఫీచర్లు



ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌ ఓపెన్ చేసే మహిళలకు బ్యాంకు ఇచ్చే డెబిట్ కార్డుపై పలు ఆఫర్లున్నాయి. డైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, నగల కొనుగోలు లాంటివాటిపై నెలకు రూ.750 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దేశంలోని అన్ని బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్‌లోని మీరు సూచించిన దానికన్నా ఎక్కువగా ఉన్న డబ్బు మీ రిక్వెస్ట్‌పై ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోకి వెళ్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌ ఉన్నవారికి లాకర్ అద్దెలో 50 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.



Read this: SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్‌బీఐ

ICICI Savings Account, ICICI bank advantage woman aura savings account, ICICI bank advantage woman aura savings account features, ICICI Savings Account features and offers, ICICI Savings Account for woman, ICICI Savings Account for working woman, ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్ మహిళల సేవింగ్స్ అకౌంట్‌

ఐసీఐసీఐ బ్యాంక్ అడ్వాంటేజ్ ఆరా సేవింగ్స్ అకౌంట్‌ తీసుకున్న మహిళలకు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్ లభిస్తుంది. వడ్డీ రేట్లు వారికి ప్రత్యేకంగా ఉంటాయి. హోమ్ లోన్, హోమ్ లోన్ టాప్-అప్ తీసుకున్నవారికి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం మినహాయింపు ఉంటుంది. హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక టూవీలర్ లోన్లపై ప్రాసెసింగ్ ఫీజులో రూ.499 తగ్గింపు, వాహనానికి 100 శాతం ఆన్-రోడ్ ప్రైస్ రుణంగా పొందొచ్చు.
Loading...
ఇక వీటితో పాటు ఇతర ప్రమోషనల్ ఆఫర్లు ఉన్నాయి. Careers360, Housejoy.in, www.purplle.com/ Purplle app లో అన్ని సర్వీసులపై 15 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. క్లియర్ ట్యాక్స్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సర్వీసులపై 20 శాతం తగ్గింపు పొందొచ్చు.

Photos: ఈ 50 లగ్జరీ కార్లు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే...

ఇవి కూడా చదవండి:

Paytm First: అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా 'పేటీఎం ఫస్ట్'... ఇలా సబ్‌స్క్రైబ్ చేసుకోండి

SBI Rules: డబ్బులు డ్రా చేస్తున్నారా? మారిన ఎస్‌బీఐ రూల్స్ ఇవే

LIC Alert: మోసపోతారు జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎల్ఐసీ

 
First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...