IBLA Awards 2020: ఐకానిక్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది డికేడ్ పుల్లెల గోపిచంద్

సిఎన్‌బిసి-టివి 18 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల 15 వ ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన బ్యాడ్మింటన్ తారలకు మార్గదర్శకత్వం వహించిన పుల్లెల గోపిచంద్ ను 'ఐకానిక్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది డికేడ్' తో సత్కరించారు.

news18-telugu
Updated: February 28, 2020, 9:06 PM IST
IBLA Awards 2020: ఐకానిక్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది డికేడ్ పుల్లెల గోపిచంద్
పుల్లెల గోపీచంద్
  • Share this:
ముంబైలో శుక్రవారం జరిగిన సిఎన్‌బిసి-టివి 18 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుల 15 వ ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన బ్యాడ్మింటన్ తారలకు మార్గదర్శకత్వం వహించిన పుల్లెల గోపిచంద్ ను 'ఐకానిక్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది డికేడ్' తో సత్కరించారు.భారత జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ 1999 లో అర్జున అవార్డు, 2001 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2009 లో ద్రోణాచార్య, 2014 లో పద్మభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. గోపిచంద్ 1996 లో తన మొదటి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అలాగే వరుసగా ఐదు సంవత్సరాలు ఆ టైటిల్‌ను గెలుస్తూ తన సత్తా చాటాడు. అలాగే మొట్టమొదటి అంతర్జాతీయ టైటిల్ 1999 లో లే వోలాంట్ డి ఓర్ డి టౌలౌస్‌లో వచ్చింది మరియు అదే సంవత్సరంలో, అతను స్కాటిష్ ఓపెన్‌ను కూడా గెలుపొందాడు.

గోపిచంద్ కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శనగా 2001లో ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ గెలిచి, 1980 లో ప్రకాష్ పడుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ భారతీయుడు అయ్యాడు. ఆటగాడిగా పదవీ విరమణ చేసినప్పటి నుండి, గోపిచంద్ 2008 లో గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించి, దేశంలో బ్యాడ్మింటన్ భవిష్యత్తుకు బాటలు వేశాడు. ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ (2012 లండన్‌లో కాంస్య పతకం), పివి సింధు (2016 రియోలో రజత పతకం) శ్రీకాంత్ కిడాంబి, సాయి ప్రణీత్, పరుపల్లి కశ్యప్ వంటి వారు గోపీచంద్ మార్గదర్శకత్వంలో వారి నైపుణ్యాలను మెరుగుపర్చారు.

First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు