Home /News /business /

HYUNDAIS ELECTRIC SUV IONIQ 5 WHICH IS EXPECTED TO BE LAUNCHED IN INDIA EARLY NEXT YEAR WAS RECENTLY SPOTTED DURING ITS TEST RUNS IN CHENNAI GH SRD

Hyundai IONIQ 5: ఇండియాలో మరో అదిరిపోయే ఎలక్రిక్ SUVని తీసుకువస్తున్న హ్యుందాయ్.. లాంచ్ అప్పుడే..!

Photo Credit : Autocar

Photo Credit : Autocar

Hyundai IONIQ 5: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) ప్రస్తుతం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అదిరిపోయే ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicles) పరిచయం చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) ప్రస్తుతం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అదిరిపోయే ఎలక్ట్రిక్ వెహికల్స్ (Electric Vehicles) పరిచయం చేస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే ఇండియాలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తోంది. ఇప్పుడు మరొక ఎలక్ట్రిక్ కారు తీసుకురావడానికి సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కంపెనీ ఎస్‌యూవీ ఐయోనిక్ 5 (IONIQ 5) మోడల్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ ఎస్‌యూవీ ఇటీవల చెన్నైలో టెస్ట్ రన్ (Test Run) జరుపుకుంటూ కెమెరాల కంటికి చిక్కింది. ఈ ఫ్లాగ్‌షిప్ EV క్రాస్‌ఓవర్ అందుబాటు ధరలో, లెక్కలేనన్ని ఫీచర్లతో వస్తుంది. కోనా తర్వాత భారతదేశంలో హ్యుందాయ్‌ నుంచి విడుదలవుతున్న రెండో ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. ఇండియా-స్పెక్ హ్యుందాయ్ ఐయోనిక్ 5ని స్థానికంగా అసెంబుల్ చేయనున్నారు.

ప్రీమియం ఎలక్ట్రిక్ IONIQ 5 అనేది హ్యుందాయ్ వారి కొత్త ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP)పై బిల్డ్ చేసిన తొలి వెహికిల్. E-GMP అనేది ప్రత్యేకంగా ఈవీల కోసం తీసుకొచ్చిన ఒక ప్రత్యేక ప్లాట్‌ఫామ్. ఇది ఫాస్ట్ ఛార్జింగ్, అధిక డ్రైవింగ్ రేంజ్, మరింత ఇంటీరియర్ స్పేస్, మెరుగైన హ్యాండ్లింగ్‌ని ఆఫర్ చేస్తుంది. అలానే బ్యాటరీ ప్యాక్ వీల్‌బేస్‌లో అందిస్తుంది. ఇది మెరుగైన హ్యాండ్లింగ్ కోసం ముందు, వెనుక తక్కువ గురుత్వాకర్షణ కేంద్రాల మధ్య తగిన బరువు ఉండేలా నిర్ధారిస్తుంది. అప్పుడు సేఫ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు.

హ్యుందాయ్ ఈ కారు అధికారిక లాంచ్ టైమ్‌లైన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. వాహనం ధర గురించి కూడా ఇంకా తెలియరాలేదు. అయితే IONIQ 5 ధర రూ.40-45 లక్షల రేంజ్‌లో ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవల రిలీజైన Kia EV6 ధర రూ.59.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే IONIQ 5 Kia EV6 పోటీ ఇవ్వొచ్చని చెప్పొచ్చు. ఈ ఐయోనిక్ ఆల్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు ప్రపంచ మార్కెట్లలో 53 kW ఫ్రంట్, 120 kW వెనుక పవర్‌తో స్టాండర్డ్-రేంజ్ 58kWh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. 70 kW ముందు, 155 kW వెనుక పవర్‌తో ఇటీవలే పరిచయం చేసిన లాంగ్-రేంజ్ 72.6kWh బ్యాటరీ కూడా ఇందులో అందించారు.

ఇది కూడా చదవండి : NPS, APY సబ్‌స్క్రైబర్స్‌కు గుడ్‌న్యూస్‌.. కాంట్రిబ్యూషన్ చెల్లించడం ఇక ఈజీ..

అయితే భారతదేశంలో 58kWh బ్యాటరీ ప్యాక్, ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో బేస్ వెర్షన్‌ను హ్యుందాయ్ విడుదల చేయవచ్చని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, చిన్న బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ SUVకి 383కి.మీల పరిధిని అందిస్తుంది. హ్యుందాయ్ IONIQ 5 లెవెల్ 2 అటానమస్ డ్రైవింగ్‌తో వస్తుంది.

ఈ టెక్నాలజీ డ్రైవర్ వేగం, దూరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలానే రోడ్డు లేన్‌లను మార్చడంలోనూ డ్రైవర్లకు హెల్ప్ చేస్తుంది. ఈ SUV 7-ఎయిర్‌బ్యాగ్‌లతో అత్యంత మెరుగైన భద్రతను ఆఫర్ చేస్తుంది. దీని సరౌండ్ వ్యూ మానిటర్ (SVM) ఇరుకైన తక్కువ స్థలం ఉన్న ప్రదేశాల్లో సులభంగా, సురక్షితంగా డ్రైవింగ్ చేయడానికి వీలుగా 360-డిగ్రీల వ్యూ అందిస్తుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Electric cars, Electric Vehicles, Hyundai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు