Home /News /business /

HYUNDAI VERNA LATIN NCAP CRASH TEST HERES WHY SEDAN SCORED ZERO STAR RATING GH VB

Hyundai Verna: లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నా పేలవం.. కేవలం జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్‌ సొంతం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో తర్వాత భారత్‌లో అమ్ముడవుతున్న మరో కారు లాటిన్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో సున్నా స్కోర్ పొందింది. హ్యుందాయ్ వెర్నాకు లాటిన్ NCAP క్రాష్ టెస్ట్ తాజాగా జీరో స్టార్ రేటింగ్ ఇచ్చింది.

మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో తర్వాత భారత్‌లో అమ్ముడవుతున్న మరో కారు లాటిన్ NCAP క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో సున్నా స్కోర్ పొందింది. హ్యుందాయ్ వెర్నాకు లాటిన్ NCAP క్రాష్ టెస్ట్ తాజాగా జీరో స్టార్ రేటింగ్ ఇచ్చింది. అయితే ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. భారత్‌లో అందుబాటులో ఉన్న మోడల్‌తో పోలిస్తే.. లాటిన్ NCAP క్రాష్ టెస్ట్ చేసిన వెర్నా మోడల్‌లో తక్కువ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీంతో మన దేశంలోని వెర్నా మోడళ్లు ఈ విషయంలో మెరుగైన రేటింగ్ సాధించే అవకాశం ఉండవచ్చు. వెర్నా కారును భారత్‌తో పాటు మెక్సికోలో తయారు చేస్తున్నారు. దీన్ని అంతర్జాతీయ మార్కెట్‌లలో యాక్సెంట్‌ (Accent)గా రిటైల్ చేస్తున్నారు. అయితే ఈ కారులో ప్రైమరీ సేఫ్టీ ఫీచర్‌లు సైతం లేకపోవడం వల్ల క్రాష్ టెస్ట్‌లో పేలవ స్కోర్ పొందింది.

Amazon: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలపై మరో ఎక్స్‌క్లూజివ్‌ సేల్‌.. డీల్స్ ఇవే..!


అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా సెడాన్ 3.69 పాయింట్లు (9.23 శాతం) సాధించింది. లాటిన్ NCAP క్రాష్ టెస్ట్ నివేదిక ప్రకారం ఈ కారు.. డ్రైవర్‌తో పాటు ముందు సీటులోని ప్రయాణికుడి తల, మెడకు మంచి రక్షణను అందించింది. అయితే డ్రైవర్ ఛాతీకి తగిన రక్షణ లభించింది కానీ ముందు సీట్లలో కూర్చునే ప్రయాణికుల ఛాతీకి సరైన రక్షణ లభించలేదు. దీంతో ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌లో జీరో పాయింట్‌లు పొందింది. డ్రైవర్ మోకాలు, ఒక ప్రయాణికుడి మోకాలు మాత్రం కొద్దిపాటి రక్షణను పొందుతున్నట్లు చూపించాయి. అయితే ఫుట్‌వెల్ ప్రాంతాన్ని స్టెబుల్‌గా రేట్ చేశారు. డ్రైవర్, ప్రయాణికుల మెడకు కూడా రక్షణ అంతంత మాత్రమే. అయినప్పటికీ హ్యుందాయ్ యాక్సెంట్ (వెర్నా) బాడీ షెల్ స్టెబుల్ రేటింగ్ పొందింది. అంటే ఇది తదుపరి లోడింగ్‌లను తట్టుకోగలదు.

WazirX Survey: మహిళల ప్రాధాన్యం బిట్‌కాయిన్‌, మగవాళ్లకు షిబా ఇను.. భారీగా పెరిగిన క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్లు..


చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయానికొస్తే, ఈ సెడాన్ 6.21 పాయింట్లు (12.68 శాతం) సాధించింది. పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ విషయంలో ఈ కారు హెడ్ ఇంపాక్ట్, పెల్విస్ ఇంపాక్ట్, లోయర్ లెగ్ ఇంపాక్ట్ కేటగిరీలలో ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్‌ అందుకోలేదు. ముందు సీట్లలోని ప్రయాణికుల ఎయిర్‌బ్యాగ్‌ సహా సేఫ్టీ అసిస్ట్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల.. లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నా పేలవ ప్రదర్శన కనబర్చినట్లైంది. క్రాష్ టెస్ట్ చేసిన మోడల్‌లో డ్రైవర్ వైపు మాత్రమే ఎయిర్‌బ్యాగ్‌ ఉంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ సైతం కారులో లేదు.

Ambulance Driver: అతడు ఒక అంబులెన్స్ డ్రైవర్.. ఉదయం లేవగానే కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా అంటే..


లాటిన్ NCAP అంటే..
లాటిన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (లాటిన్ NCAP) అనేది లాటిన్ అమెరికా, కరేబియన్‌ ప్రాంతాల కోసం ఉద్దేశించిన ఆటోమొబైల్ సేఫ్టీ అసెస్‌మెంట్ ప్రోగ్రాం. దీన్ని 2010లో స్థాపించారు. ఇది మార్కెట్లోని కొత్త కార్ల భద్రత స్థాయిల గురించి వినియోగదారులకు సమాచారాన్ని అందిస్తుంది. ఇందుకు నిర్వహించే టెస్టింగ్‌ను క్రాష్ టెస్ట్ అంటారు.
Published by:Veera Babu
First published:

Tags: Business, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు