రూ.30,000 పెరగనున్న హుందాయ్ కార్ల ధరలు

వాహనాల ధరల్ని రూ.30,000 పెంచుతున్నట్టు హుందాయ్ మోటార్ ఇండియా గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి నుంచి అన్ని మోడల్స్‌పై ధరలు పెరుగుతాయని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: December 20, 2018, 5:01 PM IST
రూ.30,000 పెరగనున్న హుందాయ్ కార్ల ధరలు
రూ.30,000 పెరగనున్న హుందాయ్ కార్ల ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: December 20, 2018, 5:01 PM IST
మీరు హుందాయ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనండి. జనవరిలో కొనాలంటే అదనంగా రూ.30,000 చెల్లించాలి. ఇన్‌పుట్ కాస్ట్ పెరుగుతున్నందున వచ్చే నెలలో తమ వాహనాల ధరల్ని రూ.30,000 పెంచుతున్నట్టు హుందాయ్ మోటార్ ఇండియా గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి నుంచి అన్ని మోడల్స్‌పై ధరలు పెరుగుతాయని స్పష్టం చేసింది. సాంత్రో హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీ టస్కాన్ వరకు హుందాయ్ అమ్మే కార్ల ధరలు రూ.3.89 లక్షల నుంచి రూ.26.84 లక్షల మధ్య ఉంటాయి.

గతవారం టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, నిస్సాన్ ఇండియా కూడా ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచుతున్నట్టు ప్రకటించాయి. విదేశీ మారకం రేట్లు, విడిభాగాల ధరలు పెరగడం వల్ల తాము కూడా కార్ల ధరలు పెంచుతున్నామని మారుతీ సుజుకీ, టోయోటా కిర్లోస్కర్, బీఎండబ్ల్యూ, రెనాల్ట్, ఇసుజు ఇంతకుముందే చెప్పాయి. అంటే... జనవరి నుంచి ఏ బ్రాండ్ కారు కొనాలన్నా కాస్త ఎక్కువ చెల్లించాల్సిందే.

ఇవి కూడా చదవండి:

#FlashBack2018: ఈ ఏడాది రిలీజైన టాప్ కార్స్ ఇవేGood News: రూ.101 ధరకే వివో స్మార్ట్‌ఫోన్

ALERT: జనవరి 1 తర్వాత ఆ చెక్కులు చెల్లవు

Tax Saving Ideas: పన్నులు ఆదా చేసే మార్గాలు ఇవే...
Loading...
#FlashBack2018: ఈ ఏడాది రిలీజైన టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ ఇవే
First published: December 20, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...