Hyundai SUV sales: రికార్డు స్థాయిలో హ్యుందాయ్ సేల్స్... ఆ కారుకే ఎక్కువ డిమాండ్...

దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం SUV సేల్స్ పది లక్షలు దాటినట్లు సంస్థ ప్రకటించింది. క్రెటా, వెన్యూ వంటి మోడళ్లకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభించడం కూడా అమ్మకాల వృద్ధికి తోడ్పడిందని కంపెనీ నివేదిక పేర్కొంది.

దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం SUV సేల్స్ పది లక్షలు దాటినట్లు సంస్థ ప్రకటించింది. క్రెటా, వెన్యూ వంటి మోడళ్లకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభించడం కూడా అమ్మకాల వృద్ధికి తోడ్పడిందని కంపెనీ నివేదిక పేర్కొంది.

  • Share this:
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసినట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. తమ సంస్థ ఇప్పటి వరకు భారత్‌లో తయారు చేసిన పది లక్షల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌ను (SUV) అమ్మినట్టు సోమవారం వెల్లడించింది. దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం SUV సేల్స్ పది లక్షలు దాటినట్లు సంస్థ ప్రకటించింది. క్రెటా, వెన్యూ వంటి మోడళ్లకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభించడం కూడా అమ్మకాల వృద్ధికి తోడ్పడిందని కంపెనీ నివేదిక పేర్కొంది. హ్యుందాయ్ 2015లో క్రెటా SUVని విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ మోడల్ మెరుగైన అమ్మకాలను సాధిస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో 5.9 లక్షల యూనిట్ల క్రెటా వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి. మరో 2.2 లక్షల యూనిట్లను ఎగుమతి చేశారు. హ్యుందాయ్‌ 2019లో ప్రవేశపెట్టిన వెన్యూ మోడల్‌కు కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇప్పటి వరకు 1.8 లక్షల వెన్యూ యూనిట్లను దేశీయ మార్కెట్లో అమ్మినట్టు హ్యుందాయ్ నివేదికలో పేర్కొంది. హ్యుందాయ్ SUV వేరియంట్ల విభాగంలో క్రెటా, వెన్యూతో పాటు టక్సన్, కోన ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా ఉన్నాయి. ఏడు సీట్ల SUV అల్కాజర్ త్వరలో విడుదల కానుంది.

రికార్డు సాధించిన హ్యుందాయ్
తమ సంస్థ మేడ్ ఇన్ ఇండియా ప్రమాణాన్ని నిలబెట్టుకుందని హ్యుందాయ్ సంస్థ సేల్స్, మార్కెటింగ్, సర్వీస్ విభాగం డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. 10 లక్షల 'మేడ్ ఇన్ ఇండియా' SUVల అమ్మకాలను నమోదు చేయడం ఒక రికార్డని చెప్పారు. రెండున్నర దశాబ్దాలుగా భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హ్యుందాయ్ సత్తా చాటుతోందని వివరించారు. రానున్న రోజుల్లో కస్టమర్ల అభిరుచులు, ఆసక్తులకు తగ్గట్టు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు. ఈ విజయం తమ కంపెనీకి దక్కిన గొప్ప ప్రశంస అని పేర్కొన్నారు.

ఆ మోడళ్లే కీలకం
భారత్‌లో టక్సన్, శాంటా ఫే, టెర్రాకాన్ వంటి బ్రాండ్లతో హ్యుందాయ్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత రూపొందించిన క్రెటా, వెన్యూ వంటి బ్రాండ్లు ఈ విభాగంలో అమ్మకాలను గణనీయంగా పెంచాయి. పోటీ సంస్థలకు సాధ్యం కాని విధంగా క్రెటా అమ్మకాలు పెరిగాయి. వెన్యూ మోడల్‌ కూడా చెప్పుకోదగ్గ అమ్మకాలను నమోదు చేసింది. ఈ రెండు మోడళ్ల కారణంగానే మొత్తం అమ్మకాల సంఖ్య పెరగడం విశేషం.
First published: