హ్యుందాయ్ (Hyundai) అనగానే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చే కారు శాంట్రో (Hyundai Santro)అనే చెప్పాలి. బడ్జెట్ ఫ్రెండ్లీ లుక్ తో వచ్చిన ఈ హ్యాచ్ బాక్ కారు మంచి సేల్స్ సాధించింది. మారుతి స్విఫ్ట్ కు పోటీగా నిలిచిన ఈ కారును ముఖ్యంగా ఫ్యామిలీలు ఆదరించాయి. అయితే హ్యుందాయ్ (Hyundai) కంపెనీ తన i10, i 20 మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన తర్వాత వీటికి అంత డిమాండ్ లేకుండా పోయింది. దీంతో ఈ కారు ప్రొడక్షన్ తగ్గిపోవడంతో పాటు, నిలిపివేశారు. అయినప్పటికీ కస్టమర్లు మాత్రం శాంట్రో (Hyundai Santro)విడివిభాగాలకు ఇప్పటికీ డిమాండ్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో హ్యుండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంటీఎల్) తన కాంపాక్ట్ శ్రేణి మోడల్ శాంట్రో (Hyundai Santro)2019 ఎడిషన్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే కొత్త మోడల్ కారు ధరను సైతం హ్యుందాయ్ (Hyundai) తక్కువకే నిర్ణయించడం విశేషం. ఈ కారు ధర రూ.5.75 లక్షలుగా నిర్ణయించారు. అయితే హ్యుందాయ్ (Hyundai) శాంట్రోకు ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి స్విఫ్ట్, టాటా టిగోర్, ఆల్ట్రోజ్ కార్లకు ఇది మంచి పోటీ ఇవ్వనుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి శాంట్రో (Hyundai Santro)స్పోర్ట్స్ ఎంటీ, స్పోర్ట్స్ ఏఎంటీ రెండు వేరియంట్లలో శాంట్రో (Hyundai Santro)కారు అందుబాటులో ఉంది. స్పోర్ట్స్ ఎంటీ ధర రూ.5,16,890గా, స్పోర్ట్స్ ఎఎంటీ కారు ధర రూ.5,74,890గా నిర్ణయించారు.(ఎక్స్ షోరూం ధరలు)
అయితే కొత్త శాంట్రో (Hyundai Santro)‘అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్తో మార్కెట్లోకి విడుదల చేశారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దినట్లు పలు రివ్యూలు బయటకు వచ్చాయి. సగటు భారతీయుల అవసరాలు, ఆకాంక్షలు, అభిరుచులను బేరీజు వేసుకొని ఈ కొత్త శాంట్రో (Hyundai Santro)మోడల్ కారును రూపొందించారు. 2014లో హ్యుండాయ్ మోటార్స్ శాంట్రో (Hyundai Santro)కారును మార్కెట్లో నిలిపివేసింది. అయితే 2018 అక్టోబర్ నెలలో మరోసారి శాంట్రోను ప్రవేశపెట్టింది.
కలర్స్ ఇవే...
కొత్త శాంట్రో (Hyundai Santro)కారులో ఆక్వా టీల్, పొలార్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది. గన్ మెటల్ గ్రే వీల్ కవర్స్, బ్లాక్ ఓఆర్వీఎంస్ అండ్ డోర్ హ్యాండిల్స్, గ్లాసీ బ్లాక్ రూఫ్ రెయిల్స్, బాడీ సైడ్ మౌల్డింగ్, రేర్ క్రోమ్ గార్నిష్తోపాటు యానివర్సరీ ఎంబ్లం ఉన్నాయి. మొత్తం బ్లాక్ కలర్ క్యాబిన్ కలిగిన న్యూ సీట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది.
ఫీచర్లు ఇవే..
ఇక ఫీచర్ల విషయానికి వస్తే 1.1 లీటర్ల 4-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 69 పీఎస్, 99 ఎన్ఎం టార్చిని విడుదల చేస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. దీంతో టు స్టైలిష్ లుక్, యాపిల్ కార్ ప్లే, అలాగే అధునాతన సౌండ్ సిస్టం ఇందులో ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.