Santro Price| బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో. ఒకప్పుడు ఈ కార్లకు (Cars) ఫుల్ డిమాండ్. మధ్యతరగతి ప్రజలు ఈ కార్లను తెగ కొనేసేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. కొనే వారు ఒక్కరు కూడా లేరు. ఫ్యామిలీ కారుగా పేరు తెచ్చుకున్న ఆ కారును ఇప్పుడు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఆ కారు ఏంటని అనుకుంటున్నారా? అదే హ్యుందాయ్ (Hyundai) శాంట్రో.
హ్యుందాయ్ శాంట్రో అమ్మకాలు జీరో. అక్టోబర్ నెలలో కూడా ఈ కారును కొనే వారు లేరు. కంపెనీ ఈ కారు తయారీని ఇప్పటికే నిలిపి వేసింది. అయితే స్టాక్‌ను క్లియర్ చేసుకోవాలని భావిస్తోంది. అందుకే ఇంకా ఈ కారు అమ్మకానికి ఉంది. అయితే కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఒక్కరంటే ఒక్కరూ కూడా ఈ కారును కొనడం లేదు.
క్రెడిట్ కార్డు వాడే వారికి ఝలక్.. చార్జీలు పెంచేసిన 2 బ్యాంకులు, రివార్డు పాయింట్లలో కోత!
కేవలం శాంట్రో మాత్రమే కాకుండా ఎలెంట్రా అమ్మకాలు కూడా సున్నాం. ఈ కారును కూడా కొనే వారు లేరు. ఏడాది కిందట చూస్తే.. శాంట్రో అమ్మకాలు 2877 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ 2018లో శాంట్రో కారును రీలాంచ్ చేసింది. మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది. అప్పుడు దీని ప్రారంభ ధర రూ. 3.9 లక్షలు. అయితే నాలుగేళ్ల కాలంలో ఈ కారు ప్రారంభ ధర రూ. 5.7 లక్షలకు చేరింది. రేటు పెరగడంలో కొనే వారు దూరం అయ్యారు.
టాప్ 5 చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు.. ఇక పిల్లల చదువు నుంచి పెళ్లి దాకా నో ఫికర్!
శాంట్రో కారులో 1.1 లీటరు పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో మ్యానువల్, ఏఎంటీ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్‌కు ఈ ఆప్షన్లు వర్తిస్తాయి. అదే సీఎన్జీ వేరియంట్ అయితే మ్యానువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ శాంట్రో కారు లీటరుకు 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పెట్రోల్ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. అదే సీఎన్జీ వేరియంట్ అయితే 30.48 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్ కనెక్టివిటీ, రియర్ పార్కింగ్ కెమెరా విత్ సెన్సార్స్, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు వ్యాగనార్, సెలెరియో వంటి కార్లతో పోటీపడేది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. శాంట్రో కారును కొనే వారు లేరు. ఇక రానున్న కాలంలో ఈ కారు కనుమరుగు కానుంది. కంపెనీ ఈ కార్లను తయారు చేయడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget cars, Cars, Hyundai