హ్యుందాయ్ సంస్థ నుండి మరో కొత్త ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను సంస్థ ఇప్పటికే విడుదల చేసింది. అయోనిక్ 5 మిడ్ సైజ్ సీయూవీ పేరుతో జనాలకు అందుబాటులోకి వస్తున్న ఈ కొత్త కారుకి ఎన్నో వైవిధ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. అయోనిక్ పేరుతో ఇప్పటికే కొన్ని బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ (బీఈవీ) చెలామణీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ లైన్ అప్ బ్రాండ్స్ నుండి వస్తున్న మొదటి మోడల్ "అయోనిక్ 5". రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని కార్లను రూపొందించడంలో కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. అయోనిక్ 5 కూడా అలాంటిదే. హ్యుందాయ్ సంస్థ ఇప్పటికే Electric Global Modular Platform అనగా - ప్రపంచ వ్యాపంగా విద్యుత్ వాహనాల మోడల్స్‌ను రూపకల్పన చేసే వేదికను స్వయంగా ఏర్పాటు చేసుకుంది. అయోనిక్ 5 కూడా ఇదే వేదిక నుండి తయారైన తొలి ఎలక్ట్రిక్ వాహనంగా కితాబునందుకుంది.
అయోనిక్ 5 డిజైన్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. తయారీదారులు చాలా సృజనాత్మకతో ఈ డిజైన్‌ను రూపొందించారు. ముఖ్యంగా పిక్సల్స్‌ను ప్రేరణగా తీసుకొని తయారుచేసిన హెడ్ లైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆటోమొబైల్ రంగంలో డిజిటల్ టెక్నాలజీ ఆవశ్యకతను గురించి ఇది కచ్చితంగా తెలియజేస్తుంది. అలాగే క్లామ్ షెల్ (కారు పై భాగం నుండి తెరుచుకొనే తలుపు) మొత్తం కారు వెడల్పును చుట్టేసుకొని ఉండే విధంగా దీనిని రూపొందించారు. ఈ ప్రత్యేకత కలిగిన తొలి హ్యుందాయ్ వాహనంగా అయోనిక్ 5 ను పేర్కొనవచ్చు. అలాగే ఈ కారు ముఖ భాగం మొత్తం డిజిటల్ సైడ్ మిర్రర్స్‌తో పాటు గ్రిల్స్‌తో కప్పేయబడి ఉంటుంది.
Petrol Price: సెంచరీకి చేరువలో పెట్రోల్ ధర... హైదరాబాద్‌లో రేట్ ఎంతంటే
Gold Price: బంగారం ధర రికార్డు పతనం... రూ.8,000 తగ్గిన గోల్డ్ రేట్
Exclusive: First look at the IONIQ5, the first model in the IONIQ EV line-up.
Follow our journey towards a future where you can truly be in charge.
Stay tuned as we reveal more this week.#IONIQ #IONIQ5 #HyundaiElectric #HyundaiIONIQ pic.twitter.com/KNRN9GuhyC
— Hyundai Worldwide (@Hyundai_Global) January 13, 2021
అయోనిక్ 5 మార్కెట్లోకి విడుదల అవుతున్న సందర్భంగా ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు హ్యుందాయ్ గ్లోబల్ డిజైన్ సెంటర్ అధినేత సాంగ్యూప్ లీ మాట్లాడుతూ "అయోనిక్ 5 కొనుగోలుదారులకు కచ్చితంగా ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది. ఎప్పటికప్పుడు సృజనాత్మకతతో వాహనాలను తయారుచేయడం అనేది హ్యుండయ్ డిజైనర్ల డీఎన్ఏలోనే ఉంది" అన్నారు. "అయోనిక్ 5 అనే మా బీఈవీ లైన్ అప్ బ్రాండ్, కచ్చితంగా ప్రజలతో మా అనుబంధాన్ని మరింత పెంచుతుంది. దీనితో ప్రారంభమయ్యే మా ప్రయాణం ఈ బీఈవీ డిజైన్ రంగంలో కొత్త ప్రమాణాలను నమోదు చేస్తుంది" అని అన్నారు.
హ్యుందాయ్ మోటార్ సంస్థ ఇప్పటికే అయోనిక్ 5 కు సంబంధించి నాలుగు టీజర్ వీడియోలను విడుదల చేసింది. అయోనిక్ 5 ప్రధానంగా వాడే సాంకేతికతను గురించి జనాలకు తెలియజేయడానికి వీటిని రూపొందించారు. ఇందులో మూడు అల్టిమేట్ క్యాంపింగ్ వీడియోలు కూడా ఉన్నాయి. క్యాంపర్ అనేది కారు వెనుక వైపు తెరుచుకొనే భాగం. అయోనిక్ 5 క్యాంపర్‌లో సాధారణంగా విద్యుత్ పంపిణీ కోసం వాడే.. వివిధ విద్యుత్ పరికరాలు అందుబాటులో ఉంటాయి. అయోనిక్ 5 క్యాంపర్‌లో 3.5 కిలో వాట్ల వీ2ఎల్ పవర్ సప్లై ఉటుంది. ఈ పవర్ సహాయంతో కారు బయటే ఒక ఒవెన్ తెరిచి, టర్కీ కోడిని హాయిగా వండుకొని తినేయవచ్చు. అలాగే హై ఎండ్ ఆడియో స్పీకర్లలో మీకు నచ్చిన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే మీ క్యాంపింగ్ సైటులో ట్రెడ్ మిల్ సహాయంతో వ్యాయామాలు కూడా చేసేయచ్చు.
Bank Account: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సేవలు
Tata Sky: మీ ఇంట్లో టాటా స్కై కనెక్షన్ ఉందా? అయితే ఈ కారు గెలుచుకోవచ్చు
అలాగే ఇందులోని నాల్గవ వీడియోలో "5 మినిట్ ఛాలెంజ్" గురించి ప్రత్యేకంగా తెలియజేశారు. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో దాదాపు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే సౌలభ్యం కేవలం అయోనిక్ 5 కార్లకు మాత్రమే సొంతం అన్నది ఈ వీడియో సారాంశం. ఈ కార్లకు ఉండే అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అలాంటిది మరి.
అయోనిక్ 5 కార్లు ప్రధానంగా 390 హెచ్‌పీ అవుట్ పుట్తో.. ఆల్ వీల్ డ్రైవ్ కార్ల రూపంలో చెలామణీలోకి వచ్చే అవకాశం ఉంది. 5 సెకన్లలో సున్నా నుండి 100 కేఎంపీహెచ్ స్పీడును ఇవి నమోదు చేస్తాయని వినికిడి. ఈ కార్లకు సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వివరాలను ఇంకా కంపెనీ బహిర్గతం చేయలేదు. అయినప్పటికీ, పలు రిపోర్టుల ప్రకారం అయోనిక్ 5 కేవలం సింగిల్ ఛార్జింగ్‌తో 450 కిలో మీటర్లు ప్రయాణిస్తుందని వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto News, Automobiles, CAR, Cars, Electric vehicle, Hyundai