Home /News /business /

HYUNDAI OFFERS DISCOUNTS ON SANTRO KONA I10 120 AND OTHER MODELS HERE IS THE DETAILS AK

Hyundai Car Offers: హుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే సంతోషం తట్టుకోలేరు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyundai Car Offers: హుందాయ్‌కు చెందిన కార్ల మోడల్స్ గ్రాండ్ ఐ10 నియో, హుందాయ్ సాంట్రో, హుందాయ్ కోన సహా పలు మోడల్స్‌పై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

    కార్లు కొనాలనుకునే మధ్యతరగతికి చెందిన ప్రజలు ఎక్కువ డిస్కౌంట్ ద్వారా వచ్చే కార్ల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మార్చి వరకు తమ కార్లపై డిస్కౌంట్లు ఇస్తుంటాయి చాలా కంపెనీలు. గత మార్చి నెలలోనూ ఈ రకమైన డిస్కౌంట్లు కొనసాగాయి. అయితే ప్రముఖ కార్ల కంపెనీ హుందాయ్.. ఏప్రిల్‌లోనూ తమ కంపెనీకి చెందిన పలు మోడల్స్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. ఏప్రిల్‌ 2021లో ఈ మోడల్స్ కొనుగోలు చేసేవారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తింపజేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం హుందాయ్‌కు చెందిన కార్ల మోడల్స్ గ్రాండ్ ఐ10 నియో, హుందాయ్ సాంట్రో, హుందాయ్ కోన సహా పలు మోడల్స్‌పై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

    వీటిలో కొన్ని కార్లపై దాదాపు లక్షన్నర రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. హుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై దాదాపు రూ. 45000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లకు వర్తిస్తుంది. దీని ధర రూ. 5.19 లక్షల నుంచి రూ. 8.40 లక్షల వరకు ఉంటుంది. హుందాయ్‌లో బాగా పాపులర్ అయిన సాంట్రో మోడల్‌పై డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. ఈ మోడల్‌పై సుమారు రూ. 15000 వరకు డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. ఈ కారు ధర వివిధ వేరియంట్లను బట్టి రూ. 4.67 లక్షల నుంచి రూ. 6.35 లక్షల వరకు ఉంది.

    ఇక హుందాయ్ ఆర, హుందాయ్ ఐ20 మోడల్స్‌పై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. ఆర మోడల్‌పై రూ. 15000, ఐ20 మోడల్‌పై 15000 తగ్గింపు అందిస్తోంది. వీటితో పాటు కార్పొరేట్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. ఇక హుందాయ్ కోన మోడల్‌పై రూ. 1.5 లక్షల విలువ చేసే తగ్గింపు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. ఎలక్ట్రిక్ కారు మోడల్ అయిన దీని ధర రూ. 25 లక్షలుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు 452 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Auto News, Hyundai

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు