Hyundai Alcazar: దక్షిణ కొరియా వాహన తయారీ దిగ్గజం హ్యుందాయ్ మరో అల్కాజర్ ఎస్యూవీ మోడల్‌ను లాంచ్ చేసింది. తద్వారా, తన ఆల్కాజర్ లైనప్‌కు సరికొత్త వేరియంట్‌ని జోడించింది. ఈ కొత్త అల్కాజర్ సిగ్నేచర్ (O) 7 -సీటర్ పెట్రోల్ AT వేరియంట్ రూ. 24.97 లక్షల ధర వద్ద లభిస్తుంది.
దక్షిణ కొరియా (South Korea) వాహన తయారీ దిగ్గజం హ్యుందాయ్ మరో అల్కాజర్ ఎస్యూవీ మోడల్‌ను లాంచ్ చేసింది. తద్వారా, తన ఆల్కాజర్ లైనప్‌కు సరికొత్త వేరియంట్ (New Variant)ని జోడించింది. ఈ కొత్త అల్కాజర్ సిగ్నేచర్ (O) 7 -సీటర్ పెట్రోల్ AT వేరియంట్ రూ. 24.97 లక్షల ధర వద్ద లభిస్తుంది. దీనిని టాప్- ఎండ్ వేరియంట్‌గా కంపెనీ పేర్కొంది. అయితే, ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజార్ (Hyundai Alcazar) వేరియంట్ లాంచింగ్ గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా, ఈ కొత్త వేరియంట్ టాప్- ఎండ్ సిగ్నేచర్ (O) ట్రిమ్ లెవల్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఈ కొత్త వేరియంట్ 18 -అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ వంటి అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది. దీనిలో క్లైమెట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్ (Wireless Charging), డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 -అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించింది.
అడ్వాన్సుడ్ ఫీచర్లతో అల్కాజర్..
ఇక, ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజార్ సిగ్నేచర్ (O) 7- సీటర్ పెట్రోల్ AT వేరియంట్ 2.0- లీటర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 157 bhp, 191 Nm ఓయాక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
గతంలో ఈ 7 సీట్ల హ్యుందాయ్ అల్కాజార్ పెట్రోల్ ఎస్యూవీ వేరియంట్ కేవలం బేస్ ప్రెస్టీజ్, ప్లాటినం ట్రిమ్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది 6 -స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ 1.5 -లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఎస్యూవీ కారు 115 bhp, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ట్రాన్స్మిషన్ ఆప్షన్ గల 6 -స్పీడ్ (Speed) మాన్యువల్ గేర్‌బాక్స్, 6 -స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్లు కూడా ఉన్నాయి. ఈ ఎస్యూవీ వాహనం పెట్రోల్ (Petrol) మాన్యువల్, ఆటోమేటిక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది.
దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 14.5 km/l ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ 14.2 km/l ఇంధన సామర్థ్యంతో వస్తుంది. మరోవైపు, హ్యుందాయ్ అల్కాజర్ 7 సీటర్ డీజిల్ మోడల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 20.4 కిమీ/లీ, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 18.1 కిమీ/లీ ఇంధన సామర్థ్యాన్ని అందజేస్తుందని హ్యుందాయ్ సంస్థ పేర్కొంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.