హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyundai Venue: ఆ రూల్స్‌కు అనుగుణంగా హ్యుందాయ్ వెన్యూ అప్‌గ్రేడ్‌.. స్పెషల్‌ ఫీచర్స్‌ ఇవే..

Hyundai Venue: ఆ రూల్స్‌కు అనుగుణంగా హ్యుందాయ్ వెన్యూ అప్‌గ్రేడ్‌.. స్పెషల్‌ ఫీచర్స్‌ ఇవే..

Hyundai Venue  ( PC : Hyundai)

Hyundai Venue ( PC : Hyundai)

Hyundai Venue: ఇండియా రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్(RDE),  నింబంధనలను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయనుంది. దీంతో ఆటోమేకర్స్ ఈ నిబంధనలకు అనుగుణంగా తమ మోడల్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ చేరింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రపంచ దేశాలు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా దేశాలు పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఈ దిశలోనే ఇండియా రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్(RDE), నింబంధనలను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయనుంది. దీంతో ఆటోమేకర్స్ ఈ నిబంధనలకు అనుగుణంగా తమ మోడల్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) చేరింది. ఎస్‌యూవీ లైనప్ లో వెన్యూ (Venue)లో ప్రధానంగా ఇంజన్ అప్‌గ్రేడ్ చేసింది.

* VGT టెక్నాలజీ సపోర్ట్‌తో

హ్యుందాయ్‌కు చెందిన క్రెటా, ఇతర కంపెనీలకు చెందిన సెల్టోస్, సోనెట్‌లో ఉన్న శక్తివంతమైన 1.5-లీటర్ 4-సిలిండర్ U2 CRDi డీజిల్ ఇంజన్‌ను వెన్యూలోనూ తాజాగా అమర్చారు. వెన్యూ అప్‌గ్రేడ్ కాకముందు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 100hp వద్ద 240Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇది ఫిక్స్‌డ్-జామెట్రీ టర్బోతో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ స్థానంలో 114 bhp వద్ద 250Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ డీజిల్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. ఇది VGT టెక్నాలజీకి సపోర్ట్ చేస్తోంది. ఈ ఇంజన్ E20 ఫ్యూయల్ రెడీ, RDE నిబంధనలకు అనుగుణంగా డిజైన్ చేశారు.

* మైలేజ్ కోసం స్టాఫ్ & గో ఫీచర్

వెన్యూ డీజిల్ ఇంజిన్ ఇప్పుడు క్రెటా మాదిరిగానే 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పవర్, టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అయితే కియా సోనెట్ మాదిరిగా, వెన్యూలో డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ఉండదు. మైలేజీని పెంచడానికి ఈ SUVలో ఐడిల్ స్టాఫ్ & గో (ISG) ఫీచర్‌ను ప్రవేశపెట్టారు.

ఇది కూడా చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా..? అయితే, ఈ బంపర్ న్యూస్ మీ కోసమే!

* ఇతర అప్‌గ్రేడ్ ఫీచర్స్

కొత్త డీజిల్ ఇంజిన్‌తో పాటు హ్యుందాయ్ వెన్యూలో అనేక ఫీచర్స్ అప్ గ్రేడ్ అయ్యాయి. మెయిన్ వాల్యూమ్ వేరియంట్స్ S (O), SX & SX (O)లో 4-ఎయిర్‌బ్యాగ్స్ (డ్రైవర్, ప్యాసింజర్ & సైడ్) స్టాండర్డ్ సేఫ్టీ ఫిట్‌మెంట్‌గా ఉండనున్నాయి. 4-ఎయిర్‌బ్యాగ్స్ గతంలో టాప్-స్పెక్ SX (O) ట్రిమ్‌లో మాత్రమే ఉండేవి. ఇక, 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మాత్రం ఇప్పటికీ టాప్ SX(O) ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

* పెట్రోల్ లైనప్‌ యథాతథం

వెన్యూ పెట్రోల్ లైనప్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. సబ్-4 మీటర్ SUVలో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను కంపెనీ కొనసాగించింది. ఒకటి 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కాగా, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరోటి. నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 83PS వద్ద 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజన్ 120PS వద్ద 172Nm టార్క్‌కు ప్రొడ్యూస్ చేస్తుంది. 1.2L పెట్రోల్ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతగా వస్తుంది. 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ iMT లేదా 7-స్పీడ్ DCTతో వస్తుంది.

* ధరల పెంపు వివరాలు

హ్యుందాయ్ వెన్యూ-2023 ఆరు ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రధానంగా E, S, S+, S(O), SX, SX(O). కొత్త వెన్యూ ధర ఇప్పుడు రూ. 7.68 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై రూ. 13.11 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హ్యుందాయ్ 1.2లీటర్ పెట్రోల్ వేరియంట్స్ ధరలను రూ. 14,300 వరకు పెంచింది. 1.0లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్‌ల ధర రూ.25,000 వరకు పెరిగింది. కంపెనీ తన సబ్-కాంపాక్ట్ SUV డీజిల్ వేరియంట్ల ధరలను మాత్రం మార్చలేదు.

First published:

Tags: Auto, Hyundai, New cars

ఉత్తమ కథలు