హోమ్ /వార్తలు /బిజినెస్ /

Car Offers: అదిరిపోయే ఆఫర్... రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ప్రకటించిన హ్యుందాయ్

Car Offers: అదిరిపోయే ఆఫర్... రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ప్రకటించిన హ్యుందాయ్

Car Offers: అదిరిపోయే ఆఫర్... రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ప్రకటించిన హ్యుందాయ్
(ప్రతీకాత్మక చిత్రం)

Car Offers: అదిరిపోయే ఆఫర్... రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ప్రకటించిన హ్యుందాయ్ (ప్రతీకాత్మక చిత్రం)

Car Offers | హ్యుందాయ్ మోటార్ (Hyundai Motors) కంపెనీ కొన్ని మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. రూ.1 లక్ష వరకు తగ్గింపు పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

దీపావళి సీజన్‌లో కొత్త కార్లపై ఆఫర్ల (Car Offers) వర్షం కురవడం మామూలే. ఈసారి కూడా దీపావళికి కార్ల కంపెనీలు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించాయి. దీపావళి సీజన్ ముగిసిన తర్వాత ఆఫర్ల సందడి తగ్గింది. కానీ హ్యుందాయ్ మోటార్ (Hyundai Motors) కంపెనీ ఇప్పటికీ డిస్కౌంట్స్ అందిస్తోంది. కొన్ని దీపావళి ఆఫర్స్‌ను (Diwali Offers) కొనసాగిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఐ20, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ లాంటి కార్లపై రూ.1,00,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మరి ఏ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

Hyundai Aura: హ్యుందాయ్ ఆరా హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, సీఎన్‌జీ కార్లపై ఆఫర్స్ ఉన్నాయి. రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. హ్యుందాయ్ ఆరా ఎక్స్-షోరూమ్ ధర రూ.6,08,900.

BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఏడాది వేలిడిటీతో కొత్త ప్లాన్... బెనిఫిట్స్ తెలుసుకోండి

Hyundai Grand i10 Nios: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌పై రూ.35,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.25,000, 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.15,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు. గరిష్టంగా రూ.48,000 వరకు ఆఫర్స్ పొందొచ్చు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5,43,000.

Hyundai i20: హ్యుందాయ్ ఐ20 కార్ కొనేవారికి రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ హ్యాచ్‌బ్యాక్ కార్లపై డిస్కౌంట్ పొందొచ్చు. హ్యుందాయ్ ఐ20 ఎక్స్-షోరూమ్ ధర రూ.7,07,000.

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... మీకు ఆ మెసేజ్ వస్తే జాగ్రత్త

Hyundai Kona Electric: హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుపై భారీ డిస్కౌంట్ పొందొచ్చు. 2019లో రిలీజైన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ కొంటే రూ.1,00,000 క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇతర బెనిఫిట్స్ ఉండవు. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.24,02,800. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

ఇందులో కొన్ని ఆఫర్స్‌ని హ్యుందాయ్ మోటార్స్ దీపావళి సందర్భంగా ప్రకటించినవే. దీపావళి ఫెస్టివల్ సీజన్ ముగిసిన తర్వాత కస్టమర్లకు ఆఫర్స్‌ని కొనసాగిస్తోంది. అయితే ఈ ఆఫర్స్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటాయన్న స్పష్టత లేదు.

First published:

Tags: Auto News, Car prices, Cars, Hyundai

ఉత్తమ కథలు