హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyundai Verna: హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్ లాంచ్.. ప్రారంభ ధర రూ.10.90 లక్షలు

Hyundai Verna: హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్ లాంచ్.. ప్రారంభ ధర రూ.10.90 లక్షలు

(Photo: Paras Yadav/News18.com)

(Photo: Paras Yadav/News18.com)

Hyundai Verna: హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త జనరేషన్ వెర్నా సెడాన్‌ (Hyundai Verna 2023) మోడల్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర, స్పెసిఫికేషన్లు చెక్ చేద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కొన్ని రకాల మోడల్ కార్లు ఎన్ని సంవత్సరాలు అయినా వినియోగదారుల ఆలోచనల్లో, అభిరుచుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కొత్త అప్‌డేట్స్‌తో రీలాంచ్‌ అవుతున్నప్పుడు ఇవి ఆసక్తిని కలిగిస్తాయి. అలాంటి మోడల్స్‌లో హ్యుందాయ్ లాంచ్‌ చేసిన వెర్నా ఎప్పుడూ ఉంటుంది. దేశంలో 4.5 లక్షల మంది కస్టమర్లతో వెర్నా 17 సంవత్సరాలుగా భారతీయ రోడ్లపై పరుగులు తీస్తోంది. ఇప్పుడు కొత్తగా హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త జనరేషన్ వెర్నా సెడాన్‌ (Hyundai Verna 2023) మోడల్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర, స్పెసిఫికేషన్లు చెక్ చేద్దాం.

ఇండియన్‌ మార్కెట్‌లోకి రూ.10.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లేటెస్ట్‌ వెర్నా లాంచ్‌ అయింది. టాప్ వేరియంట్‌ SX(O) 7DCT ధర రూ.17.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). వినియోగదారులు కొత్త తరం హ్యుందాయ్ వెర్నాను రూ.25,000తో ఆన్‌లైన్‌లో లేదా ఆథరైజ్డ్ డీలర్‌షిప్‌ల వద్ద బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే సుమారు 8,000 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది.

* వెర్నా డిజైన్

హ్యుందాయ్ వెర్నా ముందు భాగంలో స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్, పారామెట్రిక్ జ్యువెల్ గ్రిల్, బోనెట్, ఫ్రంట్ బంపర్‌లను వేరుచేసే ఫుల్‌-విడ్త్‌ LED DRL స్ట్రిప్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ స్ట్రాంగ్‌ క్యారెక్టర్ లైన్‌లు, R16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో ఉంటుంది. వెనుక వైపు సెడాన్ విడ్త్‌ మొత్తం కనిపించే LED లైట్ బార్‌తో H-ఆకారంలో కనెక్ట్ చేసిన టెయిల్-ల్యాంప్స్ ఉంటాయి. డ్యుయల్-టోన్ బంపర్, టెయిల్-ల్యాంప్‌లో వెర్నా లోగో ఉంటుంది.

ఇది కూడా చదవండి : మండే ఎండల్లో చల్ల చల్లగా.. డైకిన్ ఏసీలపై మంచి డిస్కౌంట్లు..

* వెర్నా ఇంటీరియర్

లోయర్‌, మిడ్‌ వేరియంట్‌లలో డ్యూయల్-టోన్ బ్లాక్, బీజ్‌ ఇంటీరియర్ థీమ్‌ ఉంటుంది. టాప్‌ వేరియంట్‌లో బ్లాక్, రెడ్ ఇంటీరియర్ థీమ్‌ వస్తుంది. లోపలి భాగంలో డ్యుయల్ స్క్రీన్ సెటప్‌తో వెర్నా 10.25-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఫుల్‌-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి.

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ బోస్ ప్రీమియం ఆడియో సిస్టమ్, 65+ ఫీచర్లతో బ్లూలింక్ కనెక్ట్ కార్‌ కార్ టెక్నాలజీ వంటివి లేటెస్ట్ వెర్నా స్పెషల్ ఫీచర్లు. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవ్ మోడ్స్‌లో లభిస్తుంది. 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, వాలెట్ మోడ్, సిస్టమ్ OTA అప్‌డేట్‌లతో వస్తుంది. సన్‌రూఫ్ తెరవడం, వెంటిలేటెడ్ సీట్లను యాక్టివేట్ చేయడం, AC ఆన్ చేయడం వంటి మరిన్ని ఫంక్షన్‌లను హిందీ, ఇంగ్లిష్‌ వాయిస్ కమాండ్‌లతో చేస్తుంది.

ఇది కూడా చదవండి : ప్రముఖ కంపెనీల కార్లపై వేలల్లో డిస్కౌంట్లు.. ఇలాంటి ఆఫర్లు మళ్లీ రావు భయ్యా!

* సెక్యూరిటీ ఫీచర్లు

2023 హ్యుందాయ్ వెర్నా 30 స్టాండర్డ్ ఫీచర్లతో సహా మొత్తం 65+ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్ వంటి లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ దీంట్లోని ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, VSM, ట్రాక్షన్ కంట్రోల్, TPMS, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఈ లేటెస్ట్ మోడల్‌లో ఉన్నాయి.

* వెర్నా ఇంజన్‌

వెర్నా 2023 RDE (రియల్ డ్రైవింగ్ ఎమిషన్) కంప్లైంట్, E20 ఫ్యూయల్‌ రెడీ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. ముందు జనరేషన్‌లో వచ్చిన డీజిల్ ఇంజన్‌ను పక్కనపెట్టేశారు. కొత్త వెర్నా 1.5L MPi పెట్రోల్, 1.5L టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. 1.5-లీటర్ MPi పెట్రోల్ ఇంజన్ 18.60 kmpl (MT), 19.60 kmpl (IVT) ఫ్యూయల్‌ ఎఫిషియన్సీ అందిస్తుంది. 1.5-లీటర్ టర్బో GDI పెట్రోల్ ఇంజన్ 20 kmpl (MT), 20.60 kmpl (DCT) మైలేజీని అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంది, ఆప్షనల్‌ 7-స్పీడ్ DCT కూడా లభిస్తుంది.

* హ్యుందాయ్ వెర్నా కొలతలు

కొత్త హ్యుందాయ్ వెర్నా 1,765mm వెడల్పు, 2,670mm వీల్‌బేస్‌తో వస్తుంది. దీని పొడవు 4,535mm, ఎత్తు 1,475mm. 2023 హ్యుందాయ్ వెర్నా 528 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది.

* కలర్ ఆప్షన్‌లు

లేటెస్ట్ వెర్నా- EX, S, SX, SX(O) అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తుంది. 7 సింగిల్-టోన్ కలర్ ఆప్షన్‌లు- ఫియరీ రెడ్, టైఫూన్ సిల్వర్, అబీస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్లూరియన్ బ్రౌన్, టైటాన్ గ్రే, స్టార్రీ నైట్‌లో వస్తుంది. డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో బ్లాక్ రూఫ్‌తో అట్లాస్ వైట్, బ్లాక్ రూఫ్‌తో ఫైరీ రెడ్ ఆప్షన్‌లు ఉన్నాయి. 2023 హ్యుందాయ్ వెర్నా ఇంటీరియర్ కలర్ ఆప్షన్‌లలో బ్లాక్‌, బీజ్‌, అదే విధంగా బ్లాక్‌, రెడ్‌ ఉన్నాయి.

First published:

Tags: Auto, Cars, Hyundai, New car

ఉత్తమ కథలు