ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai)కు ఇండియన్ మార్కెట్‌లో మంచి పాపులారిటీ ఉంది. ఈ కంపెనీ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్, డీసెంట్ లుక్‌తో కార్లను తీసుకొస్తుంది. తాజాగా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అల్కాజర్- 2023 (Alcazar-2023) అప్‌గ్రేడ్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. రూ.25,000 టోకెన్ పేమెంట్‌తో హ్యుందాయ్ సిగ్నేచర్ అవుట్‌లెట్స్‌లో లేదా ఆన్‌లైన్ ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చు. రియల్ డ్రైవింగ్ ఉద్గారాల (RDE) నిబంధనలకు అనుగుణంగా కంపెనీ E20 ఫ్యూయల్ రెడీతో ఈ SUV ఇంజిన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. అల్కాజర్- 2023 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఇప్పుడు పరిశీలిద్దాం.
* కొత్త 1.5L పెట్రోల్ ఇంజన్
ఈ ఎస్‌యూవీ ధర రూ. 16.10 లక్షలతో మొదలై రూ. 21.10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అల్కాజర్‌లో రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. తాజాగా కొత్త 1.5L పెట్రోల్ ఇంజన్‌తో అప్‌గ్రేడ్ అయింది. ఇది 5,500 rpm వద్ద 157 bhp పవర్‌ను, 1,500-3,000 rpm మధ్య అత్యధికంగా 253 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వరుసగా 18 kmpl, 17.5 kmpl మైలేజీని అందిస్తుంది. హ్యుందాయ్ అల్కాజర్‌లో RDE కంప్లైంట్ 1.5L CRDi డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది 4,000 rpm వద్ద 114 bhp, 1,500–2,750 rpm మధ్య 250 Nm పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
ఇది కూడా చదవండి : కార్పొరేట్ సెక్టార్ లో నయా ట్రెండ్ క్వైట్ హైరింగ్.. అసలు మ్యాటర్ ఇదే!
* న్యూ ఫ్రంట్ గ్రిల్ డిజైన్, రీ డిజైన్ పుడ్ల్ ల్యాంప్
హ్యుందాయ్ అల్కాజర్-2023 కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లను పొందింది. ప్రధానంగా ALCAZAR లోగోతో న్యూ ఫ్రంట్ గ్రిల్ డిజైన్, రీ డిజైన్ పుడ్ల్ ల్యాంప్ అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ SUV అప్ డేట్ వెర్షన్‌లో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా 6-ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఫేస్‌లిఫ్ట్ స్టాక్ ఫిట్‌మెంట్‌గా ఐడిల్ స్టాప్ & గో ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. స్టాప్ & గో డ్రైవింగ్ పరిస్థితుల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. ఎక్స్ పీరియన్స్ లేనివారి కోసం అల్కాజర్ 6, 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది.
* బెస్ట్ మొబిలిటీ ఎక్స్‌పీరియన్స్
హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ‘కస్టమర్ సెంట్రిక్ ఆర్గనైజేషన్‌గా, తమ కస్టమర్‌లకు బెస్ట్ మొబిలిటీ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా కొత్త టర్బో పెట్రోల్ ఇంజన్‌తో హ్యుందాయ్ ఆల్కాజర్‌ను తీసుకొచ్చాం.
దీంతో ఈ ఎస్‌యూవీలో లెటెస్ట్ అప్‌డేట్స్‌తో మరింత సెక్యూరిటీ ప్యాకేజీని అందించాం. ప్రభుత్వ నిర్దేశించిన RDE కంప్లైంట్, E20 ఫ్యూయల్ రెడీలకు నిబంధనలకు అనుగుణంగా ఆల్కాజర్-2023 అప్‌గ్రేడ్ చేశాం’ అని తరుణ్ గార్గ్ స్పష్టం చేశారు. ఈ కొత్త యుగం మొబిలిటీ సొల్యూషన్‌తో గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్‌లను విస్తరించేందుకు కొత్త టెక్నాలజీలను పరిచయం చేసినట్లు ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.