హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyundai Venue N Line: ఇండియాలో హ్యుందాయ్ వెన్యూ N లైన్ కారు బుకింగ్స్ ప్రారంభం.. దీని స్పెసిఫికేషన్లు ఇవే..

Hyundai Venue N Line: ఇండియాలో హ్యుందాయ్ వెన్యూ N లైన్ కారు బుకింగ్స్ ప్రారంభం.. దీని స్పెసిఫికేషన్లు ఇవే..

Hyundai Venue N Line ( PC : Hyundai)

Hyundai Venue N Line ( PC : Hyundai)

Hyundai Venue N Line: రెడ్ థీమ్ ఎక్ట్సీరియర్ నుంచి ఇంటీరియర్ క్యాబిన్‌కు కూడా ఉంటుంది. డ్యూయల్ కెమెరాతో ప్రత్యేకమైన డాష్‌క్యామ్, 60+ హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు, అలెక్సా & గూగుల్ వాయిస్ అసిస్టెంట్, హోమ్ టు కార్ (H2C) వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. డ్రైవ్ మోడ్‌ను (నార్మల్‌, ఎకో, స్పోర్ట్‌)లలో సెలక్ట్‌ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

హ్యుందాయ్ ఇండియా కొత్త వెన్యూ N లైన్ (Hyundai Venue N Line) కారు ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. దేశంలోని సిగ్నేచర్ డీలర్‌షిప్‌లలో రూ.21,000 టోకెన్ పేమెంట్‌తో బుకింగ్స్ తీసుకుంటోంది. బ్రాండ్‌కు చెందిన 'క్లిక్ టు బై (Click to Buy)' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్‌లో కూడా కొత్త కార్లను బుక్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ వెన్యూ N లైన్ అనేది ఇండియన్‌ మార్కెట్లో హ్యుందాయ్ ఎన్ లైన్ మోడల్ సిరీస్‌లో మొదటి ఎస్‌యూవీ(SUV) అవుతుంది. కారు ఎక్స్‌టర్నల్‌ స్టైలింగ్‌ కొత్తగా ఉంటుంది. వెన్యూ N లైన్ 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. N లైన్ లోగోతో డార్క్‌ క్రోమ్ గ్రిల్‌ ఉంటుంది.


'N లైన్' ఎంబ్లమ్‌ సైడ్ ఫెండర్‌లు, టెయిల్ గేట్ వద్ద కూడా కనిపిస్తుంది. బంపర్‌లు, ఫెండర్, సైడ్ సిల్స్, రూఫ్ రెయిల్స్ వంటి ఎలిమెంట్స్‌ రెడ్‌ కలర్‌లో ఉంటాయి. ఫ్రంట్ బ్రేక్ కాలిపర్ కూడా రెడ్‌ కలర్‌ ఫినిషింగ్‌లో వస్తుంది.రెడ్ థీమ్ ఎక్ట్సీరియర్ నుంచి ఇంటీరియర్ క్యాబిన్‌కు కూడా ఉంటుంది. డ్యూయల్ కెమెరాతో ప్రత్యేకమైన డాష్‌క్యామ్, 60+ హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు, అలెక్సా & గూగుల్ వాయిస్ అసిస్టెంట్, హోమ్ టు కార్ (H2C) వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. డ్రైవ్ మోడ్‌ను (నార్మల్‌, ఎకో, స్పోర్ట్‌)లలో సెలక్ట్‌ చేసుకోవచ్చు.


కొత్త కారు బుకింగ్స్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్. ‘మా స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా అధునాతనమైన, స్పోర్టీ అనుభవాలను అందించి, మా అత్యంత ప్రియమైన కస్టమర్ల కలలు, ఆకాంక్షలను నిజం చేయాలని కోరుకుంటున్నాం. హ్యుందాయ్ వెన్యూ N లైన్ ఇండియా ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో మా ప్రయత్నానికి మరొక ఉదాహరణ.’ అని చెప్పారు.


ఇది కూడా చదవండి: కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచిందా..? ఆ లెటర్ నిజమైనదేనా?


 భద్రత విషయానికొస్తే, హ్యుందాయ్ వెన్యూ N లైన్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అన్ని 4 డిస్క్ బ్రేక్‌లు, ISOFIX, ABS వంటి 20+ స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. EBD, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, పార్కింగ్ అసిస్ట్ సెన్సార్‌లు & డైనమిక్ మార్గదర్శకాలతో కెమెరా, హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్ కూడా లభిస్తాయి.

* బెస్ట్‌ ఎస్‌యూవీ ఎక్స్‌పీరియన్స్‌
భారతదేశం ప్రముఖ స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా కస్టమర్లకు బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి కట్టుబడి ఉన్నామని కిమ్ చెప్పారు. ఈ సరికొత్త SUVతో భారతదేశంలో N లైన్ సిరీస్‌ బలమైన వారసత్వాన్ని నిర్మిస్తామని తెలిపారు. హ్యుందాయ్ i20 N లైన్ 2021లో లాంచ్ అయినప్పటి నుంచి మిలీనియల్స్, Gen Z కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్‌ లభించిందని పేర్కొన్నారు. హ్యుందాయ్ వెన్యూ N లైన్ ద్వారా భారతీయ కస్టమర్ల SUV అనుభవాలను మరింత మెరుగుపరుస్తామని వివరించారు.


హ్యుందాయ్ వెన్యూ N లైన్ 1.0L కప్పా టర్బో GDi పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 118 bhp, 172 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇది 2వ-తరం 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి లింక్ అవుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Cars, Hyundai, New cars

ఉత్తమ కథలు