హోమ్ /వార్తలు /బిజినెస్ /

Venue N Line: ఇండియాలో హ్యుందాయ్ వెన్యూ N లైన్ SUV లాంచ్.. ప్రారంభ ధర రూ. 12.16 లక్షలు.. ఫీచర్లు ఇవే..

Venue N Line: ఇండియాలో హ్యుందాయ్ వెన్యూ N లైన్ SUV లాంచ్.. ప్రారంభ ధర రూ. 12.16 లక్షలు.. ఫీచర్లు ఇవే..

Hyundai Venue N Line ( PC : Hyundai)

Hyundai Venue N Line ( PC : Hyundai)

Venue N Line: వెన్యూ N లైన్ అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. రెడ్ ఇన్సర్ట్‌లతో కూడిన స్పోర్టీ బ్లాక్ క్యాబిన్‌తో ఆకట్టుకుంటుంది. అదిరిపోయే డిజైన్ దీని సొంతం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

హ్యుందాయ్ (Hyundai) మోటార్స్ నుంచి మరో SUV ఇండియా (India)లో లాంచ్ అయింది. గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న వెన్యూ ఎన్ లైన్‌ (Venue N Line) మోడల్‌ను కంపెనీ భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. N6, N8 అనే రెండు వేరియంట్లలో ఈ SUV లభిస్తుంది. ఈ కారు బుకింగ్స్ ఇంతకు ముందే ప్రారంభమయ్యాయి. అయితే త్వరలోనే అన్ని హ్యుందాయ్ సిగ్నేచర్ డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులోకి రానుంది. ఈ ఎస్‌యూవీ N6 ట్రిమ్ ధర రూ. 12.16 లక్షలు కాగా, N8 ధర 13.15 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంది. దీని స్పెసిఫికేషన్లు చెక్ చేద్దాం.

* ఇంటీరియర్, ఫీచర్లు

వెన్యూ N లైన్ అనేక ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. రెడ్ ఇన్సర్ట్‌లతో కూడిన స్పోర్టీ బ్లాక్ క్యాబిన్‌తో ఆకట్టుకుంటుంది. క్యాబిన్ లోపల సీట్లు, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ వంటి లెథెరెట్ ఎలిమెంట్స్‌పై N లైన్ బ్రాండింగ్‌ను ఇచ్చారు. ఇన్‌సైడ్ డోర్ హ్యాండిల్స్ డార్క్ మెటల్ ఫినిషింగ్, స్పోర్టీ మెటల్ పెడల్స్. రెడ్ యాంబియంట్ లైటింగ్‌లతో వస్తాయి.

* ఇంజిన్ కెపాసిటీ

హ్యుందాయ్ వెన్యూ N లైన్ 1.0 L 3-సిలిండర్ కప్పా టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 6000 rpm వద్ద 118 bhp పవర్‌ను, 1500- 4000 rpm మధ్య 172 Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్ అయి ఉంటుంది. దీంట్లో మాన్యువల్ యూనిట్ అందుబాటులో లేదు. నార్మల్, ఎకో, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లను సెలక్ట్ చేసుకునే ఫీచర్ కూడా ఉంటుంది.

* డిజైన్

హ్యుందాయ్ వెన్యూ N లైన్ షాడో గ్రే, పోలార్ వైట్ వంటి రెండు సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫాంటమ్ బ్లాక్ రూఫ్‌తో థండర్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్ రూఫ్‌తో పోలార్ వైట్, ఫాంటమ్ బ్లాక్ రూఫ్‌తో షాడో గ్రే వంటి మూడు డ్యుయల్-టోన్ పెయింట్ ఆప్షన్లలో వెహికల్‌లో సెలక్ట్ చేసుకోవచ్చు. బ్రాండ్ స్పెషల్ 'సెన్సుయస్ స్పోర్టినెస్' డిజైన్‌ ఆధారంగా రూపొందించిన ఈ వెహికల్‌ ఫ్రంట్ గ్రిల్ డార్క్ క్రోమ్‌లో N లైన్ లోగోతో వస్తుంది. N బ్రాండింగ్‌తో వచ్చే 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో వెహికల్ రన్ అవుతుంది.

వెన్యూ N లైన్ డిజైన్.. హ్యుందాయ్ నుంచి వచ్చిన మోటార్‌స్పోర్ట్ మాదిరిగానే ఉంటుంది. అయితే తాజా మోడల్‌లో 30 ఎక్స్‌క్లూజివ్ ఎలిమెంట్స్ అందించారు. రూఫ్ రెయిల్స్ రెడ్ కలర్స్‌లో వచ్చాయి. దీని ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, సైడ్ సిల్ గార్నిష్ కూడా ఎరుపు రంగులో ఉంటాయి. స్పోర్టి టెయిల్ గేట్ స్పాయిలర్ రియర్ ప్రొఫైల్, వెనుక బంపర్‌పై ప్రత్యేకమైన N లైన్ ఎలిమెంట్ ఉంటాయి. టెయిల్‌గేట్‌పై N లైన్ ఐకాన్‌తో పాటు ట్విన్ టిప్ మఫ్లర్ ఉంది.

* సేఫ్టీ ఫీచర్లు

హ్యుందాయ్ వెన్యూ N లైన్ ఏకంగా 20 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ కెమెరా, ISOFIX, ABS.. వంటి స్పెసిఫికేషన్లు ఈ లేటెస్ట్ ఎస్‌యూవీ స్పెషల్ అట్రాక్షన్.

ఇది కూడా చదవండి :  150 కి.మీ రేంజ్.. 90 kmph టాప్ స్పీడ్‌తో హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లాంచ్.. దీని ప్రత్యేకతలు ఇవే..

* ఇతర ప్రత్యేకతలు

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డిజిటల్ డిస్‌ప్లే (FATC)తో పూర్తిగా ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, రియర్ AC వెంట్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, గ్లోవ్‌బాక్స్ కూలింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ USB ఛార్జర్.. వంటి అనేక అడ్వాన్స్‌డ్ స్పెసిఫికేషన్లతో తాజా కారు లాంచ్ అయింది. 64 GB వరకు స్టోరేజీని అందించే డ్యుయల్ కెమెరా డాష్‌క్యామ్‌ దీంట్లో మరో ప్రత్యేకత.

* కనెక్టివిటీ ఆప్షన్స్

హ్యుందాయ్ వెన్యూ N లైన్‌లోని సెంటర్ కన్సోల్‌లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, బ్లూలింక్ కనెక్టివిటీతో కూడిన 8-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ది లొకేషన్ బేస్డ్ సర్వీసెస్, ఓవర్-ది-ఎయిర్ నావిగేషన్ అప్‌డేట్స్, రిమోట్ సర్వీసెస్, వెహికల్ డయాగ్నోస్టిక్స్, వాయిస్ అసిస్టెంట్ వంటి 60+ హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ ఫీచర్‌లతో ఈ ఎస్‌యూవీ కొనుగోలుదారులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.

ఈ SUV కొనుగోలుపై 7 సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీని హ్యుందాయ్ అందిస్తోంది. దీంతోపాటు మూడు సంవత్సరాల ఫ్రీ రోడ్-సైడ్ అసిస్టెన్స్ (RSA), 3 సంవత్సరాల బ్లూలింక్ సబ్‌స్క్రిప్షన్, 5 సంవత్సరాల హ్యుందాయ్ షీల్డ్ ఆఫ్ ట్రస్ట్, కేర్, మెయింటెనెన్స్ ప్యాకేజీలను అందిస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Auto, Hyundai, New car, New cars

ఉత్తమ కథలు