HYUNDAI I20 WILL BE AVAILABLE HERE IN A BUDGET OF ONLY 3 LAKHS MK
Hyundai i20: హ్యుందాయ్ ఐ20 కారును కేవలం రూ.3 లక్షలకే కొనాలని ఉందా...అయితే ఈ పని చేయండి..
ప్రతీకాత్మకచిత్రం
హ్యుందాయ్ (Hyundai) i20 కారు చూడటానికి మంచి స్టైల్, చక్కటి మైలేజ్, ప్రీమియం ఫీచర్ల కోసం ఇష్టపడే స్పోర్టీ డిజైన్‌తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గా మార్కెట్లో అందుబాటులో ఉంది. మీరు ఈ కారును షోరూమ్ నుండి కొనుగోలు చేస్తే, దీని కోసం మీరు రూ.6.91 లక్షల నుండి రూ.11.47 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మీ వద్ద అంత బడ్జెట్ లేకపోతే మాత్రం మరో ఆప్షన్ ఉంది.
Hyundai i20: ఈ పాండెమిక్ యుగంలో కారు అనేది లగ్జరీ ఏమాత్రం కాదు, అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనేది వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారే వీలుంది. ప్రజారవాణాలో భాగం అయిన బస్సులు, మెట్రోలు ఇతర వాహనాలను ఎప్పటి కప్పుడు సానిటైజ్ చేయడం అనేది అసాధ్యం అందుకే ఫ్యామిలీతో బయటకు వెళ్లేందుకు అలాగే ఇతర పనులకు ఉపయోగించేందుకు బడ్జెట్ కార్లను కొనాలని జనం ఎక్కువ ఆసక్త చూపిస్తున్నారు. ముఖ్యంగా కార్లలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో, మైలేజీతో పాటు అందుబాటులో ఉండే బడ్జెట్ కార్లు ప్రీమియం ఫీచర్లతో లభిస్తున్నాయి. ఈ కోవలో మారుతీ, హ్యుందాయ్ (Hyundai), హోండా వంటి కంపెనీల కార్లు కూడా ఉన్నాయి. వీటిలో హ్యుందాయ్ (Hyundai) i20 కారు చూడటానికి మంచి స్టైల్, చక్కటి మైలేజ్, ప్రీమియం ఫీచర్ల కోసం ఇష్టపడే స్పోర్టీ డిజైన్‌తో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గా మార్కెట్లో అందుబాటులో ఉంది. మీరు ఈ కారును షోరూమ్ నుండి కొనుగోలు చేస్తే, దీని కోసం మీరు రూ.6.91 లక్షల నుండి రూ.11.47 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ మీ వద్ద అంత బడ్జెట్ లేకపోతే మాత్రం మరో ఆప్షన్ ఉంది. తక్కువ బడ్జెట్లో కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం ఈ ఆఫర్ మీ కోసమే అని గుర్తుంచుకోండి. ఇందులో మీరు షోరూం కన్నాకూడా సగం కంటే తక్కువ ధరలో i20 కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.
ప్రముఖ కార్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ CARDEKHOలోని యూజ్డ్ కార్ విభాగంలో హ్యుందాయ్ (Hyundai) i20 కారును రూ. 3,40,500కే కొనుగోలు చేయవచ్చు. వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం, హ్యుందాయ్ (Hyundai) ఐ20 కారు మోడల్ నవంబర్ 2012ది అని గమనించండి. అయితే దీని యజమాని తొలి సారిగా కారును షోరూంలోనే కొనుగోలు చేశాడు. ఈ కారు ఇప్పటివరకు 54,554 కి.మీ నడిచింది. దీని రిజిస్ట్రేషన్ ఢిల్లీలోని DL 8C RTO కార్యాలయంలో నమోదు చేసి ఉంది.
ఇక్కడ మరో గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఈ కారు కొనుగోలుపై కంపెనీ 6 నెలల వారంటీతో పాటు ఏడు రోజుల మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా అందుబాటులో ఉంది. కారు లోన్ ద్వారా కొనాలనుకుంటే కంపెనీ సులభంగా డౌన్ పేమెంట్ మరియు EMIతో లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది.
హ్యుందాయ్ (Hyundai) i20 ద్వారా ఆధారితమైన 1197 cc ఇంజన్ 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో జత చేయబడింది. ఇది 120 PS శక్తిని మరియు 172 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం అవుతుంది. i20 కారు 20.35 kmpl మైలేజీని ఇస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.