హోమ్ /వార్తలు /business /

Hyundai i20 N Line: స్టైలిష్​ లుక్​తో హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ లాంచ్​.. కంప్లీట్​ రివ్యూ.. ఎలా ఉందంటే..

Hyundai i20 N Line: స్టైలిష్​ లుక్​తో హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్ లాంచ్​.. కంప్లీట్​ రివ్యూ.. ఎలా ఉందంటే..

ఐ20 ఎన్​లైన్​ ప్రస్తుతం రూ. 9.84 లక్షల నుంచి రూ. 11.75 లక్షల మధ్య అందుబాటులో ఉంది. హ్యుందాయ్​ తన i20 ఎన్​ లైన్ స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్‌ను N6, N8 అనే రెండు ట్రిమ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

ఐ20 ఎన్​లైన్​ ప్రస్తుతం రూ. 9.84 లక్షల నుంచి రూ. 11.75 లక్షల మధ్య అందుబాటులో ఉంది. హ్యుందాయ్​ తన i20 ఎన్​ లైన్ స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్‌ను N6, N8 అనే రెండు ట్రిమ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

ఐ20 ఎన్​లైన్​ ప్రస్తుతం రూ. 9.84 లక్షల నుంచి రూ. 11.75 లక్షల మధ్య అందుబాటులో ఉంది. హ్యుందాయ్​ తన i20 ఎన్​ లైన్ స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్‌ను N6, N8 అనే రెండు ట్రిమ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

    భారత్​లో బడ్జెట్​, మిడ్​రేంజ్​ కార్లకు భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే ఆటోమొబైల్​ సంస్థలు బడ్జెట్ కార్లపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తాజాగా ఐ20 ఎన్​ లైన్ వెర్షన్​ను విడుదల చేసింది. దీనికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఐ20 ఎన్​లైన్​ ప్రస్తుతం రూ. 9.84 లక్షల నుంచి రూ. 11.75 లక్షల మధ్య అందుబాటులో ఉంది. హ్యుందాయ్​ తన i20 ఎన్​ లైన్ స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్‌ను N6, N8 అనే రెండు ట్రిమ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

    హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ అనేది భారతీయ మార్కెట్లో మొట్టమొదటి ఎన్‌లైన్ సిరీస్ కారు. కానీ హ్యుందాయ్ 2013లోనే మొదటి ఎన్‌లైన్ సిరీస్ కారును ప్రవేశపెట్టింది. ఎన్‌లైన్ సిరీస్‌లో మొత్తం 11 మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో కోనా, టక్సన్ ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్లకు కొత్త జోడీగా ఎన్​ ఐ20 ఎన్​లైన్​ కారు విడుదలైంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కారు పర్ఫార్మెన్స్​ ఎలా ఉంది? డిజైన్​ ఎలా ఉంది? దీనిలో కొత్తగా చేర్చిన అప్​గ్రేడ్​ ఫీచర్లేంటి? మీకు ఎటువంటి అనుభూతిని ఇస్తుంది? అనే విషయాలను తెలుసుకుందాం.

    * డిజైన్​ ఎలా ఉంది?

    హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కారును అద్భుతమైన డిజైన్​, లుక్​తో రూపొందించారు. ఈ కారును ఎంచుకోవడానికి డిజైన్​ పెద్ద అంశంగా చెప్పవచ్చు. చెకర్డ్ ఫ్లాగ్ స్ఫూర్తితో దీనిలో కొత్త గ్రిల్స్​ను అందించారు.16 అంగుళాల అలాయ్, డ్యుయల్ క్రోమ్ టిప్డ్ ఎగ్జాస్ట్, సైడ్ వింగ్స్​ టెయిల్‌గేట్ స్పాయిలర్ వంటి అనేక ఆసక్తికరమైన డిజైన్​ ఫీచర్లను ఇందులో చేర్చింది. ఐ20 టర్బో సైడ్ టు సైడ్‌తో పోల్చితే N లైన్ మోడల్‌లో అనేక మార్పులను గమనించవచ్చు. ప్రత్యేకించి బ్లూ కలర్‌లో బంపర్, సైడ్‌లోని అన్ని రెడ్ ఎలిమెంట్స్‌ కారుకు అద్భుతమైన లుక్​ ఇస్తాయి.

    * క్యాబిన్​లో చేర్చిన కొత్త ఫీచర్లు?

    క్యాబిన్ లేఅవుట్‌విషయానికి వస్తే ఐ 20 మాదిరిగానే దీనిలో కూడా సరికొత్త స్పోర్ట్‌నెస్ అప్పీల్​ను అందించారు. రెడ్ ఎలిమెంట్స్‌తో కూడిన బ్లాక్-డార్క్ థీమ్ క్యాబిన్​ ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీని సీట్లను ఫ్లాగ్ డిజైన్‌తో రూపొందించారు. టోగుల్ స్విచ్ రకమైన ఏసీ బటన్లను కూడా అందించారు. దీనిలోని సీట్లు యూజ్ లెదర్​తో తయారయ్యాయి. ఇవి మీ కారుకు ప్రీమియం లుక్​ ఇస్తాయి.

    ఇక కారులోపల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్‌బిల్ట్ బ్లూలింక్ కనెక్టివిటీతో కూడిన పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఈ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్​ అద్భుతమైన బోస్ 7-స్పీకర్ ఆడియోకు మద్దతు ఇస్తుంది. హ్యుందాయ్ ఐ 20 ఎన్ లైన్‌ వాయిస్ ఎనేబుల్ సన్‌రూఫ్‌ను కూడా జోడించింది. కూలింగ్‌తో కూడిన వైర్‌లెస్ ఛార్జింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెడ్ యాంబియంట్ లైటింగ్ వంటి ఇతర ఫీచర్లను చేర్చింది.

    Harish Rao: టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావుకు వింత పరిస్థితి.. ప్లస్సా ? మైనస్సా ?

    Children Sleeping Hours: ఏ వయసు పిల్లలకు ఎంత నిద్ర అవసరమో తెలుసా ?.. కచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే..

    * పర్ఫార్మెన్స్​ ఎలా ఉంది?

    పర్ఫార్మెన్స్​ పరంగా చూస్తే ఈ సెగ్మెంట్​ కార్లలో ఉత్తమ కారుగా చెప్పవచ్చు. దీనిలోని 1.0 లీటర్ టర్బో ఇంజిన్ 120 HP, 172 NM అవుట్‌పుట్​ పవర్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6- స్పీడ్ iMT, 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్​లను సంస్థ అందించింది. i20 టర్బో మాదిరిగానే దీని స్టీరింగ్, సస్పెన్షన్, బ్రేకింగ్, మొత్తం డైనమిక్స్‌లో మార్పులు చేసింది.

    First published:

    ఉత్తమ కథలు