Price Hike | కొత్త ఏడాదిలో కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కార్ల కంపెనీలు వరుస పెట్టి కార్ల ధరలను పెంచుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ (Maruti Suzuki) కార్ల ధరలు పెరిగాయి. అలాగే ఫిబ్రవరి 1 నుంచి టాటా మోటార్స్ (Tata Motors) కార్ల ధరలు కూడా పైకి చేరతాయి. ఇప్పుడు ఈ కంపెనీల జాబితాలోకి మరో కంపెనీ వచ్చి చేరింది. అదే హ్యుందాయ్. ఈ కంపెనీ కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
హ్యుందాయ్ కంపెనీ తన మోస్డ్ డిమాండ్ కారు ఐ20 ఎన్ లైన్ ధరను పెంచేసింది. ఇప్పుడు కొత్తగా ఈ కారు కొనుగోలు చేయాలని భావించే వారు జేబు నుంచి ఎక్కువ డబ్బలు చెల్లించాల్సి వస్తుంది. ఈ కారులో చాలా ఫీచర్లు ఉన్నాయి. అందుకే కంపెనీకి చెందిన ఈ కారుకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. కంపెనీ హ్యుందాయ్ ఐ10 ఎన్ లైన్ స్టాండర్డ్ వేరియంట్ ధరను రూ. 16,500 వరకు పెంచేసింది. ఇప్పుడు ఈ కారు ధర రూ. 10.16 లక్షలకు చేరింది. ఇది ఎక్స్‌షోరూమ్ రేటు.
ఈ ఎలక్ట్రిక్ కారుతో రూ.14 లక్షలు ఆదా.. ఒక్కసారి చార్జ్ చేస్తే 240 కి.మి వెళ్లొచ్చు!
హ్యుందాయ్ ఇటీవలనే మార్కెట్‌లోకి సరికొత్త గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌ను తీసుకువచ్చింది. దీని ధర రూ. 5.68 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే హ్యుందాయ్ కంపెనీ ఇందులో సీఎన్‌జీ కారును లాంచ్ చేసింది. దీని రేటు 6.3 లక్షల నుంచి ఉంది. ఇవ్వన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ కారు 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తోంది. ఇది మ్యానువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
ఎస్‌బీఐ కొత్త ఆఫర్ అదిరింది.. లోన్ తీసుకునే వారికి సూపర్ బెనిఫిట్స్!
ఈ కారు గరిష్టంగా లీటరుకు 20.25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. కారులోని ఫీచర్లను గమనిస్తే.. హ్యుందాయ్ ఐ20 నియో లైన్‌లో 10.25 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట సిస్టమ్, బాస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ చార్జింగ్, ఆటో క్లైమెట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందువల్ల అందుబాటు ధరలో మంచి కారు కొనుగోలు చేయాలని భావించే వారు ఈ బడ్జెట్ కారును ఒకసారి పరిశీలించొచ్చు. ఎందుకంటే ఇందులో అదిరే ఫీచర్లు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best cars, Budget cars, Cars, Hyundai, MARUTI SUZUKI, Price Hike, Tata Motors