హ్యుందాయ్ మోటార్స్ ఇండియా సరికొత్త ఐ20 కార్లను లాంఛ్ చేసింది. ప్రారంభ ధర రూ.6,79,900 మాత్రమే. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఈ ఏడాది మార్చిలో జెనీవా మోటార్ షోలో ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను ప్రదర్శించాలనుకుంది హ్యుందాయ్ మోటార్స్. కరోనా వైరస్ కారణంగా ఆ ఈవెంట్ జరగలేదు. మొత్తానికి ఇండియాలో హ్యుందాయ్ ఐ20 కార్ లాంఛ్ అయింది. ఈ కార్ ఇండియాలో Tata Altroz, Maruti Suzuki Baleno కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. వారం రోజుల క్రితమే బుకింగ్ ప్రారంభమైంది. కేవలం రూ.21,000 చెల్లించి ఈ కారు బుక్ చేసుకోవచ్చు. ఇక హ్యుందాయ్ ఐ20 కార్ ప్రత్యేకతల విషయానికి వస్తే హ్యాచ్‌బ్యాక్‌లో యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఉంటాయి. క్యాబిన్ లోపల 20.63 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ హెచ్డీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో బ్లూలింక్ కనెక్టివిటీ ఉన్న మొదటి కారు ఇది. బోస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జర్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. హ్యుందాయ్ ఐదేళ్ల వారెంటీ, మూడేళ్ల బ్లూలింక్ సబ్స్క్రిప్షన్, మూడేళ్ల ఆర్ఎస్ఏ అందిస్తోంది. ఇక హ్యుందాయ్ ఐ20 ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ, డేటాతో Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవేప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ పొందొచ్చు... LIC Jeevan Labh policy ప్రత్యేకత ఇదే
హ్యుందాయ్ ఐ20 1.2 పీ ఎంటీ మాగ్నా- రూ.6,79,900
హ్యుందాయ్ ఐ20 1.2 పీ ఎంటీ స్పోర్ట్జ్- రూ.7,59,900
హ్యుందాయ్ ఐ20 1.2 పీ ఎంటీ ఆస్టా- రూ.8,69,900
హ్యుందాయ్ ఐ20 1.2 పీ ఎంటీ ఆస్టా (ఓ) - రూ.9,19,900
హ్యుందాయ్ ఐ20 1.2 పీ ఐవీటీ స్పోర్ట్జ్- రూ.8,59,900
హ్యుందాయ్ ఐ20 1.2 పీ ఐవీటీ ఆస్టా- రూ.9,69,900
హ్యుందాయ్ ఐ20 1.0 టర్బో ఐఎంటీ స్పోర్ట్జ్ - రూ.8,79,900
హ్యుందాయ్ ఐ20 1.0 టర్బో ఐఎంటీ ఆస్టా- రూ.9,89,900
హ్యుందాయ్ ఐ20 1.0 టర్బో డీసీటీ ఆస్టా- రూ.10,66,900
హ్యుందాయ్ ఐ20 1.0 టర్బో డీసీటీ ఆస్టా (ఓ)- రూ.11,17,900
హ్యుందాయ్ ఐ20 1.5 D ఎంటీ మాగ్నా- రూ.8,19,900
హ్యుందాయ్ ఐ20 1.5 D ఎంటీ స్పోర్ట్జ్- రూ.8,99,900
హ్యుందాయ్ ఐ20 1.5 D ఎంటీ ఆస్టా (ఓ)- రూ.10,59,900
ఇవన్నీ ఇంట్రడక్టరీ, ఎక్స్షోరీమ్ ధరలు మాత్రమే. ఆన్‌రోడ్ ధర మారుతుంది.