Hyundai i20 Magna: కొత్త i20 కారు కొంటున్నారా...కేవలం కొత్త బుల్లెట్ బైకు ధరకే...ఎలాగంటే..

Hyundai i20 Magna: హ్యుందాయ్ కంపెనీ కార్లలో చక్కటి సేల్స్ సాధిస్తున్న మోడల్ ఏదైనా ఉందంటే అది I20 అనే చెప్పాలి. ఈ కారులోని i20 magna బేస్ వేరియంట్ ఇప్పటికే మంచి ఆదరణ పొందింది.

news18-telugu
Updated: November 21, 2020, 7:27 PM IST
Hyundai i20 Magna: కొత్త i20 కారు కొంటున్నారా...కేవలం కొత్త బుల్లెట్ బైకు ధరకే...ఎలాగంటే..
Hyundai i20 Magna: హ్యుందాయ్ కంపెనీ కార్లలో చక్కటి సేల్స్ సాధిస్తున్న మోడల్ ఏదైనా ఉందంటే అది I20 అనే చెప్పాలి. ఈ కారులోని i20 magna బేస్ వేరియంట్ ఇప్పటికే మంచి ఆదరణ పొందింది.
  • Share this:
హ్యుందాయ్ కంపెనీ కార్లలో చక్కటి సేల్స్ సాధిస్తున్న మోడల్ ఏదైనా ఉందంటే అది I20 అనే చెప్పాలి. ఈ కారులోని i20 magna బేస్ వేరియంట్ ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా ఈ కారు స్టైలిష్ డిజైన్ తో పాటు చక్కటి లుక్ ఆకర్షణీయంగా మార్చింది. ఈ కారు మొత్తం 6 కలర్స్ లో లభిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ కారు వారంటీ అని చెప్పవచ్చు. వారంటీలో 3 Years /1 Lakh Km, 4 Years/60000km, 5 years/ 50000 km అందుబాటులో ఉంది. అలాగే 3 సంవత్సరాల పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫ్రీగా లభిస్తోంది. ఈ వ్యారంటీ కస్టమర్ ఆప్షన్ ను బట్టి ఎంపిక చేసుకోవచ్చు.

సేఫ్టీ ఫీచర్స్...

సెఫ్టీ ఫీచర్స్ లో భాగంగా 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS with EBD, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సెంట్రల్ లాకింగ్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్,  ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్ లాక్, చైల్డ్ లాక్ బటన్, సీట్ బెల్ట్ ప్రిటెన్షన్స్, స్పీడ్ అలర్ట్ సిస్టం, ఇంజన్ ఇమ్మొబిలైజర్, సీట్ బెల్ట్ రిమైండర్ అందిస్తున్నారు. అయితే బడ్జెట్ కార్లలో ఇన్ని రకాల సేఫ్టీ ఫీచర్స్ లభించడం చాలా అరుదు అనే చెప్పాలి.

ధరలు ఇవే...

Hyundai i20 Magna 1.2 Petrol Manual విషయానికి వస్తే ఆన్ రోడ్ ధర..8.12 లక్షలు రూపాయలు...

Hyundai i20 Magna 1.2 Diesel Manual విషయానికి వస్తే ఆన్ రోడ్ ధర. 9.75 లక్షల రూపాయలుగా మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే బేస్ వేరియంట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఉండదు.

ఫీచర్స్ ఇవే..

దీని ఫ్రంట్ లో హాలోజన్ హెడ్ ల్యాంప్స్, అన్ని వేరియంట్స్ లో ప్రొజెక్టర్ లాంప్స్ , ఎల్ఈడీ డీఆర్ఎల్,  న్యూ ఫినిష్డ్ పియానో బ్లాక్ గ్రిల్, మాగ్నా వేరియంట్ లో 180/65 50 ఇంచ్ స్టీల్ రిమ్స్, వీల్ క్యాప్ తో వస్తాయి. ఫ్రంట్ డిస్క్, డ్రం బ్రేక్స్ అందిస్తున్నారు. అంతేకాదు టర్న్ ఇండికేటర్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ మన్యువల్లీ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్, బాడీ కలర్ డోర్ హాండిల్స్,  హలోజన్ టెయిల్ లాంప్స్ మాగ్నా వేరియంట్ లో రేర్ కెమెరా అందించడం లేదు.  టూల్ కిట్, స్పేర్ వీల్ కూడా అందిస్తున్నారు.  అలాగే ఈ కారులో వెనుక సీటుకు ముందు లెగ్ స్పేస్ కూడా బాగుంది. వెనుక భాగంలో ఏసీ ఇన్ లెట్స్ ప్రత్యేకంగా న్నాయి. వెనుక వైపు కూడా యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ అందిస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ దీని ప్రత్యేకత. స్టీరింగ్ పైనే ఆడియో, ఫోన్ కంట్రోల్స్ అందిస్తున్నారు.

మైలేజీ ఇదే..

Hyundai i20 Magna 1.2 MT ఇంజిన్ 1197 cc తో లభిస్తోంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో లభిస్తోంది. ఇక మైలేజీ విషయానికి వస్తే 20.35 kmpl లభిస్తోంది. 82 bhp @ 6000 rpm, 115 Nm @ 4200 rpm max power, max torque లభిస్తున్నాయి. BS 6 ఇంజిన్ తో పాటు Transmission Manual - 5 Gears తో లభిస్తోంది. Fuel Tank Capacity 37 litres గా లభిస్తోంది.

కలర్స్ ఇవే...

మొత్తం 6 కలర్ వేరియంట్స్ లో లభిస్తోంది. Starry Night, Titan Grey, Metallic Copper, Typhoon Silver, Fiery Red, Polar White గా అందుబాటులో ఉన్నాయి.

ఫైనాన్స్ ప్రాతిపదికన ఈ కారును కొనుగోలు చేయాలంటే.. ₹ 1,23,406ల మినిమం డౌన్ పేమెంట్ ద్వారా పొందవచ్చు. 5 సంవత్సరాల కాలవ్యవధికిగానూ 14,179 EMI చెల్లించాల్సి ఉంటుంది. కాగా కారు లోన్ వడ్డీ 9.2 శాతం ప్రాతిపదికన ఈ చెల్లింపు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అంచనాలన్నీ కార్ వాలే వెబ్ సైట్ ప్రాతిపదికన సేకరించినవిగా గమనించాలి.
Published by: Krishna Adithya
First published: November 21, 2020, 7:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading