దక్షిణ కొరియా (South korea)కు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ (Hyundai) చాలా దేశాల్లో సూపర్ పాపులర్ అయింది. ఈ కంపెనీ కార్లకు భారతదేశంలో కూడా మంచి డిమాండ్ ఉంది. గతేడాది భారతదేశంలో సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) విడుదలైంది. ఇది దాని ప్రత్యర్థులకు బలమైన పోటీ ఇచ్చి అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ (SUV)గా రికార్డు నెలకొల్పింది. నిజానికి ఈ మోడల్ కారు (model car) ఇతర దేశాలతో పోలిస్తే మన ఇండియా (India)లో కాస్త ఆలస్యంగానే రిలీజ్ అయింది. 2019లో చైనాతో సహా అనేక అంతర్జాతీయ మార్కెట్ల (International market)లో విడుదలయింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో సత్తా చాటుతున్న ఈ హ్యూందాయ్ క్రెటా మోడల్ రూపం పూర్తిగా మారబోతోంది. తాజాగా హ్యూందాయ్ కంపెనీ.. హ్యూందాయ్ క్రెటా ((Hyundai Creta)) కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ (Facelift Model) డిజైన్ స్కెచ్‌లను అధికారికంగా విడుదల చేసింది.
డిజైన్‌పై క్లారిటీ..
కొంతకాలం క్రితం ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ (Facelift Model) కేవలం పాత కారు డిజైన్ మాత్రమే మార్చే కొత్త మోడల్‌కు సంబంధించి ఫొటోలు అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యాయి. అయితే, తాజాగా స్వయంగా కంపెనీయే స్కెచ్ (Sketch)లు రిలీజ్ చేయడంతో డిజైన్ ఎలా ఉంటుందనే దానిపై పూర్తి స్థాయిలో అవగాహన వస్తోంది. ఈ మోడల్ ఫ్రెంట్, బ్యాక్ పార్ట్స్ లతో పాటు డాష్ బోర్డు పూర్తిగా మారనున్నట్లు ఫేస్‌లిఫ్ట్ స్కెచెస్ చూస్తే అర్థం అవుతోంది.
మొదట ఇండోనేషియాలో..
కొత్త హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta) మొదట ఇండోనేషియాలో లాంచ్ కానుంది. కొత్త తరం టక్సన్ (Tucson) డిజైన్ ను ఆధారంగా తీసుకొని కొత్త క్రెటాను డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ టక్సన్ సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యింది. క్రెటా కొత్త మోడల్ లో ఎల్ఈడీ డీఆర్ఎల్ (LED DRL)లతో 'పారామెట్రిక్ హిడెన్ లైట్స్' అని పిలిచే రేడియేటర్ గ్రిల్ ఉంటుందని హ్యూందాయ్ చెబుతోంది.
క్లస్టర్ సైజులో చిన్నది..
ఫేస్‌లిఫ్ట్ స్కెచెస్ ప్రకారం కొత్త టక్సన్ కంటే క్రెటా హెడ్‌ల్యాంప్ క్లస్టర్ సైజులో చిన్నదిగా ఉంది. హెడ్‌ల్యాంప్ క్లస్టర్ గ్రిల్‌లో ఒదిగిపోయింది. లైట్ ఆన్ చేసినప్పుడు తప్ప హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఎవరికీ కనిపించినంత అద్భుతంగా డిజైన్ చేశారు. అయితే, రియర్-ఎండ్ డిజైన్ భారతదేశంలో రిలీజైన మోడల్‌తో సమానంగా ఉంది. అలాగే బూమరాంగ్ ఆకారంలో ఎల్ఈడీ సిగ్నేచర్ ఉంది.
హ్యూందాయ్ క్రెటా (Hyundai Creta) ఫేస్‌లిఫ్ట్ మోడ (Facelift Model)ల్ లోని ఇంటీరియర్ అనేది డీ-కట్ స్టీరింగ్ వీల్‌తో ఇండియా-స్పెక్ మోడల్ లాగానే ఉంటుందని ప్రస్ఫుటమవుతుంది. ఇండోనేషియాలో విడుదలయ్యే క్రెటాలో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ కొంత సమయం తర్వాత అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మొదట ఇండోనేషియా విడుదలవుతుంది. తరువాత ఇతర మార్కెట్లలోకి లాంచ్ అవుతుంది. అయితే ప్రస్తుత మోడల్ అందుబాటును బట్టి భారతదేశంలో ఇది కాస్త ఆలస్యంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Hyundai, New cars