హోమ్ /వార్తలు /బిజినెస్ /

తక్కువ బడ్జెట్ లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా...అయితే Hyundai Grand i10 మీకోసం..

తక్కువ బడ్జెట్ లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా...అయితే Hyundai Grand i10 మీకోసం..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

భారత మార్కెట్లోకి 2007లో అడుగుపెట్టిన Hyundai i10 మార్కెట్ షేర్ చాలా బాగుంది. మనదేశంలో బాగా అమ్ముడుబోయిన హ్యూండాయ్ శాంట్రో సక్సెసర్ గా వచ్చిన Hyundai Grand i10కు గ్రాండ్ రెస్పాన్స్ వచ్చింది.

  భారత మార్కెట్లోకి 2007లో అడుగుపెట్టిన Hyundai i10 మార్కెట్ షేర్ చాలా బాగుంది. మనదేశంలో బాగా అమ్ముడుబోయిన హ్యూండాయ్ శాంట్రో సక్సెసర్ గా వచ్చిన Hyundai Grand i10కు గ్రాండ్ రెస్పాన్స్ వచ్చింది. 2015లో శాంట్రో డిస్ కంటిన్యూ అయినప్పుడు ఒకే ఒక ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ గా పోర్ట్ ఫోలియోలో i10 మిగిలిపోయింది. ఆతరువాతి నుంచి i10కు తరచూ ఫేస్ లిఫ్ట్ ఇస్తూ ప్రస్తుతమున్న వావ్ అనే మోడల్ ను రిలీజ్ చేసేవరకూ దీని ప్రస్తానం సాగింది. Hyundai Grand i10 Nios turbo పెట్రోల్ లాంచింగ్ కోసం మార్కెట్లో చాలా మంది ఎదురుచూపులు చూశారు. చివరికి దీన్ని చూస్తే మాత్రం వావ్.. ఇదో పాకెట్ రాకెట్ అనేలా ఉందని డ్రైవ్ చేసినవారు ఫీల్ అవుతున్నారు.

  స్టన్నింగ్ లుక్

  గ్రాండ్ i10 చూసేందుకు స్టన్నింగ్ లుక్ తో డ్యూయల్ టోన్ రెడ్ అండ్ బ్లాక్ పెయింట్ స్కీమ్ చాలా బాగుంది. సెవెన్-LED లైట్స్ తో ఎక్స్ ట్రీమ్లీ బ్రైట్ గా ఉంది. హై అండ్ లో బీమ్ ప్రొజెక్టర్ సెట్ అప్ తో హెడ్ లైట్ యూనిట్ ఆకర్షణీయంగా ఉంది. హాలోజెన్ యూనిట్ తో ఫాగ్ లైట్స్ కూడా ప్రొజెక్టర్స్ మోడల్ లో ఉన్నాయి. కార్ స్పోర్టీగా కనిపించేందుకు తక్కువ హెడ్ లైట్ క్రోమ్ ఉండేలా మాడిఫికేషన్స్ చేపట్టారు. హుడ్ లైన్స్, క్రీసెస్ తో ఈ కార్ కాస్త మాస్కులర్ లా కనిపించడం హైలైట్. హ్యాచ్ బ్యాక్ కు కాస్త ఆగ్రెస్సివ్ లుక్ వచ్చేలా కారుకు లిప్ ట్రీట్మెంట్ అంటే ఫ్రంట్ బంపర్ లో మార్పు చేర్పులు చేశారు. షార్క్ ఫిట్ యాంటెనా, అలాయ్ వీల్స్ తో స్పోర్టీ స్టాన్స్ వచ్చింది.

  ఇంటీరియర్స్, ఫీచర్స్

  స్పోర్టీ క్యాబిన్ తో ఉన్న ఈ కొత్త మోడల్ కార్ మొత్తం బ్లాక్ కలర్ ఫినిష్ తో ఇంటీరియర్స్ బాగున్నాయి. ఆల్ బ్లాక్డ్ ఔట్ థీమ్ తో పాటు రెడ్ యాసెంట్స్ స్పోర్టీ నేచర్ తెచ్చిపెట్టాయి. సీట్ కవర్లు , ఏసీ వెంట్స్ కు రెడ్ కలర్ పైపింగ్ కూడా కొత్త లుక్ తెచ్చింది. ముందు 2 సీట్లకు హెడ్ రెస్ట్ ఉండగా, ఇవి బకెట్ సీట్లలా ఉన్నాయి. వెనకల సీట్లు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉండగా, ఇక్కడ ఈజీగా 3 కూర్చునే వెసులుబాటుంది. రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి కనుక వెనుక వరుసలో కూర్చున్న వారికి ఏసీ బాగా వస్తుంది. దీని బూట్ స్పేస్ 260 లీటర్స్.

  ఇన్ఫోటైన్మెంట్

  ముందున్న డ్యాష్ బోర్డులో 7 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉండగా ఇది టచ్ స్క్రీన్ తో చాలా వేగంగా పనిచేసే అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ కావడంతో బాగా కనిపిస్తుంది. ఎండలో ఎటువంటి ఇబ్బంది రాదు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 4-స్పీకర్ మ్యూజిక్ సిస్టం చాలా డీసెంట్ గా ఉంది. క్లైమేట్ కంట్రోల్ సిస్టం కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో భాగం కాగా టెంపరేచర్ సెట్టింగ్స్ LCD స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ సెమీ-డిజిటల్ గా ఉంది. స్పీడ్, టైం, డిస్టన్స్, టెంపరేచర్, ట్రిప్స్ వంటివి ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. 3 సిలెండర్స్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ హ్యూడాయ్ ఔరా, వెన్యూలో కూడా ఉంది. Grand i10 Nios turbo 98bhp power, 172Nm peak torqueతో మంచి సమర్థవంతమైన ఇంజిన్ గా ఉంది. కారు మొత్తం బరువు 983 కేజీలు. 5 స్పీడ్ గేర్ బాక్స్ చాలా షార్ప్ గా ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ లేదు, ABS ఉంది.

  మిగతా హ్యూండాయ్ కార్స్ మోడల్ లో కాకుండా ఈ కొత్త కారులో స్టీరింగ్ వీల్ కాస్త స్టిఫ్ గా ఉంటుంది. బయటి సౌండ్ పెద్దగా కార్ లోపలికి వినిపించదు. 3000rpm మార్క్ దాటేవరకూ కార్ చాలా సైలెంట్ గా ఉంటుంది. కానీ ఆతరువాత మాత్రం కాస్త సౌండ్ క్యాబిన్ లోకి వినిపిస్తుంది. ఇక మైలేజ్ పై ఫోకస్ పెట్టిన కంపెనీ 20km/l వస్తుంది. కానీ ఈ కారును సిటీలో టెస్ట్ చేసినప్పుడు మాత్రం 9-12కిలోమీటర్ల మధ్య మైలైజ్ వచ్చింది. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మాత్రం 13-14 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక హైవేలో ఇంతకంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది. పవర్ డెలివరీ మాత్రం చాలా ఆసమ్ గా ఉంది.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Automobiles, Cars

  ఉత్తమ కథలు