news18-telugu
Updated: November 16, 2020, 6:14 PM IST
ప్రతీకాత్మకచిత్రం
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి గతేడాది విడుదలైన Hyundai Grand i10 Nios కారు గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ స్కోర్ విడుదలైంది. దీనిలో 2 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ హ్యాచ్ బ్యాక్ కారు. అడల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్‌లో భాగంగా చేసిన టెస్ట్‌లో ఈ రేటింగ్‌ను దక్కించుకుంది. దీంతో పాటు ఇతర కంపెనీలకు చెందిన మరిన్ని వేరియంట్లపై కూడా గ్లోబల్ ఎన్సిఎసి
క్రాష్ టెస్ట్ రేటింగ్ విడుదల... ఈ టెస్టింగ్ లో భాగంగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటు మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో, కియా సెల్టోస్ కార్లను పరీక్షించగా, మారుతీ సుజుకి ఎస్ప్రెస్సో ఎటువంటి రేటింగ్ ను పొందలేక రైడర్ ప్రొటెక్షన్‌లో వెనుకబడిపోయింది. అదేవిధంగా, కియో సెల్టోస్ మాత్రం 3 స్టార్ రేటింగ్ ను సాధించి రైడర్ ప్రొటెక్షన్‌లో మంచి ర్యాంకింగ్ ను దక్కించుకుంది. కాగా, Hyundai Grand i10 Nios వేరియంట్ మాత్రం పెద్దలు, పిల్లల రక్షణలో ప్రత్యేకంగా 2 స్టార్ రేటింగ్ ను పొందింది.
అట్రాక్టివ్ ప్రొటెక్షన్ ఫీచర్లతో రూపొందించబడిన ఈ కారు డ్రైవింగ్ సీట్లో కూర్చునే వారి కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు సీట్-బెల్ట్ ప్రిటెన్షనర్ను చేర్చింది. దీని ద్వారా డ్రైవింగ్‌లో ఉన్న వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనితో పాటు హ్యుందాయ్‌కి చెందిన గ్రాండ్ ఐ 10 నియోస్ బేస్ "ఎరా" వేరియంట్‌పై కూడా గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్టింగ్ జరిగింది. అయితే, గ్రాండ్ ఐ 10 నియోస్ స్ట్రక్చర్, ఫుట్‌వెల్ ప్రాంతాన్ని గ్లోబల్ ఎన్‌సిఎపి 'అన్ స్టేబుల్'గా రేట్ చేయగా, డ్రైవింగ్ సీలులో ఉండే వ్యక్తి తల, మెడకు మరింత రక్షణ వ్యవస్థ ఉండటంతో బెస్ట్ రేటింగ్‌ను ఇచ్చారు. డ్రైవింగ్ చేసే వ్యక్తి ఛాతీ రక్షణ పరంగా చూస్తే "బలహీనమైన" రేటింగ్ పొందగా, ముందు సీట్లో కూర్చునే ప్రయాణీకుడి రక్షణకు మాత్రం మంచి రేటింగ్ ను దక్కించుకుంది.
పిల్లల రక్షణకు పేలవమైన రేటింగ్..
గ్లోబల్ ఎన్‌సిఎపి ప్రకారం, పిల్లల రక్షణ విషయానికి వస్తే హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ పేలవమైన ఫలితాలను చూపించింది. ఈ కారులో సిఫార్సు చేయబడిన పిల్లల నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో పేలవమైన రేటింగ్‌ను పొందింది. ముఖ్యంగా మూడేళ్ల వయసున్న పిల్లల రక్షణకు దీనిలో సరైన రక్షణ వ్యవస్థ లేదని గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో తేలింది. కాగా, ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రామాణిక ISOFIX చైల్డ్ -సీట్ యాంకర్లతో పాటు ప్రయాణీకులందరికీ మూడు పాయింట్ల సీట్ బెల్ట్ లేకపోవడంతో రేటింగ్ పై కొంత మేర ప్రతికూల ప్రభావాన్ని చూపిందనే చెప్పవచ్చు. కాగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తుంది.
Published by:
Krishna Adithya
First published:
November 16, 2020, 6:14 PM IST