హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyundai Electronics: హ్యుందాయ్ నుంచి 4K స్మార్ట్ టీవీ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే

Hyundai Electronics: హ్యుందాయ్ నుంచి 4K స్మార్ట్ టీవీ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyundai Electronics: హ్యుందాయ్ 4K UHD స్మార్ట్ ఎల్​ఈడీ టీవీలు నార్మల్ ఆండ్రాయిడ్ స్మార్ట్​టీవీల కంటే నాలుగు రెట్లు వేగంగా పనిచేస్తాయి. మొత్తం 3 మోడళ్లలో ఇవి లభిస్తాయి.

ప్రముఖ ఎలక్ట్రానిక్​ ఉత్పత్తుల సంస్థ హ్యుందాయ్ ఎలక్ట్రానిక్స్  (Hyundai Electronics) సరికొత్త 4K అల్ట్రా హెచ్​డీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ (Ultra HD LED Smart TV)ని లాంచ్​ చేసింది. వెబ్‌ఓఎస్ అనే అధునాతన టెక్నాలజీతో దీన్ని రూపొందించింది. థిన్‌క్యూ ఏఐ వాయిస్ రికగ్నిషన్, మ్యాజిక్ రిమోట్‌ వంటి అధునాతన ఫీచర్లను దీనిలో అందించింది. ఈ స్మార్ట్​టీవీ ARM CA55 1.1 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ 4K UHD స్మార్ట్ ఎల్​ఈడీ టీవీలు నార్మల్ ఆండ్రాయిడ్ స్మార్ట్​టీవీల కంటే నాలుగు రెట్లు వేగంగా పనిచేస్తాయి. ఈ సరికొత్త హ్యుందాయ్ స్మార్ట్ టీవీలు మొత్తం 3 మోడళ్లలో లభిస్తాయి.

ఈ టీవీలు భారతదేశ వ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్​ ఎలక్ట్రానిక్స్​ రిటైల్ స్టోర్లతో పాటు హ్యుందాయ్​ అధికారిక వెబ్‌సైట్ www.hyundaice.inలో అందుబాటులో ఉంటాయి. ఇది 1.5GB ర్యామ్​, 8GB ఇంటర్నల్ స్టోరేజ్​తో వస్తుంది. దీనిలో డ్యూయల్ బ్యాండ్ వైఫై, ALLM (ఆటో లో లేటెన్సీ మోడ్), MEMC (మోషన్ ఎస్టిమేషన్ అండ్​ మోషన్ కాంపెన్సేషన్), మిరాకాస్ట్, 2 వే బ్లూటూత్ వంటి కనెక్టింగ్​ ఫీచర్లను అందించింది. ఇది వెబ్‌ఓఎస్ స్మార్ట్ ఇంటర్‌ఫేస్‌తో రూపొందింది. ఇది నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ ప్రైమ్​, యూట్యూబ్​, డిస్నీ ప్లస్​ హాట్​స్టర్​, సోనీలివ్​. జీ5 వంటి ఓటీటీ యాప్స్​కు మద్దతిస్తుంది. మెరుగైన ఆడియో కోసం, టీవీలో డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీతో పాటు 20W సరౌండ్ సౌండ్ బాక్స్ స్పీకర్లను కూడా అందించింది.

Redmi 9 Activ: సైలెంట్‌గా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... ఫీచర్స్ ఇవే

* భారత స్మార్ట్​టీవీ మార్కెట్​లో గేమ్​ ఛేంజర్​..

వెబ్‌ఓఎస్‌తో 4 కె అల్ట్రా హెచ్‌డి స్మార్ట్ ఎల్‌ఈడి టీవీలను ప్రారంభించిన సందర్భంగా హ్యుందాయ్ ఎలక్ట్రానిక్స్ సీఓఓ అభిషేక్ మల్పానీ మాట్లాడుతూ, “మా కస్టమర్లకు అద్భుతమైన, అధునాతన టీవీ వీక్షణ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో కొత్త స్మార్ట్​టీవీని లాంచ్​ చేశాం. ఈ ప్మార్ట్​టీవీని వెబ్‌ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించాం. దీనిలో AI టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ కంటెంట్ సర్వీసెస్​ను అందించాం. వెబ్‌ఓఎస్ టీవీ ద్వారా ఆధారిత 4 కె అల్ట్రా హెచ్‌డి స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ భారత స్మార్ట్​టీవీ మార్కెట్​లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్నాం.” అని అన్నారు.

Infinix: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇన్ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఇవే

హ్యుందాయ్ స్మార్ట్ టీవీల ధర విషయానికొస్తే 43 అంగుళాల స్మార్ట్​టీవీ రూ. 34,490.ఇక 50 అంగుళాల స్మార్ట్​టీవీ రూ. 45,990గా ఉంది. 55  అంగుళాల స్మార్ట్​టీవీ రూ. 52,990 వద్ద అందుబాటులో ఉంటుంది.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Hyundai, LED TV, Smart TV, Technology

ఉత్తమ కథలు