HYUNDAI CRETA WAS THE MOST EXPORTED SUV FROM INDIA IN 2021 GH VB
Hyundai Creta: అరుదైన ఘనత సాధించిన హ్యుందాయ్ క్రెటా.. 2021లో మోస్ట్ ఎక్స్‌పోర్టెడ్ ఎస్‌యూవీగా రికార్డు..
ప్రతీకాత్మక చిత్రం
భారత ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ క్రెటా సంచలనం సృష్టించింది. గతేడాది భారత్ నుంచి విదేశాలకు అత్యధికంగా ఎగుమతి అయిన కారుగా రికార్డుకెక్కింది. దీంతో, 2021లో మోస్ట్ ఎక్స్‌పోర్టెడ్ ఎస్‌యూవీగా ఘనత దక్కించుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 26.17 శాతం వృద్ధిని నమోదు చేసింది.
భారత ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ క్రెటా(Creta) సంచలనం సృష్టించింది. గతేడాది భారత్ నుంచి విదేశాలకు అత్యధికంగా ఎగుమతి అయిన కారుగా రికార్డుకెక్కింది. దీంతో, 2021లో మోస్ట్ ఎక్స్‌పోర్టెడ్ ఎస్‌యూవీగా(SUV) ఘనత దక్కించుకుంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 26.17 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా 2021లో 32,799 యూనిట్ల క్రెటా ఎస్‌యూవీలు భారత్ (Bharath) నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. 2020లో ఈ సంఖ్య 25,995గా ఉండేది. 2021లో హ్యుందాయ్(Hyundai) మోటార్ ఇండియా మొత్తంగా 42,238 ఎస్‌యూవీలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో క్రెటా గ్రాండ్తో పాటు వెన్యూ మోడల్స్ కూడా ఉన్నాయి. వెన్యూ 7,698 యూనిట్లు, క్రెటా గ్రాండ్ 1,741 యూనిట్లు విదేశాలకు ఎగుమతి అయ్యాయి.
క్రెటా అత్యధికంగా ఎగుమతి అయిన ఎస్‌యూవీగా అవతరించడంపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఎండీ & సీఈవో ఉన్ సూ కిమ్ మాట్లాడుతూ "మేక్ ఇన్ ఇండియా విజన్‌లో భాగంగా హ్యుందాయ్ క్రెటా వాహనాల ఉత్పత్తిని పెంచాం. వాటిని విదేశాలకు ఎగుమతి చేశాం. ఇప్పటికే క్రెటా దేశీయ & అంతర్జాతీయ మార్కెట్లలో రన్అవే విజయాన్ని సాధించింది. తద్వారా హ్యుందాయ్ గ్లోబల్ ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోలో వ్యూహాత్మక పాత్రను పోషిస్తోంది. క్రెటా భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన ఎస్యూవీ కావడంతో ఇది విదేశీ మార్కెట్లోనూ అత్యంత ఇష్టపడే ఎస్యూవీ వాహనాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. కంపెనీ ఇప్పటికే 2.62 లక్షల యూనిట్ల ఎస్‌యూవీలను విదేశాలకు రవాణా చేసింది.” అని తెలిపారు.
ఎగుమతుల్లో 26.17 శాతం వృద్ది..
హ్యుందాయ్ ఇండియా గత సంవత్సరం క్రెటా, ఐ20, వెర్నా, అల్కాజార్ వంటి మోడళ్లను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత వాటిని గ్లోబల్ మార్కెట్లోకి విస్తరించింది. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా & ఆస్ట్రేలియా వంటి దేశాల్లో హ్యుందాయ్ వాహనాలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వీటికి అదనంగా కంపెనీ దక్షిణాఫ్రికా, పెరూ వంటి కీలక మార్కెట్లలోకి వరుసగా కొత్త N లైన్, LPG వేరియంట్లను కూడా విడుదల చేయడం ప్రారంభించింది.
ఇలా 2021లో మొత్తం 1,30,380 హ్యుందాయ్ వాహనాలను విదేశాలకు ఎగుమతులు నమోదు చేసింది. గ్లోబల్ సెమీ-కండక్టర్ సంక్షోభం, కరోనా లాక్డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ 2020 కంటే 2021లో 31.8 శాతం గణనీయమైన వృద్ధిని సాధించింది. మరోవైపు, ఎగుమతి దేశాల జాబితాలో డొమినికా, చాడ్, ఘనా, లావోస్ వంటి మరో నాలుగు కొత్త దేశాలను కూడా జోడించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.