హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ కారు లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి..

Hyundai Creta: హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ కారు లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) పాత మోడళ్లకు కొత్త అప్‌గ్రేడ్స్ చేయడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో క్రెటా ఎడిషన్‌కు వివిధ రకాల కాస్మెటిక్ మార్పులతో స్పెషల్ క్రెటా నైట్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది.

హ్యుందాయ్ మోటార్(Hyundai Motor) ఇండియా లిమిటెడ్ (HMIL) పాత మోడళ్లకు కొత్త అప్‌గ్రేడ్స్ చేయడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో క్రెటా ఎడిషన్‌కు వివిధ రకాల కాస్మెటిక్ మార్పులతో స్పెషల్ క్రెటా నైట్ ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్.. పెట్రోల్, డీజిల్ ఇంజన్‌ ఆప్షన్‌లతో S+, SX(O) ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. నైట్ ఎడిషన్ ధరలు రూ. 13.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. నైట్ ఎడిషన్ ఫుల్ బ్లాక్ థీమ్‌తో వస్తుంది. గ్రిల్ మొత్తం బ్లాక్ అండ్ రెడ్ ఎస్సెంట్‌లో వస్తుంది. వెనుక భాగంలో నైట్ ఎడిషన్ బ్యాడ్జింగ్, బ్లాక్ టెయిల్ ల్యాంప్ ఇన్‌సర్ట్‌లతో పాటు ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లు ఎరుపు రంగులో ఉంటాయి. కారు S+ మోడల్ 16-అంగుళాలు, SX(O) మోడల్ 17-అంగుళాల డార్క్ ఫినిష్ అల్లాయ్‌లతో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ 1.5 పెట్రోల్, 1.5 డీజిల్ ఇంటీరియర్‌ ఆల్-బ్లాక్ థీమ్‌తో వస్తుంది. కొత్త క్రెటాకు సంబంధించిన ప్రధాన అప్‌డేట్‌లలో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, ESC, హిల్-స్టార్ట్ అసిస్ట్, ప్యాడిల్ షిఫ్టర్స్, మెటల్ పెడల్స్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ORVMలు, S+ ట్రిమ్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ప్రామాణికంగా ఉంటుంది. SX(O) ట్రిమ్‌లో గ్లోసీ బ్లాక్ సెంట్రల్ కన్సోల్ కూడా అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ వేరియంట్ iMT (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్)తో కూడా అందుబాటులో ఉంది.

కొత్త కారు లాంచింగ్ సందర్భంగా HMIL సేల్స్, మార్కెటింగ్, సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలో హ్యుందాయ్ 25 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ప్రతి సందర్భంలోనూ కస్టమర్లకు మంచి అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కొత్త క్రెటాతో హ్యుందాయ్.. SUV కోసం వెతుకుతున్న లక్షల మంది ఇండియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్త క్రెటా నైట్ ఎడిషన్ లాంచింగ్‌తో మరోసారి కస్టమర్లకు బోల్డ్, స్పోర్టీ డిజైన్ అప్‌డేట్స్‌ అందిస్తూ, వారి అవసరాలకు సరిపోయే SUVని అందుబాటులో ఉంచుతున్నాం’ అని చెప్పారు.

PM Modi: ఒకేసారి 5దేశాల అధినేతలతో మోదీ రౌండ్ టేబుల్ మీట్.. అందులో నలుగురు స్టార్ మహిళలే!


* హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు (ఎక్స్-షోరూమ్)

1.5 పెట్రోల్ మాన్యువల్ S+ వేరియంట్- రూ. 13.51 లక్షలు

1.5 పెట్రోల్ ఆటోమేటిక్ SX(O)- రూ. 17.22 లక్షలు

1.5 డీజిల్ మాన్యువల్ S+ - రూ. 14.47 లక్షలు

1.5 డీజిల్ ఆటోమేటిక్ SX(O)- రూ. 18.18 లక్షలు

హ్యుందాయ్ క్రెటా 1.5 పెట్రోల్ IMT S ధర రూ. 12.84 లక్షలు (ఎక్స్-షోరూమ్).

నైట్ ఎడిషన్ యాడ్ అయిన తర్వాత హ్యుందాయ్ క్రెటా ధర ఇప్పుడు రూ. 10.44 లక్షల నుంచి రూ. 18.18 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

First published:

Tags: Creta, Hmil, Hyundai, Motor Cycle

ఉత్తమ కథలు