Home /News /business /

HYUNDAI CRETA CREATED RECORD BY SELLING 1 21 LAKH UNITS IN ONE YEAR NS GH

Hyundai new Creta: లక్ష దాటిన కొత్త క్రెటా వాహనాల అమ్మకాలు.. పెరుగుతున్న హ్యుందాయ్ మార్కెట్ వాటా.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్‌కు ముందు మార్కెట్లోకి వచ్చిన కొత్త జెనరేషన్ క్రెటా భారీ అమ్మకాలు నమోదు చేసిందని హ్యుందాయ్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరోనా తరువాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ పుంజుకోవడానికి చాలా సమయం పట్టింది. లాక్‌డౌన్ తరువాత గత అక్టోబరు నుంచి వాహనాల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌కు ముందు మార్కెట్లోకి వచ్చిన కొత్త జెనరేషన్ క్రెటా భారీ అమ్మకాలు నమోదు చేసిందని హ్యుందాయ్ ప్రకటించింది. క్రెటా SUV-2020 మోడల్ మార్కెట్లోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఒక్క సంవత్సరంలోనే కొత్త క్రెటా అమ్మకాలు 1.21 లక్షలకు చేరుకోవడం విశేషం. హ్యుందాయ్ క్రెటాను మొదటిసారి 2015లో మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మన దేశంలో క్రెటా వాహనాల మొత్తం అమ్మకాలు 5.8 లక్షలకు చేరుకున్నాయి. వీటి ఎగుమతులు 2.16 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని హ్యుందాయ్ ప్రకటించింది.

కొత్త క్రెటా మోడల్.. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త బెంచ్ మార్క్‌ను సృష్టిస్తోందని హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్, సర్వీస్ విభాగం డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. మార్కెట్లో పోటీని తట్టుకుంటూ, ప్రతి నెలా మెరుగైన అమ్మకాలను నమోదు చేసిందన్నారు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు క్రెటాను తీర్చిదిద్దామని చెప్పారు. దీంట్లో ఉండే సరికొత్త ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయని వివరించారు. ఎక్కువమంది కస్టమర్లు ఇష్టపడే SUVగా క్రెటా నిలవడం గొప్ప విషయమని చెప్పారు. రానున్న రోజుల్లో కొత్త క్రెటా అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆ మోడళ్లకు ఆదరణ
హ్యుందాయ్ క్రెటా SUV మూడు ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. 7-స్పీడ్ DCTతో ఉండే 1.4-లీటర్ టర్బో పెట్రోల్; 1.5-లీటర్ పెట్రోల్; 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లతో క్రెటా లభిస్తుంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఒక IVT ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో లభిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం అమ్మకాల్లో డీజిల్ ఇంజిన్ క్రెటా యూనిట్ల వాటా 60 శాతంగా ఉందని హ్యుందాయ్ తెలిపింది. మరో 20 శాతం యూనిట్లు ఆటోమెటిక్ పవర్‌ట్రెయిన్ వేకిల్స్ విభాగానివని సంస్థ పేర్కొంది.

SUVల నుంచే మార్కెట్ వాటా
గత నాలుగేళ్లుగా కాంపాక్ట్, మిడ్ సైజ్ SUVలను ఎక్కువమంది వినియోగదారులు ఎంచుకుంటున్నారు. దీంతో తయారీ సంస్థలు కూడా కొత్తరకం SUVలపై దృష్టి పెట్టాయి. ఈ సెగ్మెంట్లో అనేక కొత్త మోడళ్లను కంపెనీలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కొత్త క్రెటాను విడుదల చేసింది. హ్యుందాయ్ కాంపాక్ట్ SUV వెన్యూ, మిడ్ సైజ్ ఎస్‌యూవీ క్రెటా నుంచే ఆ సంస్థకు మెరుగైన మార్కెట్‌ వాటా దక్కుతోంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAR, Cars, Hyundai

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు