HYUNDAI CAR SALES INCREASED IN DECEMBER 2020 CRETA RECORDED HIGHEST SALES NS GH
భారీగా పెరిగిన Hyundai కార్ల అమ్మకాలు... ఆ మోడల్ అమ్మకాల్లో 58 శాతం వృద్ధి
ప్రతీకాత్మక చిత్రం
Hyundai cars sales: కరోనా తరువాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాభాల బాట పట్టింది. 2020 డిసెంబర్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మొత్తం 47,400 యూనిట్లను అమ్మగలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా తరువాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ లాభాల బాట పట్టింది. 2020 డిసెంబర్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మొత్తం 47,400 యూనిట్లను అమ్మగలిగింది. 2019 డిసెంబర్ లో మెత్తం సేల్స్ 37,953 యూనిట్లుగా నమోదయ్యాయి. అంటే ఈయర్ ఆన్ ఈయర్ (YOY) సేల్స్ 25 శాతం పెరిగాయని హ్యుందాయ్ తెలిపింది. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోయిన హ్యుంద్యాయ్ బ్రాండ్‌గా వెన్యూ (Venue) మోడల్ నిలిచింది. 2019 డిసెంబర్లో 9,521 యూనిట్లుగా ఉన్న వెన్యూ సేల్స్, 2020 డిసెంబర్లో 12,313 యూనిట్లకు పెరిగాయి. YOY సేల్స్ మొత్తం 29 శాతం పెరిగి సంస్థ లాభాల వృద్ధిలో ఈ మోడల్ భాగమైంది. ఈ బ్రాండ్ నుంచి ఎక్కువ సేల్స్ నమోదైన రెండో మోడల్ క్రెటా(Creta). ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ అమ్మకాలు 2020 డిసెంబర్లో 10,592 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం సేల్స్ 6,713 యూనిట్లు మాత్రమే కావడం విశేషం. క్రెటా మోడల్ ఏకంగా 58 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది.
సేల్స్ వాల్యూమ్, అమ్మకాల వృద్ధి పరంగా క్రెటా ప్రథమ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ ఎస్యూవీ జోరు కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హ్యుందాయ్ బ్రాండ్‌లో గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios) 10,263 యూనిట్లతో అమ్మకాల్లో మూడవ స్థానంలో ఉంది. 2019 డిసెంబర్లో ఈ కారు మొత్తం సేల్స్ 7,598 యూనిట్లతో పోలిస్తే 35 శాతం వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ ఐ 20 (Hyundai i20) మూడు శాతం, హ్యుందాయ్ ఆరా (Aura) 3,113 యూనిట్లతో 173 శాతం అమ్మకాల వృద్ధితో తరువాతి స్థానంలో ఉన్నాయి. సాంత్రో (Santro), వెర్నా (Verna), టక్సన్ (Tucson) మోడళ్ల అమ్మకాలు మాత్రం 2019 డిసెంబరుతో పోలిస్తే భారీగా తగ్గినట్లు హ్యుందాయ్ వెల్లడించింది. థర్డ్ జెనరేషన్ హ్యుందాయ్ ఐ 20 కారును కొన్ని నెలల క్రితమే మార్కెట్లోకి విడుదల చేశారు. 2021లో ఈ మోడల్ సేల్స్ మెరుగుపడే అవకాశం ఉంది.
వాటి అమ్మకాలు తగ్గాయి
సాంత్రో (Santro) మోడల్‌ను 2018లో భారత మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ గత నెలలో మెరుగైన అమ్మకాలను నమోదు చేయలేకపోయింది. 2019 డిసెంబరులో మొత్తం 3,820 యూనిట్ల సాంత్రో కార్లు అమ్ముడయ్యాయి. కానీ 2020 డిసెంబరులో అమ్మకాలు 49 శాతం తగ్గి 1960 యూనిట్లకే పరిమితమయ్యాయి. వెర్నా (Verna) అమ్మకాలు కూడా 20 శాతం (1295 నుంచి 1,036 యూనిట్లకు) తగ్గాయి. 2020 డిసెంబరులో టక్సన్ (Tucson) మోడల్ యూనిట్లు 80 మాత్రమే అమ్ముడయ్యాయి. 2019 డిసెంబరులో ఈ సంఖ్య 92 యూనిట్లుగా ఉంది. కోనా ఎలక్ట్రిక్ (Kona Electric) కార్ల అమ్మకాలు 24 యూనిట్లుగా ఉన్నాయి. ఎలంట్రా (Elantra) ఫ్లాగ్షిప్ సెడాన్ కేవలం 15 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ కార్ల అమ్మకాల జాబితాలో చివరి స్థానంలో నిలిచింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.