ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) కార్లకు భారత్ (India)లో మంచి డిమాండ్ ఉంది. మార్కెట్‌లో తన వాటా మరింత పెంచుకునేందుకు పాపులర్ మోడల్స్‌ను అప్‌గ్రేడ్ ఫీచర్స్‌తో తిరిగి తీసుకొస్తుంది. ఈ జాబితాలో వెన్యూ, క్రెటా, అల్కాజర్ వంటి మోడల్స్ ఉన్నాయి. ఇటీవల కంపెనీ నుంచి లేటెస్ట్ అల్కాజర్ వెర్షన్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే 2023 హ్యుందాయ్ అల్కాజార్ (Hyundai Alcazar 2023) 1.5L టర్బో పెట్రోల్ వేరియంట్ల ధరలను కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ అప్‌గ్రేడ్ ఎస్‌యూవీ ధర రూ.16.75 లక్షల నుంచి రూ.20.25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మూడు వరుసల ఈ SUV 6-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్స్‌తో లభిస్తుంది.
* ధరల వివరాలు..
2023 హ్యుందాయ్ అల్కాజర్ 1.5L టర్బో పెట్రోల్ వేరియంట్లు మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తున్నాయి. ప్రెస్టేజ్, ప్లాటినం, ప్లాటినం (O), సిగ్నేచర్ (O) వంటి నాలుగు ట్రిమ్స్‌లో ఈ వెహికల్ అందుబాటులోకి వచ్చింది. వాటి ధరలు ఇలా ఉన్నాయి.
- అల్కాజర్ 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లో, 6MT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ప్రెస్టేజ్, ప్లాటినం ట్రిమ్స్ లభిస్తున్నాయి. ప్రెస్టేజ్ ట్రిమ్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.16,74,900 కాగా, ప్లాటినం వేరియంట్ ధర రూ.18,65,100గా కంపెనీ నిర్ణయించింది.
- 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లో 7DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ప్లాటినం (O), సిగ్నేచర్ (O) ట్రిమ్స్ లభిస్తున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.19,96,000, రూ.20,25,100గా ఉన్నాయి.
- అల్కాజర్ 6 సీటర్ కాన్ఫిగరేషన్‌లో 7DCT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ప్లాటినం (O), సిగ్నేచర్ (O) వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు వరుసగా రూ.19,96,000, రూ.20,25,100గా కంపెనీ నిర్ణయించింది.
ఇది కూడా చదవండి : ఇది టాటా వారి ఇ-బైక్... 100 కిలోమీటర్ల జర్నీకి రూ.10 మాత్రమే ఖర్చు
* అల్కాజర్1.5L పెట్రోల్ వెర్షన్ ప్రత్యేకతలు
హుందాయ్ అల్కాజర్1.5L టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో లాంచ్ అయింది. ALCAZAR లోగోతో న్యూ ఫ్రంట్ గ్రిల్ డిజైన్, రీ డిజైన్ పుడ్ల్ ల్యాంప్ అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ SUV అప్‌డేట్ వెర్షన్‌లో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా 6-ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. ఫేస్‌లిఫ్ట్ స్టాక్ ఫిట్‌మెంట్‌గా ఐడిల్ స్టాప్ & గో ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. స్టాప్ & గో స్పెసిఫికేషన్ అనేది వివిధ డ్రైవింగ్ మోడ్స్‌తో ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది.
* అప్‌గ్రేడ్ ఇంజన్ సామర్థ్యం వివరాలు
అల్కాజర్-2023 అప్‌గ్రేడ్ వెర్షన్ 1.5L టర్బో GDi పెట్రోల్ ఇంజన్‌తో వచ్చింది. రియల్ డ్రైవింగ్ ఉద్గారాల (RDE) నిబంధనలకు అనుగుణంగా కంపెనీ E20 ఫ్యూయల్ రెడీతో ఈ SUV ఇంజిన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇది 5,500 rpm వద్ద 157 bhp పవర్‌ను.. 1,500-3,000 rpm మధ్య అత్యధికంగా 253 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వరుసగా 18 kmpl, 17.5 kmpl మైలేజీని అందిస్తుంది. మరోవుపు, హ్యుందాయ్ అల్కాజర్‌లో RDE కంప్లైంట్ 1.5L CRDi డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది 4,000 rpm వద్ద 114 bhp, 1,500–2,750 rpm మధ్య 250 Nm పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.