Hyundai Alcazar: భారత మార్కెట్లోకి హ్యుందాయ్ అల్కాజర్.. ధర, ఫీచర్ల వివరాలివే!

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా హ్యుందాయ్ కంపెనీ నుంచి సరికొత్త ఎస్ యూవీ భారత విపణిలో లాంఛ్ అయ్యింది. అదే హ్యుండాయ్ అల్కాజార్. ఈ ఎస్ యూవీ ప్రారంభ ధరను రూ.16.30 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.

  • Share this:
ప్రముఖ ఆటో మొబైల్​ సంస్థ హ్యుండాయ్ భారత మార్కెట్లో అత్యుత్తమ వాహనాలను విడుదల చేస్తూ మంచి విక్రయాలు అందుకుంటోంది. తాజాగా ఈ కంపెనీ నుంచి సరికొత్త ఎస్ యూవీ భారత విపణిలో లాంచ్ అయింది. అదే హ్యుండాయ్ అల్కాజార్.ఈ ఎస్ యూవీ ప్రారంభ ధరను రూ.16.30 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. 6,7 సీటింగ్ కలిగిన వేరియంట్లను కూడా హ్యుండాయ్​ లాంచ్​ చేసింది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ వాహనం అందుబాటులోకి వచ్చింది. ప్రెస్టిజ్, ప్లాటినం, సిగ్నేచర్ వేరియంట్లలో ఇది లభ్యమవుతుంది. ఇక, హ్యుండాయ్ డీజిల్ యూనిట్రూ.16.53 లక్షల వద్ద లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్​ డీజిల్​ కంటేరూ.23 వేలు ఎక్కువ ధర ఉంటుంది.ఈ ఎస్​యూవీరూ.19.99 లక్షల గరిష్ఠ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. హ్యుండాయ్ అల్కాజర్ ఎస్ యూవీ మ్యానువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలోలభ్యమవుతుంది. 7-సీటింగ్ సామర్థ్యం కేవలం ప్రెస్టిజ్, ప్లాటినం వేరియంట్లలోనే లభ్యమవుతుంది. టాప్ స్పెక్ సిగ్నేచర్ వేరియంట్లో ఆరుగురు మాత్రమే కూర్చోగలరు. 150 ఎంఎం పొడవైన వీల్ బేస్ ను కలిగి ఉంది. అంతేకాకుండా 6- సింగిల్ టోన్ ఎక్సటీరియ్ కలర్ ఆప్షన్లతో పాటు రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లను ఇందులో ఉన్నాయి.
Tecno Smartphone: భారత్‌లోకి టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర కేవలం రూ.7,999 మాత్రమే.. వివరాలివే


ప్రత్యేకతలు..
ఈ కారు డిజైన్ హ్యుండాయ్ క్రెటా మోడల్ ను పోలి ఉంది. డ్యాష్ బోర్డు కూడా దీని మాదిరిగానే ఉంది. కాగ్నేక్ బ్రౌన్, బ్లాక్ కలర్ స్కీమ్ తో పాటు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇంటిగ్రేషన్, కనెక్టెడ్ కార్ టెక్, 360 డిగ్రీల కెమెరా, వాయిస్ ఆపరేటెడ్ పానోరామిక్ సన్ రూఫ్, ముందు, రెండో వరసలో కూర్చునే వారికి వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.


ఇంజిన్..
హ్యుండాయ్ అల్కాజర్ క్రెటా రెండో జనరేషన్ మోడల్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త ఎస్ యూవీ 2.0-లీటర్ పెట్రోల్ యూనిట్ నాలుగు సిలీండర్ల ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 159 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 192 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే 115 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్, డీజిల్ రెండు ఇంజిన్ వేరియంట్లు 6-స్పీడ్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.

పెట్రోల్ మ్యానువల్ అవతార్ అయితే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9.5 సెకండ్లలోనే అందుకుంటుంది. అంతేకాకుండా కంఫర్ట్, ఎకో, స్పోర్ట్ మూడు రైడింగ్ మోడ్స్ లో ప్రయాణిస్తుంది. వీటితో పాటు సాండ్, స్నో, మడ్ అనే ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. భారత మార్కెట్లో హ్యుండాయ్ అల్కాజర్ ఎస్ యూవీకిటాటా సఫారీ, ఎంజీ హెక్టార్ ప్లస్, మహీంద్రా ఎస్ యూవీ500 లాంటి కార్లు గట్టి పోటీనివ్వనున్నాయి.
Published by:Nikhil Kumar S
First published: