HyperFighter Colossus: ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు గంటలో హైదరాబాద్ నుంచి బెజవాడ వెళ్లిపోవచ్చు...సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్...
Hyperfighter Colossus Electric Sports Bike
HyperFighter Colossus మంచి స్పోర్ట్స్ లుక్ కలిగి ఉంది. దీని వేగం కూడా ఏ స్పోర్ట్స్ బైక్‌కు కూడా తక్కువేమీ కాదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం 273 kmph, ఈ వేగంతో ఖచ్చితంగా పెట్రోల్ బైకులను ఓడించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
HyperFighter Colossus: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీంతో వాహన సంస్థలు కూడా కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్‌లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో కొన్ని లోపాలు ఉండటంతో ఇప్పటికీ వాహనదారులు పెట్రోల్ బైక్‌లను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలుదారులను పెద్దగా ఆకట్టుకోలేదు. కారణం ఎలక్ట్రిక్ బైక్‌లో ఉపయోగించే బ్యాటరీ కూడా కారణం చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో స్పోర్ట్స్ రేంజులో స్పీడుగా పోవడం చాలా కష్టం అనే అపోహ ఉంది. నిజానికి డిజైన్ పరంగా ఏ స్పోర్ట్స్ బైక్, క్రూజర్ బైక్‌ల కంటే ఎలక్ట్రిక్ బైక్స్ తక్కువేం కాదు. అయితే ఇటీవల లాస్ వెగాస్‌లో నడుస్తున్న CES 2022 ఆటో షోలో ప్రవేశపెట్టిన ఒక ఎలక్ట్రిక్ బైక్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. CESలో, కెనడియన్ స్టార్టప్ డెమోన్ మోటార్స్ హైపర్‌ఫైటర్ కొలోసస్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్‌ను పరిచయం చేసింది.
ఈ బైక్ పై గంటకు 273 కిలోమీటర్ల వేగంతో పోవచ్చు...
HyperFighter Colossus మంచి స్పోర్ట్స్ లుక్ కలిగి ఉంది. దీని వేగం కూడా ఏ స్పోర్ట్స్ బైక్‌కు కూడా తక్కువేమీ కాదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం 273 kmph, ఈ వేగంతో ఖచ్చితంగా పెట్రోల్ బైకులను ఓడించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ లో 20 kWh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 235 కిమీల మైలేజీని ఇస్తుంది. 200 హెచ్‌పి పవర్ కెపాసిటీ ఉన్న ఈ బైక్ 100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి కేవలం మూడు సెకన్లు మాత్రమే పడుతుంది.
HyperFighter Colossus ప్రమాదకర రహదారులపై నడపడానికి 360-డిగ్రీల అధునాతన అలారం వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచారు. ఇది కాకుండా, ఈ బైక్‌లో అనేక రాడార్లు, సెన్సార్లు , కెమెరాలు ఉన్నాయి. ఈ బైక్‌ను తయారు చేసిన కంపెనీకి చెందిన ప్రతినిధి మాట్లాడుతూ, అద్భుతమైన, సాంకేతిక సదుపాయాలతో ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసామని తెలిపారు.
ధర ఎంత?
ఈ బైక్ ధర విషయానికి వస్తే, దీని ధర 35,000 డాలర్లు అంటే దాదాపు 26 లక్షల రూపాయలు. అమెరికాలోని కొనుగోలుదారుల కోసం దీని బుకింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ బైక్ కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా లేని వారికి శుభవార్త. కంపెనీ హైపర్ఫైటర్లోని మరో రెండు బడ్జెట్ మోడళ్లను కూడా విడుదల చేయనుంది. ఇవి ప్రస్తుత బైక్ కంటే చౌకగా ఉంటాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.