World Cup Offer: ఏడాదంతా ప్యారడైజ్ బిర్యానీ ఫ్రీ... కండీషన్స్ అప్లై

Paradise Restaurant World Cup 2019 offer | ఈ కాంటెస్ట్‌లో గెలిచినవారికి ఉచితంగా ఏడాదిపాటు బిర్యానీ ఆఫర్ చేస్తోంది. జూన్ 7న ప్రారంభమైన కాంటెస్ట్ జూలై 18న ముగుస్తుంది.

news18-telugu
Updated: June 7, 2019, 6:06 PM IST
World Cup Offer: ఏడాదంతా ప్యారడైజ్ బిర్యానీ ఫ్రీ... కండీషన్స్ అప్లై
World Cup Offer: ఏడాదంతా ప్యారడైజ్ బిర్యానీ ఫ్రీ... కండీషన్స్ అప్లై (image: Paradise)
  • Share this:
ఇండియా మ్యాచ్‌లు మొదలవడంతో క్రికెట్ వరల్డ్ కప్‌ ఊపందుకుంది. మొదటి మ్యాచ్‌లోనే భారత టీమ్ సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించడంతో ఇక తర్వాతి మ్యాచ్‌లపై ఆసక్తి నెలకొంది. వరల్డ్ కప్‌ సీజన్ జోరుగా సాగుతుండటంతో క్యాష్ చేసుకుంటున్నాయి వివిధ కంపెనీలు, సంస్థలు. ఆ లిస్ట్‌లోకి హైదరాబాదీ బిర్యానీకి ఫేమస్ అయిన ప్యారడైజ్ రెస్టారెంట్ కూడా చేరిపోయింది. #WorldCupWithParadise పేరుతో క్యాంపైన్ ప్రారంభించింది. ఈ కాంటెస్ట్‌లో గెలిచినవారికి ఉచితంగా ఏడాదిపాటు బిర్యానీ ఆఫర్ చేస్తోంది. జూన్ 7న ప్రారంభమైన కాంటెస్ట్ జూలై 18న ముగుస్తుంది. మరి ఈ కాంటెస్ట్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలో తెలుసుకోండి.


ప్యారడైజ్ క్రికెట్ వరల్డ్ కప్ కాంటెస్ట్ వివరాలివే...


ముందుగా మీరు ఏదైనా ప్యారడైజ్ ఔట్‌లెట్‌కు వెళ్లాలి.
అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫోటో దిగాలి.
ప్యారడైజ్ ఆతిథ్యంపై మీ అనుభవాన్ని రాయాలి.
డిస్క్రిప్షన్‌లో #WorldCupWithParadise హ్యాష్‌ట్యాగ్ తప్పనిసరి.ఆ ఫోటోను ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి @ParadiseFoodCourt ఐడీకి ట్యాగ్ చేయాలి.
ఆ పోస్ట్‌ను మీరు షేర్ చేయాలి.
ప్రతీ వారం ఒక విజేతను ఎంపిక చేస్తారు.
ఫోటో బాగా తీయడంతో పాటు ఎవరైతే బాగా డిస్క్రిప్షన్ రాస్తారో వారికి విజయావకాశాలు ఎక్కువ.
గెలిచినవారికి ఏడాదంతా ఉచితంగా బిర్యానీ ఇవ్వనుంది ప్యారడైజ్.
ప్యారడైజ్ మేనేజ్‌మెంట్ విచక్షణ ఆధారంగా విజేతల్ని ఎంపిక చేస్తారు.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Cricket Score: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై లైవ్ క్రికెట్ స్కోర్... గూగుల్ స్పెషల్ ఫీచర్ ఇలా వాడుకోండి

క్రికెట్ వరల్డ్ కప్ స్పెషల్... షావోమీ నుంచి కొత్త పవర్ బ్యాంక్

Reliance Jio: జియో యూజర్లకు హాట్‌స్టార్ యాక్సెస్ ఫ్రీ... క్రికెట్ మ్యాచ్‌లు చూడండి ఇలా
First published: June 7, 2019, 6:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading