హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyderabad Traffic Police: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ దారిమళ్లింపు.. వివరాలివే

Hyderabad Traffic Police: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ దారిమళ్లింపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ట్రాఫిక్ దారిమళ్లింపుపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  రేపు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) కీలక ప్రకటన చేశారు. బక్రీద్ ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా ఈ నెల 10న అంటే రేపు ఉదయం 8.00 నుంచి 11.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లించనున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మాసాబ్ ట్యాంక్, హాకీ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ మళ్లించబడడుతుందని తిపారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ నిర్వహణ కోసం మాసాబ్ ట్యాంక్ పరిసరాల్లో రోడ్లు మూసివేయబడ్డాయని వెల్లడించారు. మెహిదీపట్నం నుంచి మాసాబ్ ట్యాంక్ మీదుగా రోడ్ నెం.1, బంజారాహిల్స్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ ఫ్లైఓవర్ మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్ (ఎడమ మలుపు) ఖైరతాబాద్, RTA కార్యాలయం, ఖైరతాబాద్ (ఎడమ మలుపు) తాజ్ కృష్ణ హోటల్ మీదుగా మళ్లించబడుతుందని (Traffic Diversion in Hyderabad) ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా..

  1. లక్డీకపూల్ నుంచి మాసాబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాల రద్దీ మరియు బంజారాహిల్స్ మీదుగా రోడ్ నెం.1/12 బంజారాహిల్స్ కు వెళ్లే వాహనాలను మాసాబ్ ట్యాంక్ అయోధ్య జంక్షన్ వద్ద నుంచి ఖైరతాబాద్ RTA కార్యాలయం (ఎడమ మలుపు) తాజ్ కృష్ణ హోటల్ వైపు మళ్లించబడుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రార్థనలు పూర్తయ్యే వరకు మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ దిగువ నుండి రోడ్ నెం.1, బంజారాహిల్స్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

  2. NFCL/ బంజారాహిల్స్ నుండి వచ్చే వాహనాల ట్రాఫిక్ ను మాసాబ్ ట్యాంక్ వైపు అనుమతించమని తెలిపారు పోలీసులు. మరియు RTA కార్యాలయం| ఖైరతాబాద్, నిరంకారి, లక్షీకపూల్, మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్, మెహదీపట్నం వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తారు.

  Cancellation of Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడతో పాటు ఆ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు రద్దు.. ఈ నెల 20 వరకు..


  పైన పేర్కొన్న ట్రాఫిక్ సలహాలను గమనించి, పైన పేర్కొన్న రూట్లు మరియు సమయాల్లో తదనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని పౌరులను పోలీసులు కోరారు. ప్రజలు ఏదైనా ప్రయాణ సమాచారం లేదా సహాయం కోసం దయచేసి 040-278524821 9010203626 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Hyderabad Traffic Police, Traffic police

  ఉత్తమ కథలు