Railways | మీరు మెట్రోలో ఎక్కువగా జర్నీ చేస్తుంటారా? అయితే మీకు హైదరాబాద్ మెట్రో తీపికబురు అందించింది. ఐదో వార్షికోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ తాజాగా లాయల్టీ బోనస్‌ను (Bonus) ప్రకటించింది. లాయల్టీ కస్టమర్లకు ఈ బెనిఫిట్ అందుబాటులో ఉండనుంది. అధికారులు ఈ మేరకు ఎంపిక చేసిన స్మార్ట్ కార్డ్ ఐడీల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు. రెగ్యులర్ మెట్రో ప్రయాణికులు ఈ ఐడీ కార్డుల వివరాలను చేసుకోవచ్చు. వారి కార్డు వివరాలను వీటితో మ్యాచ్ అయితే వారికి లాయల్టీ బోనస్ బెనిఫిట్ లభిస్తుంది.
మీ ఐడీ ఎంపిక చేసిన నెంబర్లలో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఐడీ నెంబర్ ఎంపిక చేసిన స్మార్ట్ కార్డు ఐడీల లిస్ట్‌లో ఉంటే.. వెంటనే మీ వివరాలను 040 23332555 నెంబర్‌కు కాల్ చేసి చెప్పొచ్చు. లేదంటే వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 7995999533 అనేది వాట్సాప్ నెంబర్. ఈ వివరాలను హైదరాబాద్ మెట్రో రైల్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
100 ఏళ్లు పూర్తి చేసుకున్న బ్యాంక్.. కస్టమర్లకు అదిరే గిఫ్ట్!
మీ వివరాలను పంపడానికి గడువు ఉంది. నవంబర్ 28 మధ్యాహ్నం 1 గంట కల్లా మీ వివరాలను కాల్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు లాయల్టీ బోనస్ బెనిఫిట్‌ను కోల్పోవలసి ఉంటుంది. అందువల్ల మీరు రెగ్యులర్‌గా మెట్రోలో జర్నీచేస్తూ ఉంటే.. స్మార్ట్ కార్డు ఐడీ నెంబర్లను చెక్ చేసుకోండి.
కస్టమర్లకు అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఆ సర్వీసులు నిలిపివేస్తున్న ప్రముఖ బ్యాంక్!
Hola Folks!! Here's a little something for all our loyal customers on the occasion of our #5thAnniversary. Check if your IDs match with the selected ones and send us your details on the below mentioned numbers. Call us on 040-23332555, WhatsApp on 7995999533 #MeekosamMeeMetro pic.twitter.com/jpGoT4PGPh
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 24, 2022
హైదరాబాద్ మెట్రో రైల్ లాయల్టీ బోనస్ కోసం ఎంపిక చేసిన ఐడీల వివరాలు ఇలా.. 10100003890119, 101000010715659, 10100001417850, 10100004374980, 10100000006433, 10100001930276, 10100002449022, 101000011214385, 10100002975875. మీ ఐడీ నెంబర్ ఇందులో ఉంటే.. మీకు లాయల్టీ బోనస్ వచ్చినట్లే. వెంటనే మీ వివరాలను కాల్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులకు తెలియజేయండి. ఈ బంపర్ ఆఫర్‌ను మిస్ చేసుకోవద్దు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Hyderabad Metro, Hyderabad Metro rail, Metro, Metro Train