Home /News /business /

HYDERABAD JEWELLER SETS GUINNESS RECORD BY EMBEDDING 7801 DIAMONDS IN ONE RING SS

Diamond Ring: ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్... హైదరాబాదీ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్

Diamond Ring: ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్... హైదరాబాదీ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్
(image: Guinness World Record)

Diamond Ring: ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్... హైదరాబాదీ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ (image: Guinness World Record)

Diamond Ring | గిన్నీస్ వాల్డ్ రికార్డ్స్‌లో మరో హైదరాబాదీ పేరు చేరిపోయింది. ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్ పొదిగి రికార్డ్ సృష్టించారు హైదరాబాదీ నగల వ్యాపారి.

    ఒక్క ఉంగరంలో ఎన్ని డైమండ్స్ ఉంటాయి? ఓ 100 వరకు ఉండొచ్చు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. ఏకంగా ఒక్క ఉంగరంలో 7,801 డైమండ్స్ పొదగడం విశేషం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్... 'ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం' పేరుతో ఈ ఉంగరాన్ని తయారు చేశారు. అరుదైన పుష్పం బ్రహ్మ కమలాన్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన ఈ డైమండ్ రింగ్‌ను గత నెలలోనే ఆవిష్కరించారు. గత ఏడాది గిన్నీస్ వాల్డ్ రికార్డ్ కోసం ఈ ఉంగరాన్ని సబ్మిట్ చేశారు. అనేక రౌండ్లు వెరిఫికేషన్ ప్రక్రియ జరిపారు. ఒక రింగులో ఎక్కువ డైమండ్స్ పొదిగిన గిన్నీస్ రికార్డ్ ఈ ఉంగరానికి దక్కింది. ఈ ఉంగరానికి సంబంధించిన వీడియోను గిన్నీస్ వాల్డ్ రికార్డ్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ ఉంగరం తయారీకి పడ్డ శ్రమ ఎంతో ఆ వీడియోలో తెలుస్తుంది. ఆ వీడియో ఇదే.

    గిన్నీస్ వాల్డ్ రికార్డ్స్ సొంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్. ఇలాంటి యూనిక్ పీస్ తయారుచేయాలన్న తన అభిరుచిని గుర్తించారని అన్నారు. మొదట ఈ ఉంగరాన్ని తయారు చేయాలన్న కాన్సెప్ట్‌ను 2018 సెప్టెంబర్‌లో రూపొందించారు. అప్పుడు అది కేవలం పెన్సిల్ డ్రాయింగ్ మాత్రమే. కేవలం ప్లానింగ్‌కే 45 రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత ఉంగరం తయారు చేసే పని మొదలుపెట్టారు. 2019 మార్చి నాటికి రింగ్ బేస్ తయారైంది. 2019 ఆగస్ట్ నాటికి రింగ్ తయారైంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ పని మొదలైంది. ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు 11 నెలల సమయం పట్టింది. ఈ ఉంగరం ఆరు లేయర్స్‌తో ఉంటుంది. ప్రతీ లేయర్‌లో 8 రేకులు ఉంటాయి. మొత్తం ఉంగరంలో 7801 వజ్రాలున్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: BUSINESS NEWS, Gold, Gold jewellery, Gold ornmanets, Gold rate hyderabad, Gold rates, Gold shops, Guinness World Record, Personal Finance, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు