హోమ్ /వార్తలు /బిజినెస్ /

Hyderabad Real Estate: హైదరాబాద్ లో ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్..

Hyderabad Real Estate: హైదరాబాద్ లో ఇళ్లు కొనాలనుకుంటున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: ఇళ్ల ధరల విషయంలో హైదరాబాద్ మహానగరం సంచలనం సృష్టిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తో దేశ వ్యాప్తంగా అన్ని ప్రముఖ నగరాల్లో ఇళ్ల ధరలు తగ్గినా హైదరాబాద్ లో మాత్రం పెరిగాయి. తాజాగా వెల్లడైన నివేదని ఈ షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆ వివరాలివే..

ఇంకా చదవండి ...

తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన అనేక మంది ఉపాధి నిమిత్తం హైదరాబాద్ మహానగర ఒడికే చేరుకుంటారు. ఏదో ఓ ఉద్యోగం, వృత్తిలో స్థిర పడిన అనంతరం ఇక్కడ సొంతిళ్లు ఉండాలనుకుంటున్నారు. అయితే రాను రాను ఈ మహానగరంలో ఇళ్ల ధరలు ఆకాశానికి చేరుకుంటున్నాయి. దీంతో ఇక్కడ సామాన్యులు ఇళ్లు కొనే పరిస్థితి లేకుండా పోతోంది. ప్రస్తుతం ఈ కరోనా సమయంలో ఇళ్ల ధరలు పడిపోతాయని అనేక మంది భావించారు. అయితే అనేక ప్రధాన నగరాల్లోనూ ఈ అంచనా నిజమైనా.. హైదరాబాద్ లో పరిస్థితి ఏ మాత్రం మారలేదు. ఇక్క ఇళ్ల ధరలు ఇంకా పెరిగాయి. గతేడాది చివరి త్రైమాసికంలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇళ్ల ధరలు పెరిగినట్లు రియల్‌ ఎస్టేట్‌ సేవల సంస్థ అయిన నైట్‌ఫ్రాంక్‌ విడుదల తెలిపింది. ఆ సంస్థ విడుదల చేసిన ‘గ్లోబల్‌ రెసిడెన్షియల్‌ సిటీస్‌ ఇండెక్స్‌- క్యూ4, 2020’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. పక్క రాష్ట్రం కర్ణాటకలోని బెంగళూరులో ఇళ్ల ధరలు 0.8 శాతం తగ్గడం విశేషం. అహ్మదాబాద్‌లో 3.1 శాతం, ముంబైలో 3.2 శాతం, ఢిల్లీలో 3.9 శాతం, కోల్‌కత్తాలో 4.3 శాతం, పుణేలో 5.3 శాతం ఇళ్ల ధరలు తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.

అదే హైదరాబాద్ లో మాత్రం ఇళ్ల ధరలు 0.20 శాతం పెరిగాయని సంస్థ తెలిపింది. అయితే చెన్నై నగరంలో మాత్రం ఇళ్ల ధరలు విపరీతంగా పడిపోయాయి. అక్కడ ఇళ్ల ధరలు 9 శాతం మేర తగ్గినట్లు నెట్ ఫ్రాంక్ తెలిపింది. స్థిరాస్థి రంగంలో హైదరాబాద్‌ ప్రపంచ వ్యాప్తంగా మంచి స్థానంలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ 122 స్థానం దక్కించుకుంది. బెంగళూరుకు 129 స్థానం, అహ్మదాబాద్‌ 143, ముంబై 144, ఢిల్లీ 146, కోల్‌కతా 147, పుణే 148 స్థానాలను దక్కించుకున్నాయి. చైన్నై మాత్రం 150 ర్యాంకుతో చివరి స్థానంలో ఉంది.

కరోనా ఎఫెక్ట్ ఉన్నా హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు స్ధిరంగా ఉన్నాయని నైట్‌ఫ్రాంక్‌ సీఎండీ శిశిర్‌ బజాజ్‌ అన్నారు. వివిధ కంపెనీలు హైదరాబాద్ లో విస్తరిస్తున్న కారణంగా అనేక మంది ఇక్కడ స్థిరపడడం ఇందుకు కారణమన్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు లక్షల సంఖ్యలో ఇక్కడ స్థిరపడడం హైదరాబాద్ లో ఇళ్ల ధరల పెరుగుదలకు ముఖ్య కారణమని చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అంకారా (టర్కీ) రియల్‌ ఎస్టేట్‌ రంగంలో టాప్ స్థానంలో ఉంది. ఇక్కడ ఇళ్ల ధరలు రేట్ల పెరుగుదల ప్రతీ ఏడాది రూ. 30.2 శాతంగా ఉన్నట్లు నైట్‌ఫ్రాంక్‌ నివేదిక వెల్లడించింది. 29.4 శాతం పెరుగుదలతో టర్కీలోని ఇజ్మిర్‌ నగరం రెండో స్థానంలో, ఇస్తాన్‌ బుల్‌లో మూడో స్థానంలో ఉన్నాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది.

First published:

Tags: GHMC, Hyderabad, Real estate, Real estate in Hyderabad, Telangana

ఉత్తమ కథలు