రేపు అంటే ఈ నెల 3న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో, భారతీయ జనతా పార్టీ (BJP) బహిరంగ సభకు సంబంధించి
ట్రాఫిక్ మళ్లింపులు (Traffic Diversion) మరియు పార్కింగ్ ఏర్పాట్లపై
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ కీలక ప్రకటన చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు మరియు పార్కింగ్ ఏర్పాట్లు అమలు చేయబడతాయని తెలిపారు. HICC మాదాపూర్ - జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ - రాజ్ భవన్ - పంజాగుట్ట - బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ - పరేడ్ గ్రౌండ్ మరియు పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్లలో ప్రయాణించడం మానుకోవాలని వాహనదారులకు, ప్రజలకు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Police Commissioner) సూచించారు. అలాగే టివోలి X రోడ్ నుంచి ప్లాజా X రోడ్ మధ్య రహదారి మూసివేయబడుతుందని తెలిపారు. ఈ క్రింది జంక్షన్‌లలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు సీవీ ఆనంద్.
అవి.. 1) చిలకలగూడ X రోడ్, 2) అలుగడ్డబాయి X రోడ్, (3) సంగీత్ X రోడ్, (4) YMCA X రోడ్, (5) ప్యాట్నీ X రోడ్, (6) SBH X రోడ్, (7) ప్లాజా, ( 8 ) CTO జంక్షన్, (9) బ్రూక్‌బాండ్ జంక్షన్, (10) టివోలి జంక్షన్, (11) స్వీకార్‌ఉప్‌కార్ జంక్షన్, (12) సికింద్రాబాద్ క్లబ్, (13) తిరుమలగిరి x రోడ్, (14) తాడ్‌బండ్ x రోడ్ (15) సెంటర్ పాయింట్, (16) డైమండ్ పాయింట్ (17) బోయినపల్లి X రోడ్, (18) రసూల్‌పురా, బేగంపేట్ (19) ప్యారడైజ్. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య MG రోడ్, RP రోడ్ మరియు SD రోడ్‌ల వైపు వెళ్లకపోవడం మంచిదని.. ఆ మార్గాలను వెపు ప్రయాణాలను నివారించుకోవాలని ప్రజలను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.
Hyderabad: ప్రధాని మోదీ రాకవేళ హైదరాబాద్‌లో దొంగల ముఠా సంచారం.. టీఆర్ఎస్ వినూత్న ప్రచారం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం రైళ్లలో ప్రయాణించాలనుకునే సాధారణ ప్రయాణీకులు సకాలంలో రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని సూచించారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునేటప్పుడు ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. కాబట్టి ప్రజలు చిలకలగూడ వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్లాట్‌ఫారమ్ నం.10 నుంచి చేరుకోవాలని సూచించారు పోలీసులు.
CM KCR: మోదీ రాక.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు సీఎం కేసీఆర్.. కానీ ప్రధాని కోసం కాదు
సాధారణ ప్రజల కోసం ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు / నుంచి (రైల్వే ప్రయాణీకుల కోసం):
a) పంజాగుట్ట నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు పంజాగుట్ట - VV విగ్రహం - IMAX రోటరీ - తెలుగు తల్లి ఫ్లైఓవర్ - లోయర్ ట్యాంక్ బండ్ - RTC X రోడ్ - ముషీరాబాద్ X రోడ్ - గాంధీ హాస్పిటల్ - సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు తిరిగి అదే మార్గం గుండా వెళ్లండి.
b) ఉప్పల్ - తార్నాక - ఆలుగడ్డబావి - చిల్కలగూడ ఎక్స్ రోడ్ - సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరియు తిరిగి అదే మార్గం గుండా వెళ్లండి.
C) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ / ప్యారడైజ్ జంక్షన్ - బేగంపేట - పంజాగుట్ట వరకు రద్దీగా ఉండే రహదారిని ఉపయోగించవద్దని సూచించారు.
2. కరీంనగర్ హైవే (రాజీవ్ రహదారి) నుంచి అటూ ఇటూ.. ORR షామీర్‌పేట్ ORR గేట్ (7) లో ప్రవేశించి నిష్క్రమించడానికి ఔటర్ రింగ్ రోడ్ (ORR)ని ఉపయోగించండి:
a) మీరు సిటీ సెంటర్ (అమీర్‌పేట్) వైపు వెళ్లాలనుకుంటే, మేడ్చల్ ORR గేట్ (6) –కొంపల్లి- సుచిత్ర - బాలానగర్ - బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఫ్లైఓవర్ - అమీర్‌పేట్.
b) మీరు ఉప్పల్ వైపు వెళ్లాలనుకుంటే, కీసర ORR గేట్ ( 8 ) – కుషాయిగూడ – ECIL – మౌలాఅలీ – నాచారం – ఉప్పల్.
c) కరీంనగర్ నుంచి వచ్చే ప్రజలు తిరుమలగిరి X రోడ్ - ఎడమ మలుపు ఎఎస్ రావు నగర్ - ECIL - మౌలా అలీ - తార్నాక నుంచి నగరంలోకి ప్రవేశించవచ్చు.
d) కరీంనగర్‌కు వెళ్లడానికి లేదా కరీంనగర్ నుండి తిరిగి రావడానికి తిరుమలగిరి X రోడ్ – JBS మార్గాన్ని నివారించండి, బదులుగా గచ్చిబౌలి/పటాన్‌చెరువు/మేడ్చల్/కీసర/ఘట్‌కేసర్ నుండి ORRని ఉపయోగించండి.
3. ఉప్పల్ నుండి పంజాగుట్ట వైపు:
a) ఉప్పల్ నుండి రామంతపూర్ - అంబర్‌పేట్ - హిమాయత్‌నగర్ - వివి విగ్రహం -పంజాగుట్ట రహదారిని ఉపయోగించండి.
b) ఉప్పల్ - తార్నాక - రైలు నిలయం మార్గంలో రద్దీగా ఉండే రహదారిని ఉపయోగించవద్దు.
4. తార్నాక/మెట్టుగూడ నుంచి పంజాగుట్ట/అమీర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సంగీత్ Xరోడ్డు వద్ద చిలకలగూడ- ముషీరాబాద్–కవాడిగూడ-లోయర్ ట్యాంక్ బండ్-ఇక్బాల్ మినార్-లక్డీకాపూల్ వైపు పంజాగుట్ట/అమీర్‌పేట్ వైపు మళ్లిస్తారు.
5. పంజాగుట్ట/అమీర్‌పేట వైపు నుంచి తార్నాక/ఉప్పల్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్ - నిరంకారి - పాత PS సైఫాబాద్ - ఇక్బాల్ మినార్ - తెలుగు తల్లి ఫ్లై ఓవర్ - లోయర్ ట్యాంక్‌బండ్ - కవాడిగూడ - ముషీరాబాద్ - చిల్కలగూడ రోటరీ - మెట్టుగూడ వైపు మళ్లిస్తారు.
6. మేడ్చల్/బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బోయినపల్లి X రోడ్డు వద్ద డెయిరీ ఫామ్ రోడ్డు-హోలీ ఫ్యామిలీ చర్చి–తిరుమలగిరి– RK పురం-నేరెడ్‌మెట్–మల్కాజిగిరి-మెట్టుగూడ నుంచి సికింద్రాబాద్ వైపు మళ్లిస్తారు.
7. కార్ఖానా/తిరుమల్‌గిరి నుంచి SBH/ప్యాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తిరుమలగిరి X రోడ్డువద్ద ఆర్‌కే పురం- నేరెడ్‌మెట్–మల్కాజిగిరి-మెట్టుగూడ నుండి సికింద్రాబాద్ వైపు మళ్లిస్తారు.
భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు వచ్చే ప్రజలు పార్కింగ్ స్థలాల కోసం అనుబంధాన్ని మరియు మ్యాప్‌ను పరిశీలించగలరు.
పైన పేర్కొన్న విధంగా, 03-07-2022న మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు BJP బహిరంగ సభ కారణంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌కి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని రోడ్లు/జంక్షన్‌లు విపరీతంగా రద్దీగా ఉంటాయని పోలీసులు తెలిపారు. అందువల్ల ప్రయాణికులందరూ తమ ప్రయాణాన్నిముందుగా లేదా పైన సూచించిన విధంగా ప్లాన్ చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.