HYDERABAD BASED ELECTRIC TWO WHEELER COMPANY PURE HAS LAUNCHED THE PLUTO 7G ELECTRIC SCOOTER AT A LOWER PRICE THAN OTHER E SCOOTERS AVAILABLE IN THE MARKET PRV GH
PURE EPluto 7G: హైదరాబాద్ స్టార్టప్ ప్యూర్ నుంచి ప్లూటో 7జి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..
ఈ స్కూటర్
హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ ప్యూర్ ఈ ప్లూటో 7G ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లో లభిస్తున్న ఇతర ఈ–స్కూటర్ల కంటే తక్కువ ధరలోనే దీన్ని రిలీజ్ చేయడం విశేషం.
ఓ వైపు ఆకాశాన్నంటుతున్నపెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు, వాయి కాలుష్యంతో ఇప్పుడు వాహనదారుల చూపు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (Electric vehicles)పై పడింది. దీంతో, భారత మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలతో పాటు కొత్త స్టార్టప్ సంస్థలు సైతం ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ ప్యూర్ ఈ ప్లూటో 7G (PURE EPluto 7G) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లో లభిస్తున్న ఇతర ఈ–స్కూటర్ల కంటే తక్కువ ధరలోనే దీన్ని రిలీజ్ చేయడం విశేషం. దీనిలోని మోటార్ 2200W పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 120 కిలో మీటర్ల ప్రయాణ పరిధిని అందిస్తుంది. ఇక డిజైన్ పరంగా చూస్తే ఇది అచ్చం వెస్పా స్కూటర్ (Vespa scooter)ను పోలి ఉంటుంది. మరోవైపు దీని లుక్ పాత బజాజ్ చేతక్ మోడల్‌ను గుర్తుకు తెస్తుంది. వెస్పా నోట్ 125లో ఉన్న విధంగా దీని టెయిల్ లైట్ గుండ్రంగా సన్నని బాడీతో వస్తుంది. మరోవైపు దీనిలో వృత్తాకార ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ (LED Head Lamp), క్రోమ్-ఫినిష్డ్ మిర్రర్లను కూడా అందించింది.
5 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగం …
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నూతన సాంకేతికతకు తగ్గ విధంగా అనేక కొత్త ఫీచర్ల (new feature)ను అందించింది. దీనిలో 5 -అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, యాంటీ తెఫ్ట్ ప్రొవిజన్‌తో కూడిన స్మార్ట్ లాక్ (Smart lock), మల్టిపుల్ స్పీడ్ మోడ్ (multiple speed mode)లు వంటివి చేర్చింది. ఈ లేటెస్ట్ ఫీచర్లన్నీ ప్యూర్ ప్లూటో 7G ఈ–స్కూటర్‌ను ముందు వరుసలో నిలబెట్టాయి. ఈ స్కూటర్‌ను సులభంగా ఛార్జ్ చేయవచ్చు. స్కూటర్ కొనుగోలు సమయంలో వచ్చే పోర్టబుల్ బ్యాటరీ (Portable battery) ప్యాక్‌తో మీరు మీ ఇంటి వద్దే దీన్ని ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీ 60V 2.5kWh పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 90 నుంచి -120 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అయితే, ఫుల్ ఛార్జ్ చేసేందుకు గరిష్టంగా 4 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్‌పై గరిష్టంగా 60kmph వేగంతో ప్రయాణించవచ్చు.
మరోవైపు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 40kmph చేరుకోవడానికి 5 సెకన్ల యాక్సిలరేషన్ సమయం పడుతుంది. దీనిలో10 -అంగుళాల అల్లాయ్ వీల్స్, 12-డిగ్రీ గ్రేడబిలిటీ, ఇద్దరు వ్యక్తులకు సౌకర్యవంతమైన సీటింగ్ వంటివి అందించింది. ప్యూర్ EPluto 7G ఎలక్ట్రిక్ స్కూటర్ రూబీ రెడ్, షాడో బ్లాక్, ఎలక్ట్రాన్ బ్లూ, యాక్టివ్ గ్రే, పెర్లీ వైట్, స్ట్రిప్లింగ్ ఎల్లో అనే 6 మల్టిపుల్ కలర్ ఆప్షనల్లో లభిస్తుంది. ఇది రూ.79,999 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉంటుంది. నెలకు కేవలం రూ. 2,838 చెల్లించి నో కాస్ట్ ఈఎంఐ విధానంలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.