Hurun Rich List 2021: స్వయం శక్తితో వేల కోట్లు సంపాదించిన యువ వ్యాపారవేత్తలు వీరే.. జాబితాను ప్రకటించిన హురున్ ఇండియా

దివ్యాంక్,​​ బిన్నీ బన్సల్​, రితేశ్​, నితిన్​​ కామత్​ (ఫైల్​ ఫొటోలు)

స్వయంశక్తితో 40 ఏళ్లలోపే మనదేశంలో కుబేరులుగా ఎదిగిన యువ వ్యాపారవేత్తల జాబితాను విడుదల చేశాయి ఐఐఎఫ్ఎల్ వెల్త్ (IIFL Wealth), హురున్ ఇండియా (Hurun India) సంస్థలు. ఔత్సాహిక వాణిజ్యవేత్తలుగా ఎదిగిన వారిలో కనీసం రూ.వెయ్యి కోట్లు, అంతకన్నా ఎక్కువ సంపదను కూడబెట్టిన యువ కుబేరుల జాబితాను ఈ సంస్థలు తాజాగా ప్రకటించాయి.

  • Share this:
స్వయంశక్తి (Self-efficacy)తో 40 ఏళ్లలోపే మనదేశంలో కుబేరులుగా ఎదిగిన యువ వ్యాపారవేత్తల జాబితాను విడుదల చేశాయి ఐఐఎఫ్ఎల్ వెల్త్ (IIFL Wealth), హురున్ ఇండియా (Hurun India) సంస్థలు. ఔత్సాహిక వాణిజ్యవేత్తలు (Amateur entrepreneurs) గా ఎదిగిన వారిలో కనీసం రూ.వెయ్యి కోట్లు (At least Thousand crores), అంతకన్నా ఎక్కువ సంపదను కూడబెట్టిన యువ కుబేరుల జాబితా (list)ను ఈ సంస్థలు (Companies) తాజాగా ప్రకటించాయి. ‘ఐఐఎఫ్‌ఎల్ వెల్త్, హురున్ ఇండియా- 40 అండ్ అండర్ సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ (IIFL Wealth, Hurun India-40 and Under Self Made Rich List)’ పేరుతో ఈ జాబితాను విడుదల చేశాయి. వినూత్న సేవలు, ఆవిష్కరణలతో యువ కుబేరులు (young wealthiest) మరింత సంపన్నులుగా ఎదిగారు. వేలాది కోట్ల రూపాయల సంపద (wealth)ను కూడబెట్టడమే కాదు, వేలాది మందికి ఉద్యోగాలు (jobs) కల్పిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

* ఆ పదిమంది యువ కుబేరులు వీరే

1. యువ కుబేరుల జాబితాలో మీడియా డాట్ నెట్ అధినేత, 39 ఏళ్ల దివ్యాంక్ తరూకియా (Divyank tarukia) మొదటి స్థానంలో నిలిచారు. రూ.12,500 కోట్ల సంపదతో ఆయన ఐఐఎఫ్ఎల్, హురున్ ఇండియా- 2021 జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

2. బ్రౌజర్ స్టేక్స్ (Browser stake) సహ వ్యవస్థాపకుడు, సీటీవో నకుల్ అగర్వాల్ (nakul agarwal) రూ.12,400 కోట్ల సంపదతో రెండో స్థానం దక్కించుకున్నారు.

3. బ్రౌజర్స్ స్టేక్స్ సంస్థ కో ఫౌండర్, సీఈవో రితేష్ అరోరా (ritesh arora) కూడా రూ.12,400 కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు.

4. కాన్ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకుడు, ఇంజనీరింగ్ విభాగం అధిపతైన నేహ నార్కెడే, వారి కుటుంబం హురున్ 2021 యువసంపన్నుల జాబితాలో నాలుగో స్థానం దక్కించుకున్నారు.

5. జరోదా కో ఫౌండర్, 35 సంవత్సరాల నిఖిల్ కామత్ (Nikhil kamath) రూ.11,100 కోట్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచారు. జరోదా (Zerodha) సంస్థను మన దేశంలోనే అతిపెద్ద షేర్స్ ట్రేడింగ్ కంపెనీగా తీర్చి దిద్దారు నిఖిల్ కామత్.

6. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అందిస్తున్న బైజూస్ సంస్థ  (Biju's company)వ్యవస్థాపకుడు రిజు రవీంద్రన్ (Riju Ravindran) రూ.8,100 కోట్ల సంపదతో ఆరో స్థానంలో నిలిచారు.

7. ఇక అందరికీ పరిచయం ఉన్న ఆన్ లైన్ షాపింగ్, ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకులు, 38 ఏళ్ల బిన్నీ బన్సల్.. రూ.8,000 కోట్ల సంపదతో ఏడో స్థానం దక్కించుకున్నారు.

8. ఫిప్‌కార్ట్ (Flip cart) సహ వ్యవస్థాపకులు, 40 ఏళ్ల సచిన్ బన్సల్ (Sachin Bansal) రూ.7,800 కోట్ల సంపదతో హురున్ తాజా జాబితాలో 8వ స్థానం పొందారు.

9. ఏఎన్ఐ టెక్నాలజీస్ (ANI Techologies) నెలకొల్పి.. తరువాత ఓలా సంస్థను స్థాపించిన 36 ఏళ్ల భవిష్ అగర్వాల్ రూ.6,300 కోట్ల సంపదతో 9వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 2021లో ఏకంగా 114 శాతం వృద్ధిని నమోదు చేసింది.

10. అతిథ్య సేవల సంస్థ ఓయో (OYO) రూమ్స్‌ ను నెలకొల్పిన 27 ఏళ్ల రితేష్ అగర్వాల్ రూ.6,300 కోట్ల సంపదతో పదో స్థానంలో నిలిచారు. రితేష్ సంపద ఈ ఏడాది ఏకంగా 40 శాతం పెరిగింది.
Published by:Prabhakar Vaddi
First published: