హోమ్ /వార్తలు /బిజినెస్ /

UPI Scam: ఆన్‌లైన్ పేమెంట్స్‌లో పెరిగిన మోసాలు... ఇలా జాగ్రత్తపడండి

UPI Scam: ఆన్‌లైన్ పేమెంట్స్‌లో పెరిగిన మోసాలు... ఇలా జాగ్రత్తపడండి

UPI Scam: ఆన్‌లైన్ పేమెంట్స్‌లో పెరిగిన మోసాలు... ఇలా జాగ్రత్తపడండి
(ప్రతీకాత్మక చిత్రం)

UPI Scam: ఆన్‌లైన్ పేమెంట్స్‌లో పెరిగిన మోసాలు... ఇలా జాగ్రత్తపడండి (ప్రతీకాత్మక చిత్రం)

UPI Scam | ఆన్‌లైన్ పేమెంట్స్‌లో (Online Payments) మోసాలు పెరిగిపోతున్నాయని కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ చేసేవాళ్లు అలర్ట్‌గా ఉండకపోతే చిక్కులు తప్పవు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

టెక్నాలజీ సాయంతో పేమెంట్స్ చేసే పద్ధతి చాలా సులువైపోయింది. క్షణాల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చాలా వేగంగా, సులువుగా జరుగుతున్నాయి. భారతదేశం ప్రారంభించిన యూపీఐ పేమెంట్స్ ఇంతలా సక్సెస్ కావడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. అయితే యూపీఐ ద్వారా జరిగే పేమెంట్స్ పెరిగినట్టుగా, యూపీఐ మోసాలు కూడా పెరుగుతున్నాయి. కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (NCRP) సైబర్ మోసాలకు సంబంధించిన కంప్లైంట్స్ భారీగా పెరుగుతున్నాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో సైబర్ మోసాలు 15.3 శాతం పెరిగాయి.

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లోని డేటా ప్రకారం మొదటి త్రైమాసికంలో 206198 ఫిర్యాదులు నమోదు కాగా, రెండో త్రైమాసికంలో 15.3 శాతం పెరిగి 237659 కంప్లైంట్స్ రిపోర్ట్ అయ్యాయి. కేటగిరీ వారీగా చూస్తే 2022 మొదటి త్రైమాసికంలో 62,350 యూపీఐ మోసాలు నమోదైతే, రెండో త్రైమాసికంలో 84,145 యూపీఐ మోసాలు నమోదయ్యాయి. ఏకంగా యూపీఐ మోసాల్లో 34 శాతం పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయడం పెరగడమే ఈ మోసాలు పెరగడానికి కారణం. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం సెప్టెంబర్ చివరి నాటికి యూపీఐ పేమెంట్స్ 1200 శాతం పెరిగాయి.

Cruise Tour: అలలపై కాసేపు సరదాగా... విశాఖ టూరిస్టులకు క్రూజ్ టూర్

కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం మొత్తం సైబర్ నేరాళ్లో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు 67.9 శాతం ఉన్నాయి. డెబిట్ కార్డ్ , క్రెడిట్ కార్డ్ , సిమ్ స్విచ్ ఫ్రాడ్ లాంటి వాటి ద్వారా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. 2022 మొదటి త్రైమాసికంలో ఇలాంటి 24,270 మోసాలు జరిగాయి. రెండో త్రైమాసికంలో ఈ మోసాలు 26,793 కి పెరిగాయి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంప్లైంట్స్ తగ్గడం విశేషం. 2022 మొదటి త్రైమాసికంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాలకు సంబంధించి 20,443 కంప్లైంట్స్ నమోదైతే, రెండో త్రైమాసికంలో 19,267 ఫిర్యాదులు నమోదయ్యాయి.

అయితే ప్రజలు ఎక్కువగా అలవాటుపడ్డ యూపీఐ పేమెంట్స్‌లో మోసాలు పెరుగుతుండటం ఆందోళనకరం. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం , వాట్సప్ లాంటి సంస్థలు యూపీఐ సేవల్ని అందిస్తున్నాయి. మీరూ తరచూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్టైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

Business Idea: అదనంగా ఆదాయం కావాలా? ఈ ఆఫర్ మీకోసమే... జస్ట్ టెన్త్ పాసైతే చాలు

యూపీఐ మోసాల్లో ఎక్కువగా పిన్ మోసాలు జరుగుతుంటాయి. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా పిన్ ఎంటర్ చేయడం తప్పనిసరి. కానీ డబ్బులు స్వీకరించడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం తెలియనివారే ఎక్కువగా మోసపోతుంటారు. ఏదో ఏ కారణంతో డబ్బులు పంపిస్తున్నామని మోసగాళ్లు నమ్మించి మీ అకౌంట్ ఖాళీ చేసే అవకాశముంది. ఎట్టిపరిస్థితుల్లో మీరు డబ్బులు స్వీకరించాలనుకుంటే పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదన్న విషయం గుర్తుంచుకోండి.

ఇక మీ యూపీఐ పిన్ ఎవరితో షేర్ చేయకూడదు. బ్యాంకులు, ఇతర సంస్థలు యూపీఐ పిన్ అడగవన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎవరైనా యూపీఐ పిన్ అడుగుతున్నారంటే మోసం చేస్తున్నారని గ్రహించాలి. నెలకోసారైనా మీ యూపీఐ పిన్ మారుస్తూ ఉండాలి. యూపీఐ పేమెంట్స్ చేసేప్పుడు మీరు ఎవరికి డబ్బులు పంపిస్తున్నారో పేరు కరెక్ట్‌గా చెక్ చేయాలి. అవసరం అయితే ఒక రూపాయి ముందుగా ట్రాన్స్‌ఫర్ చేసి, కరెక్ట్‌గా డబ్బులు పంపారో లేదో వెరిఫై చేసి మిగతా మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయాలి.

First published:

Tags: Google pay, Paytm, PhonePe, UPI, Upi payments

ఉత్తమ కథలు