Home /News /business /

HUGE OFFERS ON ONEPLUS DEVICES AT AMAZON GREAT INDIAN FESTIVAL SALES CLICK HERE TO SEE WHAT IS DISCOUNT AND CASHBACK PRV GH

OnePlus Smart Phones: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో వన్‌ప్లస్‌ డివైజ్‌లపై భారీ ఆఫర్లు.. డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఎంతంటే..

అమెజాన్​ (PC: Amazon)

అమెజాన్​ (PC: Amazon)

ఇంకొన్ని గంటల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రారంభం కానుంది. అక్టోబరు 3 నుంచి ప్రారంభం కానున్న ఈ ఆఫర్ల జాతరలో.. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించాయి.

ఇంకొన్ని గంటల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ (Amazon Great Indian Festival sales) ప్రారంభం కానుంది. అక్టోబరు 3 నుంచి ప్రారంభం కానున్న ఈ ఆఫర్ల జాతరలో.. చాలా కంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్ల (discounts)ను ప్రకటించాయి. స్మార్ట్‌ఫోన్‌ (smart phones) దిగ్గజం వన్‌ప్లస్‌ (One plus) కూడా వివిధ మోడళ్లపై ఆఫర్లు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వన్‌ప్లస్‌9 5జీ, వన్‌ప్లస్‌ 9 ప్రో 5జీ, వన్‌ప్లస్‌ 9ఆర్ 5జీ లాంటి స్మార్ట్‌ఫోన్‌ (smart phones)ల ధరను సంస్థ తాత్కాలికంగా తగ్గించింది. వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ, నార్డ్ సీఈ 5జీ లాంటి డివైజ్‌ (device)లపై బ్యాంక్ ఆఫర్లు ప్రకటించింది. వన్‌ప్లస్‌ బడ్స్ జెడ్, బడ్స్ ప్రో లాంటి ప్రొడక్ట్స్ ధరలను సైతం తగ్గించింది. ఫలితంగా వినియోగదారులు తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేసుకోవచ్చు.

మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్..

వన్‌ప్లస్‌ 9 ప్రో 5జీ రిటైల్ ధరను సంస్థ రూ.57,999గా నిర్దేశించింది. 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ ధరకు లభ్యమవుతుంది. ఇందులో మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వన్‌ప్లస్‌ 9 5జీ స్మార్ట్‌ఫోన్‌ బేస్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.39,999కు అందజేస్తుంది. దీంతోపాటు వన్‌ప్లస్‌ 9ఆర్ 5జీ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌లో భాగంగా రూ.39,999 ధర ఉండే ఈ ఫోన్‌ను రూ.34,999కు అందిస్తుంది. ఇది 128జీబీ స్టోరేజ్‌తో, క్వాల్‌కామ్‌ స్నాప్ డ్రాగన్ 870 ఎస్ఓసీతో అందుబాటులోకి వచ్చింది. గతేడాది నుంచి వన్‌ప్లస్‌ 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 35,499కు అందిస్తోంది.

అదనపు క్యాష్ బ్యాక్..

వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ, నార్డ్ సీఈ 5జీ ఫోన్ల ధరను కంపెనీ తగ్గించలేదు. కానీ వినియోగదారులకు (users) బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. ఫలితంగా వీటిని ఉపయోగించుకొని ధర తగ్గించుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు (ICICI Bank debt and credit)లు ఉపయోగిస్తున్నవారు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లను వినియోగించుకోవచ్చు. ఈఎంఐ పేమెంట్ మోడ్ (EMI Payment mode), ఎక్స్ఛేంజ్ (Exchange) ఆఫర్లు కూడా పొందవచ్చు.

వన్‌ప్లస్‌ బడ్స్ ప్రో టీడబ్ల్యూఎస్ మైక్రో ఫోన్లు ప్రస్తుతం రూ.9,999కు అందుబాటులో ఉండగా.. ఈ సేల్‌లో ధర తగ్గనుంది. వన్‌ప్లస్‌ బడ్స్ జెడ్(రూ.2,999), వన్‌ప్లస్‌ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ సిరీస్(రూ.1,999), 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్(రూ.1,299)పై డిస్కౌంట్లను ప్రకటించింది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, BUSINESS NEWS, Mobiles, ONE PLUS

తదుపరి వార్తలు