Home /News /business /

HUAWEI HAS LAUNCHED ANOTHER NEW SMARTWATCH CALLED HUAWEI WATCH FIT IN INDIA SEE FULL SPECIFICATIONS AND PRICE DETILAS HERE PRV GH

Huawei Watch Fit: భారత్‌లో లాంచ్ అయిన హువావే వాచ్ ఫిట్.. 1.64 అంగుళాల డిస్‌ప్లేతో పాటు మరెన్నో కొత్త ఫీచర్లు

హువాయ్​ స్మార్ట్​ వాచ్​ (photo: DahodianTechie/Twitter)

హువాయ్​ స్మార్ట్​ వాచ్​ (photo: DahodianTechie/Twitter)

ప్రముఖ స్మార్ట్ ప్రొడక్ట్స్ బ్రాండ్ హువావే భారత్‌లో మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన హువావే వాచ్ ఫిట్ (Huawei Watch Fit) స్మార్ట్‌వాచ్‌ను తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది.

ప్రముఖ స్మార్ట్ ప్రొడక్ట్స్ బ్రాండ్ హువావే (Huawei) భారత్‌లో మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ (New smartwatch)ను విడుదల (launch) చేసింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన హువావే వాచ్ ఫిట్ (Huawei Watch Fit) స్మార్ట్‌వాచ్‌ను తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది. ఈ వాచ్ ఏకంగా 1.64 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. యానిమేటెడ్ పర్సనల్ ట్రైనర్, 10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ (battery backup) వంటి ఫీచర్లు దీని సొంతం. ఈ వాచ్ ఫిట్.. హువావే బ్యాండ్ 6ని పోలి ఉంటుంది. కానీ ఇందులో అనేక కొత్త ఫీచర్ల (new features)ను సంస్థ చేర్చింది.

కస్టమర్లకు ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసినట్లు చెప్పారు హువావే ఇండియా కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ రిషి కిషోర్ గుప్తా. ‘హువావేకి భారతదేశం చాలా ముఖ్యమైన మార్కెట్‌గా ఉంది. ఈ మర్కెట్‌ను మరింత వృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కస్టమర్ల కోసం తాజా స్మార్ట్‌వాచ్‌ (new smart watches)పై అనేక ఆఫర్లను అందుబాటులో ఉంచాం. వినూత్న సాంకేతికతతో రూపొందించిన స్మార్ట్ వేరబుల్స్‌పై మేం దృష్టి పెట్టాం. ఈ క్రమంలో వాచ్ ఫిట్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించాం’ అని తెలిపారు.

* హువావే వాచ్ ఫిట్ ధర..

భారతదేశంలో హువావే వాచ్ ఫిట్ (Huawei watch fit) ధర రూ.8,990 నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌వాచ్ నవంబర్ 2 నుంచి అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. దీన్ని సాకురా పింక్, ఐల్ బ్లూ, గ్రాఫైట్ బ్లాక్‌ (graphite black) సహా అనేక రిస్ట్ స్ట్రాప్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచారు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా వాచ్ ఫిట్‌ను కొనుగోలు చేసేవారు హువావే మినీ స్పీకర్‌ను ఉంచితంగా పొందవచ్చు.

* స్పెసిఫికేషన్లు..

హువావే వాచ్ ఫిట్ స్మార్ట్‌వాచ్‌ (Huawei Watch Fit smart watch) ను 1.64 అంగుళాల AMOLED HD డిస్‌ప్లేతో రూపొందించారు. దీని డిస్‌ప్లే అల్ట్రా-స్లిమ్ బెజెల్స్, 70 శాతం బాడీ-టు-స్క్రీన్ రేషియోతో వస్తుంది. వినియోగదారులు (users) మిరుమిట్లు గొలిపే రంగురంగుల బ్రైట్‌నెస్‌ను ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ డివైజ్ 130కి పైగా విభిన్న వాచ్ ఫేస్‌లతో వస్తుంది. స్మార్ట్‌వాచ్‌లో 12 యానిమేటెడ్ ఫిట్‌నెస్ కోర్సులు, 44 స్టాండర్డ్ ఫిట్‌నెస్ వ్యాయామాలు ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్, ఇతర డివైజ్ అవసరం లేకుండా వీటి సాయంతో ఫిట్‌నెస్ ట్రైనింగ్ పొందవచ్చు.

ఈ స్మార్ట్‌వాచ్‌ను ఛార్జింగ్ టెక్నాలజీ (charging technology)తో రూపొందించారు. వాచ్ ఫిట్ డివైజ్ 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. కేవలం అరగంటలో దీని బ్యాటరీ 70 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ వాచ్‌లో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి 96 వర్కవుట్ మోడ్స్ ఉన్నాయి. హార్ట్ బీట్ రేటు, నిద్ర, పీరియడ్స్, SpO2 ట్రాకర్‌ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Huawei, Smartwatch

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు