Auto Debit: అక్టోబర్ 1 నుంచి మారనున్న ఆటో డెబిట్ పేమెంట్స్ నిబంధనలు..కొత్త రూల్స్ తెలుసుకోండి..!

(ప్రతీకాత్మక చిత్రం)

ఆటో డెబిట్ లావాదేవీలపై కొత్త రూల్స్ తీసుకువచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రూల్స్ అక్టోబర్ 1, 2021 నుంచి అమలు కానున్నాయి. ఈ నిబంధనలతో ఇకపై మీరు కొన్ని రికరింగ్‌ బిల్లుల లావాదేవీలు మాన్యువల్‌గా పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • Share this:
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో చాలామంది డెబిట్‌, క్రెడిట్ కార్డులు విరివిగా వాడుతున్నారు. అలాగే ప్రతి నెలా ఎలక్ట్రిసిటీ బిల్లు ద‌గ్గ‌ర నుంచి ఈఎంఐల వ‌ర‌కూ డబ్బులు చెల్లించేందుకు ఆటో-డెబిట్‌ ప‌ద్ధ‌తిని బాగా వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆటో-డెబిట్‌ సౌకర్యాన్ని యూజ్ చేసుకుని ఆటోమేటిక్ గా రికరింగ్‌ బిల్లులు చెల్లించే యూజర్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే ఆటో డెబిట్ లావాదేవీలపై కొత్త రూల్స్ తీసుకువచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రూల్స్ అక్టోబర్ 1, 2021 నుంచి అమలు కానున్నాయి. ఈ నిబంధనలతో ఇకపై మీరు కొన్ని రికరింగ్‌ బిల్లుల లావాదేవీలు మాన్యువల్‌గా పూర్తి చేయాల్సి ఉంటుంది. వన్ టైం పాస్‌వర్డ్ ద్వారా కన్ఫర్మేషన్ ఇస్తేనే ఈ లావాదేవీలు జరుగుతాయి. కొత్త రూల్స్ బ్యాంకు కస్టమర్లకు తమ చెల్లింపులపై మెరుగైన నియంత్రణను అందించి.. మరింత సేఫ్టీని కల్పిస్తాయి.

Bank Interest: ఆ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్​పై అధిక వడ్డీ.. ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీల కంటే మెరుగైన వడ్డీ ఆఫర్​..


కొన్ని చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు ఇంకా ఆర్‌బీఐ కొత్త నిబంధనలకు అనుగుణంగా లేనందున.. లావాదేవీలు ఫెయిల్ కావచ్చునని అనేక బ్యాంకులు తమ కస్టమర్లను ఇప్పటికే హెచ్చరించాయి. ఆర్‌బీఐ.. రికరింగ్‌ ఆన్‌లైన్ లావాదేవీల కోసం ఈ- మ్యాండేట్ (e-mandates) ప్రాసెసింగ్ ను మార్చి, 2021 నుంచే అమలులోకి తీసుకురావాల్సి ఉంది. అయితే చాలా మంది వాటాదారులు సమయం పొడిగించాల్సిందిగా కోరడంతో కొత్త నిబంధనల అమలును అక్టోబర్ 1, 2021 వరకు వాయిదా వేసింది ఆర్‌బీఐ.

‘అక్టోబర్ 1, 2021 నుంచి అమలు కానున్న ఆర్‌బీఐ నూతన నిబంధనల ప్రకారం.. ఇకపై ప్రామాణిక సూచనల (స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌) ద్వారా లావాదేవీలు నిర్వహించలేం. మర్చంట్‌ వెబ్ సైట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు నూతన నిబంధనలకు లోబడి ఉంటేనే చెల్లింపుల చేయగలం’ అని తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన కస్టమర్లకు సమాచారం అందించింది.

"ఆర్‌బీఐ కొత్త షరతులకు అనుగుణంగా కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంకులు, మర్చంట్ అక్వైరింగ్ బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌లు, వ్యాపారులతో సహా వాటాదారులందరూ సమన్వయంతో కృషి చేయాలి. ఒక కామన్ ప్లాట్‌ఫామ్ కు సంబంధించి అభివృద్ధి, ఏకీకరణ, విస్తరణను కంప్లీట్ చేయాలి. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ కామన్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధిని.. బ్యాంక్ అంతర్గత అభివృద్ధి, ఏకీకరణలను పూర్తి చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను కస్టమర్‌ల కోసం త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు వ్యాపారులతో కలిసి పని చేస్తోంది" అని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

SBI Loan Offers: రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు.. అతి తక్కువ వడ్డీకే రుణాలు.. పూర్తి వివరాలివే..!


‘ఆర్‌బీఐ 20.09.21న జారీ చేసిన రికరింగ్‌ పేమెంట్‌ మార్గదర్శకాల ప్రకారం.. మీ యాక్సిస్‌ కార్డులపై ప్రామాణిక సూచనల(స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌) ద్వారా చేస్తున్న లావాదేవీలు ఇక జరుగవు. నిరంతరాయ సేవల కోసం మీరు నేరుగా మర్చంట్‌కి మీ కార్డు ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు’ అని యాక్సిస్‌ బ్యాంక్‌ తన వినియోగదార్లకు తెలియజేసింది.

సేఫ్టీ, సెక్యూరిటీ, రికరింగ్‌ చెల్లింపుల సౌలభ్యాన్ని బాలెన్స్ చేయడం
2018లో ఆర్‌బీఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) డిజిటల్ పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈ-మ్యాండేట్ (e-mandate)ను ప్రవేశపెట్టింది. ఈ-మ్యాండేట్ అంటే ప్రామాణిక సూచనలు. ఇవి కస్టమర్ల నుంచి మానవరహిత చెల్లింపులను సేకరించడానికి కార్పొరేట్లను అనుమతిస్తున్నాయి. ఈ ఫ్రేమ్‌వర్క్ ద్వారా మ్యూచువల్ ఫండ్ సిప్ లు, వార్తాపత్రిక బిల్లులు, రుణాల ఈఎంఐల తదితర ఆటో డెబిట్ లావాదేవీలను మీ బ్యాంకు ప్రాసెస్ చేస్తుంది.

కొత్త నిబంధన ప్రకారం.. డెబిట్/క్రెడిట్ కార్డులు, వాలెట్‌లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపీఐ) ఉపయోగించి రికరింగ్‌ ఆన్‌లైన్ లావాదేవీల చెల్లించాలంటే అదనపు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కార్డులు, వాలెట్‌లు, యుపీఐ ద్వారా రూ. 5,000 కంటే తక్కువ లావాదేవీలకు సెంట్రల్ బ్యాంకులు అదనపు ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) ను ప్రవేశపెట్టాయి. దీని అర్థం బ్యాంకులు కస్టమర్‌లకు ప్రీ-డెబిట్ మెసేజ్ లేదా ఈమెయిల్ పంపుతాయి. కస్టమర్‌లు తమకు అవసరమైతే రద్దు చేయడానికి పేమెంట్ కు ముందు కనీసం 24 గంటల సమయం ఇస్తాయి.

అలాగే కొత్త నిబంధనల ప్రకారం రూ.5,000కి మించిన ఆటోమేటెడ్ చెల్లింపులను కస్టమర్లు మాన్యువల్‌గా వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ ట్రాన్సాక్షన్ నోటిఫికేషన్ లో మర్చంట్ పేరు, లావాదేవీ మొత్తం, తేదీ, డెబిట్ సమయం, లావాదేవీ రిఫరెన్స్ నంబర్, కార్డుదారుడు నమోదు చేసిన ఈ-మ్యాండేట్ (e-mandate) గురించి వివరాలు ఉంటాయి.
Published by:Krishna Adithya
First published: