హోమ్ /వార్తలు /బిజినెస్ /

Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ పెంచుకోవడం సాధ్యమేనా? ఎంత మొత్తానికి పాలసీ పొందొచ్చు?

Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ పెంచుకోవడం సాధ్యమేనా? ఎంత మొత్తానికి పాలసీ పొందొచ్చు?

Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ పెంచుకోవడం సాధ్యమేనా? ఎంత మొత్తానికి పాలసీ పొందొచ్చు?

Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ పెంచుకోవడం సాధ్యమేనా? ఎంత మొత్తానికి పాలసీ పొందొచ్చు?

Term Insurance | మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Insurance Cover | ఇన్సూరెన్స్ పాలసీ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, మనీ (Money) బ్యాక్ ఇన్సూరెన్స్ ఇలా పలు రకాలు ఉంటాయి. వీటిల్లో మనం ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ (Insurance) అంటే.. మనకు ఏమైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక భద్రత లభించాలనే లక్ష్యంతోనే ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. అందువల్ల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.

పిల్లల చదువు, పెళ్లి, లోన్స్, జీవనం, ఇతర ఖర్చులు ఇలా అన్నింటినీ చూసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి. ఒక్కసారి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే.. ఆ ప్లాన్ గడువు ముగిసే వరకు అందులో ఎలాంటి మార్పులు చేయడానికి వీలు ఉండదు. అంటే బీమా మొత్తాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉండదు. మీరు పాలసీ తీసుకునే సమయంలో ఎంత బీమాకు అయితే పాలసీ పొందారో పాలసీ టెన్యూర్ వరకు అదే బీమా మొత్తం ఉంటుంది.

ఈ బ్యాంక్‌లో అకౌంట్ ఉన్న వారికి భారీ శుభవార్త!

మరి ఇలాంటి సమయంలో బీమా మొత్తాన్ని పెంచుకోవాలని భావిస్తే ఏం చేయాలి? దీనికి ఒక ఆప్షన్ ఉంది. కొత్త పాలసీ కొనుగోలు చేయడమే. లేదంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలోనే ఇంక్రీజింగ్ కవర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇలా చేస్తే.. ప్రతి ఏటా ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ వస్తుంది. ఇలా కంపెనీ నిర్దేశించిన లిమిట్ వరకు కవరేజ్ పెరుగుతుంది.

రూ.1,700కే విమాన టికెట్.. రిపబ్లిక్ డే ఆఫర్ అదుర్స్!

ఇకపోతే చాలా మందిలో ఎంత మొత్తానికి బీమా పాలసీ తీసుకోవాలనే అంశంపై సందిగ్దత ఉండొచ్చు. ఇక్కడ మీరు ఎంచుకునే బీమా మొత్తం ప్రాతిపదికననే మీ ప్రీమియం మొత్తం ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీ అవసరాలు అన్నీ కవర్ అయ్యేలా బీమా మొత్తాన్ని ఎంచుకోండి. సాధారణంగా చూస్తే.. మీ వార్షిక ఆదాయానికి పది రెట్లు వరకు బీమా కవరేజ్ పొందొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. దీనికి అనుగుణంగా బీమా మొత్తాన్ని ఎంపిక చేసుకోండి.

ఇంకా ప్రీమియం మొత్తాన్ని కూడా చూడాలి. ఎందుకంటే ప్రీమియం ఎక్కువ అయితే కట్టడం కష్టం అవుతుంది. అందువల్ల అధిక ప్రీమియం భారాన్ని కూడా చూసుకోవాలి. అన్నింటినీ బేరిజు వేసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. తొందరపడి పాలసీ తీసుకుంటే బీమా మొత్తాన్ని పెంచుకోవడం కుదరదు. అందుకే ఆలోచించి టర్మ్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమం.

First published:

Tags: Insurance, LIC, Life Insurance, Money, Term insurance

ఉత్తమ కథలు