హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను 50% వరకు తగ్గించుకోవచ్చు.. ఎలాగంటే..?

Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను 50% వరకు తగ్గించుకోవచ్చు.. ఎలాగంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా ఆరోగ్య అవసరాలకు ఏటా ఖర్చు చేసే మొత్తంలో ప్రీమియంకు చెల్లించే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. వివిధ మార్గాల్లో డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Health Insurance: కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ పెరిగింది. కోవిడ్ సంక్షోభం తర్వాత పాలసీలు తీసుకునే వారి సంఖ్య చాలా వరకు పెరిగింది. ఆర్థికంగా తమను తాము రక్షించుకోవడానికి అందరికీ హెల్త్ కవరేజీ అవసరం. ఇన్సూరెన్స్‌(Insurance) కంపెనీలు ప్రజలకు పాలసీ బెనిఫిట్స్‌ అందించేందుకు కొత్త కొత్త ప్రొడక్టులను అందిస్తున్నాయి. క్లెయిమ్‌ చేయకుండా ఉంటే.. రెన్యూవల్‌ సమయంలో ప్రీమియంలో 100% వరకు మాఫీ అవుతుంది. అంతే కాదు వివిధ మార్గాల్లో చెల్లించాల్సిన ప్రీమియంను 50 నుంచి 90 శాతం వరకు తగ్గించుకోవచ్చు.

సాధారణంగా ఆరోగ్య అవసరాలకు ఏటా ఖర్చు చేసే మొత్తంలో ప్రీమియంకు చెల్లించే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. వివిధ మార్గాల్లో డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా చాలా ప్రయోజనాలు లభిస్తాయి. అదెలా సాధ్యమంటారా? పాలసీబజార్‌.కామ్‌ హెల్త్ ఇన్సూరెన్స్, బిజినెస్ హెడ్ న్యూస్‌18తో పంచుకున్న వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

* యాన్యువల్‌ హెల్త్‌ చెకప్‌లపై సేవింగ్స్‌

కరోనా తర్వాత ఆరోగ్యంపై ప్రజల దృష్టి మారింది. ఏదైనా సమస్య వస్తే తీవ్రమయ్యే వరకు వేచిచూడకుండా.. ప్రారంభ దశలోనే నయం చేసుకోవాలనే ఆలోచన పెరిగింది. ఇప్పుడు చాలామంది తరచూ హెల్త్‌ చెకప్‌లు చేసుకుంటున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం సగటున ఒక వ్యక్తి సంవత్సరానికి రూ.2500 ఖర్చు చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఇప్పుడు రూ.2500- రూ.5000 కవరేజీతో యాన్యువల్‌ హెల్త్‌ చెకప్‌లను కూడా కవర్ చేస్తున్నాయి. ఇది ప్లాన్‌కి ఖర్చు చేస్తున్న ధరను మరింత తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండవచ్చు.

* డాక్టర్ కన్సల్టేషన్‌పై సేవింగ్స్‌

ఇటీవల కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలతో డాక్టర్ కన్సల్టేషన్‌లు సాధారణంగా మారాయి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా కచ్చితంగా డాక్డర్‌ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. కనీసం సగటు వ్యక్తి డాక్టర్ కన్సల్టేషన్‌కి సంవత్సరానికి రూ.1500- రూ.2000 వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. అందుకే డాక్టర్ కన్సల్టేషన్‌ సహా OPD ఖర్చులను కవర్ చేసే ప్లాన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. పాలసీ టెన్యూర్‌లో కన్సల్టేషన్‌ ఫీజులు పెరిగా, కవరేజీ ఆదుకుంటుంది.

* ట్యాక్స్‌ సేవింగ్స్‌

చాలా మంది ట్యాక్స్‌ సేవింగ్స్‌ కోసం పాలసీలు కొనుగోలు చేస్తుంటారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కూడా సెక్షన్ 80డి కింద పన్ను రాయితీ అందిస్తుంది. కుటుంబానికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీకి చెల్లించిన ప్రీమియం ప్రూఫ్‌ అందించడం ద్వారా, రూ.25,000 వరకు ఆదా చేయవచ్చు. అదనంగా ఇద్దరు సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తే, గరిష్టంగా రూ.50,000 వరకు డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. ఒకవేళ సీనియర్ సిటిజన్ అయిన పిల్లలు వారి సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తే, మొత్తం డిడక్షన్‌ లిమిట్‌ రూ.10,00,000 వరకు పెరుగుతుంది. రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్లే. కాబట్టి ట్యాక్స్‌ సేవింగ్స్‌ అన్నీ ఇన్‌కంగా భావించాలి.

* ఎర్లీ బర్డ్‌ బెనిఫిట్స్‌

35 ఏళ్లు నిండకముందే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేస్తే, పాలసీని రెన్యూవల్‌ చేసేటప్పుడు చాలా కంపెనీలు ప్రీమియంపై డిస్కౌంట్‌ అందిస్తాయి. యువ వినియోగదారులు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు, అందుకే కంపెనీలు వారిని ప్రోత్సహిస్తాయి. వారికి ప్రయోజనాలను అందజేస్తాయి. ఇలాంటివి ఆరోగ్య ప్రణాళిక ఖర్చును మరింత తగ్గిస్తాయి.

Income Tax Notice: ఇన్‌కం ట్యాక్స్‌ నోటీసు ఎప్పుడు జారీ చేస్తారు? తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే

* వెల్నెస్ బెనిఫిట్స్‌

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు జబ్బుపడిన వారికి లేదా వృద్ధులకు మాత్రమే కాదు. యువకులు, ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా ప్రయోజనాలు అందిస్తాయి. పాలసీలోని వెల్‌నెస్ బెనిఫిట్స్‌ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నందుకు పాలసీదారులకు రివార్డ్స్‌ అందిస్తాయి. యాప్‌ మానిటరింగ్‌, ట్రాకింగ్ స్టెప్స్‌, ఫిజికల్‌ యాక్టివిటీలను ట్రాక్‌ చేయడం ద్వారా అంచనా వేస్తాయి.

పాలసీదారులు తమ ఇన్సూరెన్స్‌ కంపెనీ నిర్దేశించిన బెంచ్‌మార్క్‌కు అనుగుణంగా ఉంటే, వారు ప్రయోజనాలకు అర్హత సాధిస్తారు. ఇవి రెన్యువల్‌లో డిస్కౌంట్, రీడీమ్ చేసుకోగల వోచర్‌లు, హెల్త్‌ చెకప్‌ కోసం రివార్డ్‌ పాయింట్స్‌ రూపంలో ఉంటాయి. వాస్తవానికి ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేవారు, రెన్యూవల్ సమయంలో ప్రీమియంపై 100% డిస్కౌంట్‌ పొందవచ్చు.

First published:

Tags: Health Insurance

ఉత్తమ కథలు