25వేల ఉద్యోగులు... 10 కోట్ల ఫోన్లు... షామీ విజయప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్

Xiaomi Mobile Phone : ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే... యాపిల్, శాంసంగ్, నోకియా అనేవాళ్లు. మరి ఇప్పుడో... అంత ఖరీదైనవి ఎందుకు... షామీ Mi ఉందిగా అంటున్నారు. చైనాకు చెందిన ఆ కంపెనీ... ఇండియాలో ఎలా 10 కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకుందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 10, 2019, 7:53 AM IST
25వేల ఉద్యోగులు... 10 కోట్ల ఫోన్లు... షామీ విజయప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్
మనుకుమార్ జైన్ (credit - twitter - #MiFan Manu Kumar Jain)
  • Share this:
Xiaomi India : షామీ ఇండియా ప్రస్థానం మొదలైంది 2014లో. అంతాకలిపి ఆరుగురు వ్యక్తులు... 10 వేల ఫోన్లను అమ్మకానికి పెట్టారు. మొదట్లో ఎవరూ ఈ ఫోన్లను కొనేందుకు ఆసక్తి చూపలేదు. కారణం ఇవి చైనా బ్రాండ్ అనే. ఐతే... కొనుకున్నవారంతా... ఇవి బాగున్నాయనీ, హైఎండ్ ఫోన్లతో కంపేర్ చేస్తే, ఇవే బెటరన్న ప్రచారం జరగడంతో... అందరూ షామీ Mi ఫోన్లవైపు చూశారు. ఇలాంటి పాజిటివ్ టాక్ వచ్చేలా చెయ్యడంలో... షామీ వైస్ ప్రెసిడెంట్, షామీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ కృషి ఎంతో ఉంది. ఢిల్లీ IITలో 2003లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన... మొదట ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరి కోడింగ్ రాసేవారు. ఆ తర్వాత అది మానేసి... కోల్‌కతా IIMలో MBA చేసి... మెకన్సీలో చేరారు. అక్కడ ఐదేళ్లు పనిచేసి చాలా విషయాలు తెలుసుకున్నారు. 2012లో ఫ్రెండ్స్‌తో కలిసి... జబాంగ్ ఫ్యాషన్ వెబ్‌సైట్ తెరిచిన మనుకుమార్... ఆ సమయంలోనే... స్మార్ట్‌ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించారు. అలా షామీ ఇండియా ప్రస్థానం మొదలైంది.

షామీ మేనేజ్‌మెంట్‌ని కలిసిన మనుకుమార్ జైన్... ఆ కంపెనీ... ఆన్‌లైన్‌లో మాత్రమే మొబైళ్లు అమ్మడం ఆయనకు నచ్చింది. ఫ్యామిలీతో కలిసి... బెంగళూర్ వెళ్లిన మనుకుమార్... షామీలో చేరి... ఇండియాలో చిన్న ఆఫీస్ తెరిచారు. మూడు నెలలపాటూ... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో సంప్రదింపులు జరిపారు. మూడు నెలల తర్వాత మరో ఉద్యోగినీ, ఆరు నెలల్లో ఆరుగురు ఉద్యోగుల్ని చేర్చుకున్నారు. ఐతే... షామీకి ఎదురైన మొదటిసవాల్... కంపెనీ పేరు. అసలా పేరు ఎలా పలకాలో చాలా మందికి అర్థమయ్యేది కాదు. చాలా మంది జియోమీ అనేవారు. Mi ఫోన్లను సైతం... షామీ, Mi, రియల్ మి, రెడ్ మి... అని రకరకాలుగా పిలిచారు. ఆ తర్వాత మెల్లగా ఈ మొబైళ్ల పేరు జనంలోకి వెళ్లింది. అదే సమయంలో... షాపుల్లో కూడా తమ హ్యాండ్ సెట్లను అమ్మకానికి పెట్టారు. అలా షామీ Mi ఫోన్లు ఎక్కువ మందికి చేరాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యే ప్రతి రెండు ఫోన్లలో ఒకటి Mi బ్రాండ్ ఉంటోంది.

ప్రస్తుతం దేశమంతా 6000కుపైగా షాపుల్లో షామీ ఫోన్లు అమ్ముతున్నారు. వాటిలో 2000 స్టోర్లు షామీవే ఉన్నాయి. 2019 సెప్టెంబరు నాటికి ఇండియాలో 10 కోట్ల షామీ ఫోన్లు అమ్ముడయ్యాయి. మార్కెట్‌లో షామీ వాటా 28 శాతానికి చేరింది. ఫ్యూచర్‌లో 100mp కెమెరా కూడా తేబోతోంది షామీ. ఫోన్లతోపాటూ... టీవీలూ, ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌, పవర్‌బ్యాంకులు, సీసీ కెమెరాలూ, షూస్‌, ఎయిర్‌ ప్యూరిఫయర్లూ, ట్రిమ్మర్లూ, వాటర్‌ ప్యూరిఫయర్లూ, లగేజీ బ్యాగ్‌లూ, కళ్లద్దాలూ ఇలా 100 రకాల ఉత్పత్తులు రాబోతున్నాయి. ప్రస్తుతం షామీ... మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగస్వామి అయ్యింది. అందువల్ల ఈ కంపెనీ ఉత్పత్తుల్లో 65 శాతం ఇండియాలోనే తయారవుతున్నాయి.


Pics : అంజు శంకర్ డ్రెస్సులో అదరగొట్టిన అతుల్య
ఇవి కూడా చదవండి :

జగన్ మరో సంచలన నిర్ణయం... పేదలకు షాకే...అయోధ్యలో రామమందిరం ఎలా ఉంటుందో తెలుసా... ఇలా...

IND vs BAN : నేడు మూడో టీ20... గెలిస్తే సిరీస్ మనదే

అయోధ్య తీర్పు రాసిందెవరు?... తెలిస్తే షాక్ అవ్వరు
Published by: Krishna Kumar N
First published: November 10, 2019, 7:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading