హోమ్ /వార్తలు /బిజినెస్ /

How to Withdraw Money From PF Account Online: మీ ఇంటి నుంచే మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా డ్రా చేయండి ఇలా

How to Withdraw Money From PF Account Online: మీ ఇంటి నుంచే మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా డ్రా చేయండి ఇలా

How to Withdraw Money From PF Account Online: మీ ఇంటి నుంచే మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా డ్రా చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

How to Withdraw Money From PF Account Online: మీ ఇంటి నుంచే మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా డ్రా చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

How to Withdraw Money From PF Account Online | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) టెక్నాలజీ సాయంతో ఈపీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్‌ను వేగవంతం చేసింది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఆన్‌లైన్‌లో క్లెయిమ్ సబ్మిట్ చేయొచ్చు.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు డ్రా చేస్తూ ఉంటారు. గతంలో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడం చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈపీఎఫ్ క్లెయిమ్ (EPF Claim) ఫామ్ పూర్తి చేసి, ఈపీఎఫ్ కార్యాలయంలో సబ్మిట్ చేసి, డబ్బులు అకౌంట్‌లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) టెక్నాలజీని ఉపయోగించుకొని ఈపీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్‌ను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఆన్‍‌లైన్‌లోనే క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. డబ్బులు నేరుగా అకౌంట్‌లో జమ అవుతాయి. అయితే ఆన్‌లైన్‌లో పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి (How to Withdraw Money From PF Account Online) అన్న సందేహాలు ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసే ముందు బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి. ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక బ్యాలెన్స్ చెక్ చేసిన తర్వాత ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌లో క్లెయిమ్‌కు దరఖాస్తు చేయొచ్చు. పీఎఫ్ క్లెయిమ్ విజయవంతం కావాలంటే మీ యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. యూఏఎన్ నెంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. యూఏఎన్ యాక్టివేట్ చేసినప్పుడు ఉపయోగించిన మొబైల్ నెంబర్ కూడా యాక్టీవ్‌లో ఉండాలి. ఈపీఎఫ్ క్లెయిమ్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈ సెక్షన్స్‌తో ట్యాక్స్ బెనిఫిట్స్ పొందండి

ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయండి ఇలా


Step 1- ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ https://epfindia.gov.in/ ఓపెన్ చేయండి.

Step 2- హోమ్ పేజీలో Online Claims పైన క్లిక్ చేయండి.

లేదా నేరుగా https://unifiedportal-mem.epfindia.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయొచ్చు.

Step 3- యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

Step 4- లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ సెక్షన్ క్లిక్ చేయాలి.

Step 5- ఆన్‌లైన్ సర్వీసెస్ ట్యాబ్ ఓపెన్ చేయాలి.

Step 6- క్లెయిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 7- ఆ తర్వాత స్క్రీన్‌లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.

Step 8- ఆ తర్వాత ఆన్‍‌లైన్ క్లెయిమ్ పైన క్లిక్ చేయాలి.

Step 9- PF Advance (Form 31) సెలెక్ట్ చేసి కారణాన్ని వివరించాలి.

Step 10- ఆ తర్వాత క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయాలి.

Savings Account: సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి రూ.10,000 వరకు బెనిఫిట్

పీఎఫ్ క్లెయిమ్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో మీ బ్యాంక్ అకౌంట్‌లోకి నాన్ రీఫండబుల్ పీఎఫ్ అడ్వాన్స్ జమ అవుతుంది.

First published:

Tags: Epf, EPFO, Personal Finance, PF account, Pf balance

ఉత్తమ కథలు