పాస్‌బుక్ పోయినప్పుడు బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బుని ఇలా పొందొచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

Bank account | కొన్ని సందర్భాల్లో బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ పోయినప్పుడు..అందులోని డబ్బు తీసుకోవడానికి నానా తంటాలు పడుతుంటాం. కానీ, కొన్ని ఆధారాలు సమర్పిస్తే మనం ఆ డబ్బును తిరిగిపొందొచ్చు అదెలా అంటే..

  • Share this:
    బ్యాంక్ నియమాల ప్రకారం ఖాతాదారుడు పాస్‌బుక్ కోల్పోయినప్పడు..ఇతర ఐడీ కార్డ్స్ ఆధారంగా.. అంటే మనం అకౌంట్ తెరిచేటప్పుడు ఏ గుర్తింపు కార్డ్స్ ఇస్తామో.. వటిని చూపించి బ్యాంక్ ఖాతా తనదేనని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అనంతరం డూప్లికేట్ పాస్‌బుక్ తీసుకోవాలంటూ బ్యాంక్‌కి రిక్వెస్ట్ చేస్తూ డబ్బులు చెల్లించాలి. అప్పుడు మీకు కొత్త పాస్‌బుక్ వస్తుంది. ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా బ్యాంక్ అధికారులు కూడా ఖాతాదారులకు సహకరించాల్సి ఉంటుంది. అయితే.. మనం పోగొట్టుకున్న పాస్‌బుక్ ఖాతాలో రెగ్యులర్‌గా లావాదేవీలు జరగాలి. అలా కాకుండా.. ఎక్కువకాలం పాటు ఉపయోగించకపోతే మాత్రం.. ఖాతాను మూసివేసే అధికారం బ్యాంకుకి ఉంటుంది.

    కాబట్టి బ్యాంక్ పాస్ బుక్ పోయినప్పుడు కొత్త పాస్‌బుక్‌కి అప్లై చేసుకోవచ్చు. అందులోని నగదుని తిరిగిపొందొచ్చు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే బ్యాంకింగ్ అంబుడ్స్‌మ్యాన్‌కి ఫిర్యాదు చేయొచ్చు. లేదా.. దగ్గరలోని వినియోగదారుల ఫోరంలో కూడా కంప్లైంట్ చేయొచ్చు.
    First published: